జాబిల్లిపై భారత్ వెలుగులు


Fri,July 12, 2019 02:50 AM

A Simplified Look At Chandrayaan 2 Indias Most Ambitious Space Mission Yet

- చంద్రుని దక్షిణ ధ్రువం రహస్యాలను ఛేదించేందుకు సిద్దమైన చంద్రయాన్-2
- చంద్రుని మూలాలు, పరిణామ క్రమాన్ని కనిపెట్టడమే ప్రధాన ఉద్దేశం


జాబిల్లి దక్షిణ ధ్రువంపై ఇంతవరకు ఏ ఒక్క దేశమూ చేయని సాహసానికి భారత్ నడుంకట్టింది. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న చంద్రయాన్-2 ప్రయోగానికి సమయం దగ్గరపడుతున్నది. ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని శ్రీహరికోటలో ఉన్న సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ (షార్) నుంచి జూలై 15 వేకువజామున 2.51 గంటలకు జీఎస్‌ఎల్వీ మార్క్-3 రాకెట్ ద్వారా చంద్రయాన్-2ను ప్రయోగించనున్నారు. శాస్త్ర, సాంకేతిక, ఇంజినీరింగ్ విభాగాల్లో నిష్ణాతులైన నిపుణులు దశాబ్ద కాలంపాటు కృషి చేసి ఈ మిషన్‌ను సంసిద్ధం చేశారు. ఈ ప్రయోగం ద్వారా చంద్రుని దక్షిణ ధ్రువం రహస్యాలను కనిపెట్టేందుకు ఇస్రో భావిస్తున్నది.

ప్రయోగం ఉద్దేశం..

చంద్రుని మూలాలు, పరిణామ క్రమాన్ని మరింత కూలంకషంగా తెలుసుకోవడంలో చంద్రయాన్-2 మిషన్ భారత శాస్త్రవేత్తలకు సాయపడనున్నది. చంద్రుని ఉపరితల స్థలాకృతి అధ్యయనాలు, అక్కడి మట్టిలోని సమగ్ర ఖనిజ విశ్లేషణల ద్వారా చంద్రుని విశేషాలు తెలుసుకోనున్నారు. దీంతో పాటు చంద్రయాన్-1 ద్వారా చంద్రునిపై కనిపెట్టిన నీటి అణువుల జాడ, చంద్రుని ఉపరితలంపై ఉన్న ప్రత్యేక శిలాజాల రసాయనిక చర్యల క్రమం వంటి విషయాలపై కూడా ఈ ప్రయోగంతో మరింత అధ్యయనం చేయనున్నారు.

చంద్రునిపై దిగాక..

విజయవంతంగా చంద్రుని కక్ష్యలోకి ప్రవేశించిన చంద్రయాన్-2 మిషన్‌లోని ఆర్బిటార్ నుంచి మొదటగా ల్యాండర్ (విక్రవ్‌ు) విడిపోతుంది. చంద్రుని ఉపరితలంపై దిగడానికి ముందు సురక్షితమైన, ఎగుడు దిగుడు లేని ప్రాంతాన్ని ల్యాండర్ విశ్లేషించుకొని దిగుతుంది. చంద్రుని దక్షిణ ధ్రువంపై సెప్టెంబర్ 6న ల్యాండర్ దిగే అవకాశం ఉన్నది. ఆ తర్వాత రోవర్ (ప్రజ్ఞ) ఉపరితలంపై 14 రోజులు ( చంద్రుడిపై ఒక రోజుకు సమానం) పాటు వివిధ పరిశోధనలు చేస్తుంది. ఆర్బిటార్ ఒక ఏడాదిపాటు పనిచేయనుంది.
moon

చంద్రయాన్-2 వివరాలు

జీఎస్‌ఎల్వీ మార్క్ 3 రాకెట్ బరువు 640 టన్నులు
ఉపగ్రహం బరువు 3.8 టన్నులు
ప్రయోగ వ్యయం సుమారు రూ. 1000 కోట్లు


ఏ పేలోడ్ ఏం చేస్తుంది?

ప్రధాన పేలోడ్స్
- ఆర్బిటార్ - చంద్రుని ఉపరితలంపై 100 కి. మీ. పరిధిలో రిమోట్ సెన్సింగ్ పరిశోధనలు
- ల్యాండర్, రోవర్ - దిగిన ప్రాంతంలోని ఉపరితల అధ్యయనం, కొలతలు ఇతర పరిశోధనలు ఇతర పేలోడ్స్
- ఇమేజింగ్ ఐఆర్ స్పెక్ట్రో మీటర్ - ఖనిజాల మ్యాపింగ్, నీరు, మంచు నిర్ధారణ
- లార్జ్ ఏరియా సాఫ్ట్ ఎక్స్ రే స్పెక్ట్రో మీటర్ - మూలకాల స్వభావంపై అధ్యయనం
- సింథటిక్ అపార్చర్ రాడార్ ( ఎల్, ఎస్ బ్యాండ్) - ధ్రువ ప్రాంతం మ్యాపింగ్, ఉపరితలం కింద నీరు, మంచు నిర్ధారణ
- చంద్ర సర్ఫేస్ థెర్మో, ఫిజికల్ ప్రయోగం - ఉష్ణ వాహకత, ఉష్ణోగ్రతలో మార్పుల వివరాలు సేకరించడం
- ఆర్బిటార్ హై రిజల్యూషన్ కెమెరా - ఉపరితల స్థలాకృతులకు సంబంధించి స్పష్టమైన చిత్రాలు తీయడం కోసం..

725
Follow us on : Facebook | Twitter
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles