ఓటువేయని కశ్మీర్ స్వతంత్ర ఎమ్మెల్యే


Tue,July 18, 2017 01:02 AM

Abdul Rashid lone J&K MLA not to vote

శ్రీనగర్: జమ్ముకశ్మీర్ నుంచి స్వతంత్ర ఎమ్మెల్యే షేక్ అబ్దుల్ రషీద్ ఒక్కరే రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేయలేదు. బీజేపీ ఎప్పుడూ నా చాయిస్ కాదు. ఇక విపక్షానికి ఓట్లడిగే హక్కు లేదు. అందుకే ఓటింగ్‌లో పాల్గొనలేదు అని రషీద్ తెలిపారు. ప్రణబ్ ముఖర్జీ గత రాష్ట్రపతి ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి ప్రణబ్ ముఖర్జీ గెలిచినా అప్పడు ఇచ్చిన హామీలను ఆ పార్టీ తుంగలో తొక్కిందని రషీద్ ఆరోపించారు. అఫ్జల్ గురు ఉరిశిక్ష రద్దుచేయాలని కోరుతూ తాను వినతిపత్రం ఇచ్చానని, క్షమాభిక్ష పిటిషన్‌పై మానవీయంగా వ్యవహరిస్తానన్న ప్రణబ్ హామీ ఇచ్చారని చెప్పారు. అయినప్పటికీ 2013 ఫిబ్రవరి 9న తీహార్ జైల్లో అఫ్జల్‌గురుని ఉరితీశారని రషీద్ చెప్పారు.

కరుణానిధి, మరో ఇద్దరు ఎమ్మెల్యేలు దూరం
డీఎంకే అధినేత ఎం కరుణానిధి రాష్ట్రపతి ఎన్నికలకు దూరంగా ఉన్నారు. అనారోగ్య కారణాలతోనే కరుణానిధి ఓటింగ్‌లో పాల్గొనలేదని డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్ ఎంకే స్టాలిన్ తెలిపారు. మిగిలిన 88మంది డీఎంకే ఎమ్మెల్యేలు ఓటు వేశారని ఆయన చెప్పారు. కరుణానిధి గత డిసెంబర్ నుంచి అనారోగ్యంతో బాధపడుతున్న విషయం తెలిసిందే. అలాగే కర్ణాటకలో జనతాదళ్ (ఎస్) ఎమ్మెల్యే వైఎస్‌వీ దత్తా, పార్టీ నుంచి సస్పెండ్ అయిన ఎమ్మెల్యే చెలువరాయస్వామి ఓటింగ్‌లో పాల్గొనలేదు.

ఆప్ నిర్ణయానికి భిన్నంగా తిరుగుబాటు ఎమ్మెల్యేల ఓటు
రాష్ట్రపతి ఎన్నికల్లో తమకు నచ్చిన అభ్యర్థికే ఓటేశామని ఆమ్‌ఆద్మీపార్టీ తిరుగుబాటు ఎమ్మెల్యేలు తెలిపారు. ఆమ్‌ఆద్మీ పార్టీ విపక్షాల అభ్యర్థి మీరాకుమార్‌కు ఓటు వేయాలని నిర్ణయించింది. అయితే తాను మాత్రం తమకు నచ్చిన అభ్యర్థికే ఓటువేశానని ఆప్ తిరుగుబాటు ఎమ్మెల్యే కపిల్ మిశ్రా తెలిపారు. ఇదే అభిప్రాయాన్ని పంజాబ్ ఆప్ ఎమ్మెల్యే హరీందర్‌సింగ్ ఖల్సా కూడా వ్యక్తంచేశారు.

130
Tags

More News

VIRAL NEWS