మావోయిస్టుల పంజా


Fri,November 9, 2018 02:12 AM

5 Killed As Maoists Blow Up Bus In Chhattisgarhs Dantewada

-మందుపాతరతో మినీ బస్సు పేల్చివేత
-ఒక జవాన్, నలుగురు వ్యక్తులు మృతి
-ఛత్తీస్‌గఢ్‌లో ఘటన

కొత్తగూడెం క్రైం: త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులు మందుపాతరతో మినీ బస్సును పేల్చారు. దీంతో ఒక జవాన్, నలుగురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. ఈ సంఘటన గురువారం దంతెవాడలో చోటుచేసుకుంది. కిరాణా సరుకులు కొనుగోలు చేయడానికి కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం(సీఐఎస్‌ఎఫ్)కు చెందిన జవాన్లు మినీ బస్సులో దంతేవాడ నుంచి బచేలి ప్రాంతానికి బయలుదేరారు. సరుకులు కొనుగోలు చేసి తిరిగి వస్తుండగా మావోయిస్టులు మందుపాతర పేల్చారు. దీంతో ఒక జవాన్, బస్సు డ్రైవర్, కండక్టర్, క్లీనర్, ఒక పౌరుడు మృతిచెందారు. మరో ఇద్దరు జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం హెలికాప్టర్ ద్వారా రాయ్‌పూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఎన్నికల ప్రచారం కోసం మరికొద్ది రోజుల్లో ప్రధాని మోదీ, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ బస్తర్ ప్రాంతంలో పర్యటించనున్న నేపథ్యంలోనే మావోయిస్టులు ఇలాంటి ఘటనలకు పాల్పడుతున్నారని పోలీసు ఉన్నతాధికారులు పేర్కొన్నారు.
maoist2

534
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles