విషవాయువుకు ఏడుగురు బలి


Sun,June 16, 2019 02:35 AM

7 die while cleaning septic tank in hotel near Vadodara

- ఒకరిని రక్షించబోయి మిగతావారంతా మృతి గుజరాత్‌లో ఘటన

వడోదర: సెప్టిక్‌ట్యాంకును శుభ్రం చేస్తుండగా వెలువడిన విషవాయువుతో ఏడుగురు మరణించారు. ఈ ఘటన శుక్రవారం అర్ధరాత్రి తర్వాత గుజరాత్ వడోదర జిల్లా ఫార్తికుయి గ్రామ హోటల్‌లో జరిగింది. సెప్టిక్ ట్యాంకును శుభ్రం చేసేందుకు ముందు గా ఓ పారిశుద్ధ్య కార్మికుడు అందులోకి దిగాడు. ఎంతకీ బయటకు రాకపోవడంతో అతని కోసం మరో ముగ్గు రు పారిశుద్ధ్య కార్మికులు, ఆ వెంటనే ముగ్గురు హోటల్ సిబ్బంది వెళ్లి.. ఆ విషవాయువుతో ఊపిరాడక వాళ్లంతా చనిపోయారు అని వడోదర ఇంచార్జి కలెక్టర్ కిరణ్ జవేరి తెలిపారు. విషయం తెలియగానే తాము మున్సిపల్, అగ్నిమాపక సిబ్బంది, ఇతర సహాయ సిబ్బంది అక్కడకు చేరుకుని, 3 గంటలపాటు శ్రమించి మృతదేహాలను వెలికితీశామన్నారు. హోట ల్ యజమాని హసన్ అబ్బాస్ అస్మాయిల్ బొరానియా పరారీలో ఉన్నాడన్నారు. గుజరాత్ ప్రభుత్వం ఒక్కో మృతుడి కుటుంబానికి 4 లక్షల చొప్పున పరిహారం అందజేస్తామని ప్రకటించింది. హోటల్ యజమానిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించింది.

396
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles