సరిహద్దుల వెంట పాక్ సైన్యం కాల్పులుThu,October 19, 2017 01:58 AM

8 మంది పౌరులకు గాయాలు
Mortar_Shell-PTI
జమ్ము: జమ్ముకశ్మీర్‌లోని పూంచ్, రాజౌరీ జిల్లాల్లో నియంత్రణ రేఖ వెంబడి ఉన్న గ్రామాలు, సైనిక పోస్టులపై పాక్ సైన్యం బుధవారం విచక్షణారహితంగా కాల్పులకు తెగబడింది. దీంతో 8 మంది పౌరులు తీవ్రంగా గాయపడ్డట్టు అధికారులు వెల్లడించారు. పాకిస్థాన్ సైన్యం చిన్న, ఆటోమెటిక్ తుపాకులు, మోర్టార్లతో కాల్పులకు దిగింది. పాక్ రెచ్చగొట్టే చర్యలకు భారత బలగాలు దీటుగా సమాధానం చెప్తున్నాయి. కాల్పులు ఇంకా కొనసాగుతున్నాయి అని భారత సైన్యం అధికార ప్రతినిధి వెల్లడించారు. నివాస ప్రాంతాలైన బాలకోట్, బసూని, సందోటె, మంజకోటె తదితర ప్రాంతాలను లక్ష్యంగా చేసుకొని పాక్ సైన్యం భారీగా కాల్పులు జరుపడంతోపాటు మోర్టార్ దాడులకు పాల్పడుతున్నట్టు తెలిపారు.

127

More News

VIRAL NEWS