మేఘాలయలో కొండచరియలు విరిగిపడి ఆరుగురి మృతిMon,June 19, 2017 02:01 AM

meghalaya-landslide
షిల్లాంగ్: మేఘాలయ లో భారీ వర్షాలకు కొండచరియలు విరిగిపడి ఆరుగు రు మరణించారు. రిబో యి జిల్లా పారిశ్రామిక ప్రాంతంలో కొండచరియలు విరిగిపడటంతో ఐ దుగురు మృతిచెందారు. శనివారం ముగ్గురి మృతదేహాలు, ఆదివారం మ రో ఇద్దరు మహిళల మృ తదేహాలను వెలికితీసిన ట్టు జిల్లా ఎస్పీ రమేశ్‌సింగ్ తెలిపారు. మృతులంతా రెండు కుటుంబాలన్నారు. గాయపడిన మరో తొమ్మిది మందిని దవాఖానకు తరలించినట్టు ఎస్పీ తెలిపారు. శనివారం ఉదయం ఐదుగంటల ప్రాంతంలో డేరాల్లో నిద్రిస్తున్న వీరిపై కొండచరియలు పడటంతో ఈ ఘటన జరిగిందన్నారు. తూర్పుకాశి పర్వత జిల్లా మౌజ్‌రంగ్ ప్రాంతంలో కొండచరియ విరిగిపడి చిన్నారి మృతిచెందగా, తల్లిదండ్రులు స్వల్పగాయాలతో బయటపడ్డారు.

339

data-page-url = "https://www.ntnews.com/about-us.aspx">

More News

VIRAL NEWS

Union Budget 2018