వరదలోనే ఈశాన్యం


Tue,July 16, 2019 02:59 AM

70 lakh affected in floods in Bihar northeast India

-అసోంలో 44 లక్షల మందిపై వరద ప్రభావం
-15కు చేరిన మృతుల సంఖ్య
-త్రిపుర, మేఘాలయ, మిజోరంలో ప్రజల అవస్థలు
-రంగంలోకి దిగిన సైన్యం
-బీహార్‌లో ఐదుగురు చిన్నారులు మృతి

గువాహటి (అసోం), జూలై 15: ఈశాన్య రాష్ర్టాలతోపాటు బీహార్‌ను వరద ముంచెత్తుతున్నది. దీంతో 70 లక్షల మందిపై వరద ప్రభావం పడింది. వర్షాలు, వరదల వల్ల ఇప్పటి వరకు 44 మంది మరణించారు. అసోంలోని 33 జిల్లాలకుగాను 30 జిల్లాలు వరదను ఎదుర్కొంటున్నాయి. ఈ రాష్ట్రంలో 43 లక్షల మంది వరద ప్రభావానికి గురికాగా.. 15 మంది ప్రాణాలు కోల్పోయారు. సహాయక చర్యల కోసం సైన్యం కూడా రంగంలోకి దిగింది. తాము ఇప్పటి వరకు 150 మందిని రక్షించామని సైనికాధికారి ఒకరు చెప్పారు. వరద ధాటికి ఈశాన్య రాష్ర్టాల్లో ప్రధాన నదులైన బ్రహ్మపుత్ర, జింజిరామ్ నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ప్రధాని మోదీ అసోం సీఎం సర్బానంద సోనోవాల్‌కు ఫోన్ చేసి వరద పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. మరోవైపు నైరుతి రుతుపవనాలు దేశ రాజధాని ఢిల్లీని తాకాయి. దీంతో ఢిల్లీ పరిధిలో సోమవారం వర్షం కురిసింది.
Muzaffarpur

అసోం అతలాకుతలం

అసోంలో ఆదివారం నాటికి ఎన్డీఆర్‌ఎఫ్, ఎస్డీఆర్‌ఎఫ్ దళాలు కలిసి 7,833 మందిని రక్షించాయి. రాష్ట్రంలోని బ్రహ్మపుత్ర నది ప్రమాద హెచ్చరికను దాటి ప్రవహిస్తున్నది. 3,181 గ్రామాలు నీట మునిగాయి. 1,53211 హెక్టార్లలో పంటలు దెబ్బతిన్నాయి. ప్రధాని మోదీ అసోం సీఎం సర్బానంద సోనోవాల్‌కు సోమవారం ఫోన్ చేసి వరద పరిస్థితిపై వాకాబు చేశారు. అన్ని విధాల అండగా ఉంటామని హామీ ఇచ్చారు. త్రిపురలో వరద ప్రభావం ఉన్నప్పటికీ ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పడుతున్నది. మేఘాలయలోనూ దాదాపు 1.14 లక్షల మందిపై వరద ప్రభావం పడింది. మిజోరంలో ఐదుగురు మరణించారు.

ఢిల్లీని తాకిన నైరుతి

న్యూఢిల్లీ: నైరుతి రుతుపవనాలు ఎట్టకేలకు ఢిల్లీని తాకాయి. దీంతో ఢిల్లీ, దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో సోమవారం వర్షం కురిసింది. మరోవైపు మహారాష్ట్రలోని పాల్గడ్, థాణె జిల్లాల్లో ఉన్న రెండు ప్రధాన డ్యాంలు దాదాపు నిండిపోవడంతో వాటి చుట్టుపక్కల నివసించే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. బీహార్‌లోనూ వర ద తీవ్రత అధికంగా ఉన్నది. రాష్ట్రంలో ఇప్పటి వరకు 24 మంది మరణించారు. సోమవారం వరద నీటిలో మునిగి ఐదుగురు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. 25 లక్షల మందిపై వరద ప్రభావం పడింది.
Nepal

సాయం చేయండి ప్రపంచ దేశాలను కోరిన నేపాల్

కాఠ్మండు: నేపాల్‌లో కురుస్తున్న వర్షాల వల్ల వరద పెరిగి మరణించిన వారి సంఖ్య సోమవారం నాటికి 67కు చేరుకుంది. దీంతో నేపాల్ ప్రభుత్వం ప్రపంచ దేశాల సాయాన్ని కోరింది. వరదల వల్ల అంటురోగాలు వ్యాప్తి చెందే ప్రమాదం ఉన్నదని, దీనిని నివారించడానికి సహకరించాలని విజప్తి చేసింది. పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో కురుస్తున్న వర్షాల వల్ల వరద పెరిగి నీలం వ్యాలీలో 23 మంది మరణించారు.

506
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles