ఢిల్లీ వర్సిటీ ఎన్నికల్లో ఏబీవీపీ విజయం


Sat,September 14, 2019 02:13 AM

ABVP sweeps DUSU elections wins three posts NSUI bags one

- ఒక పోస్టును దక్కించుకున్న ఎన్‌ఎస్‌యూఐ
ఢిల్లీ: ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థి సంఘం (డీయూఎస్‌యూ) ఎన్నికల్లో బీజేపీ అనుబంధ ఏబీవీపీ అధ్యక్ష పదవితోపాటు మూడు పదవులను, కాంగ్రెస్ అనుబంధ ఎన్‌ఎస్‌యూఐ కార్యదర్శి పదవిని గెలుచుకున్నాయి. కింగ్స్‌వే క్యాంప్‌లోని ఓట్ల లెక్కింపు కేంద్రం నుంచి శుక్రవారం విజేతలు తమ మద్దతుదారులతో భారీ విజయయాత్రను నిర్వహించారు. ఏబీవీపీకి చెందిన అశ్విత్ దహియా, ఎన్‌ఎస్‌యూఐకి చెందిన చేత్నాత్యాగీని 19 వేల ఓట్ల ఆధిక్యంతో ఓడించి అధ్యక్ష పదవిని దక్కించుకున్నారు. ఉపాధ్యక్ష, సంయుక్త కార్యదర్శి పదవులను ఏబీవీపీకి చెందిన ప్రదీప్ తన్వర్ 8,574, శివంగి ఖర్వల్ 2,914 ఓట్ల ఆధిక్యంతో గెలుచుకోగా, ఎన్‌ఎస్‌యూఐకి చెందిన ఆశిష్ లాంబ.. ఏబీవీపీకి చెందిన యోగిరథీని 2,053 ఓట్ల ఆధిక్యంతో ఓడించి కార్యదర్శి పదవిని దక్కించుకున్నారు. 2017లో యోగి రథీ అధ్యక్ష పదవిలో ఉన్న సమయంలోనే రామ్జాస్ కాలేజ్‌లో హింస చెలరేగింది. హింసకు వ్యతిరేకంగా విద్యార్థులు స్పష్టమైన తీర్పు ఇచ్చారని ఎన్‌ఎస్‌యూఐకి చెందిన అక్షయ్‌లక్రా ఈ సందర్భంగా పేర్కొన్నారు. డీయూఎస్‌యూలో గురువారం జరిగిన ఎన్నికల్లో నాలుగు పదవులకు నలుగురు యువతులుసహా 16 మంది పోటీ చేశారు. ఈవీఎంలు సరిగా పనిచేయక తీవ్ర విమర్శలు వచ్చినప్పటికీ 39.9 శాతం ఓట్లు పోలయ్యాయి. గత సంవత్సరం జరిగిన ఎన్నికల్లో 44.46 శాతం ఓట్లు పోలవడం విశేషం. 1.3 లక్షల మంది విద్యార్థి ఓటర్లున్న ఈ ఎన్నికలకు 52 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటుచేశారు.

130
Follow us on : Facebook | Twitter
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles