యూపీలో రైలు ప్రమాదం


Thu,October 11, 2018 01:44 AM

5 Dead and 35 Injured After Train Derails In Uttar Pradeshs Raebareli

-పట్టాలు తప్పిన న్యూ ఫరక్కా ఎక్స్‌ప్రెస్
-ఐదుగురు దుర్మరణం, 35 మందికి గాయాలు
-నలుగురి పరిస్థితి విషమం, నుజ్జునుజ్జయిన ఐదు బోగీలు
-యూపీలో పట్టాలు తప్పిన రైలు
-నలుగురి పరిస్థితి విషమం, ఐదు బోగీలు నుజ్జునుజ్జు

రాయ్‌బరేలీ, అక్టోబర్ 10: ఉత్తర్‌ప్రదేశ్‌లో ఘోర రైలు ప్రమాదం సంభవించింది. రాయ్‌బరేలీ, హర్‌చాంద్‌పూర్ రైల్వేస్టేషన్ సమీపంలో న్యూ ఫరక్కా ఎక్స్‌ప్రెస్ రైలుకు చెందిన ఇంజిన్‌తోపాటు ఐదు బోగీలు పట్టాలు తప్పాయి. ఈ ఘటనలో ఐదుగురు ప్రయాణికులు చనిపోగా దాదాపు 35 మంది తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటన హర్‌చాంద్‌పూర్ స్టేషన్‌కు 50 కి.మీ. దూరంలో బుధవారం ఉదయం 6.05 గంటల సమయంలో జరిగింది. ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. న్యూ ఫరక్కా ఎక్స్‌ప్రెస్ రైలు ఉత్తర్‌ప్రదేశ్‌లోని రాయ్‌బరేలీ నుంచి ఢిల్లీ మీదుగా పశ్చిమ బెంగాల్‌లోని మాల్దా టౌన్‌కు వెళ్తున్న సమయంలో ప్రమాదం జరిగింది. నుజ్జునుజ్జయిన బోగీల నుంచి మృతదేహాలను వెలికితీయడం కోసం స్థానిక ఎన్డీఆర్‌ఎఫ్ సిబ్బంది, రిజర్వ్ పోలీసులు చర్యలు చేపట్టారు. తీవ్రంగా గాయపడిన నలుగురిని లక్నో, రాయ్‌బరేలిలోని దవాఖానలకు తరలించి చికిత్స అందిస్తున్నారు. చనిపోయినవారిలో ఏడాది పాపతోపాటు ఏడేండ్ల చిన్నారి కూడా ఉన్నారు. మృతులందరూ బీహార్‌కు చెందినవారుగా గుర్తించారు. ఈ ప్రమాదంపై ప్రధాని నరేంద్రమోదీ, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, కేంద్ర రైల్వే మంత్రి పీయూష్ గోయల్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షలు, తీవ్రంగా గాయపడిన వారికి రూ.లక్ష చొప్పున పరిహారాన్ని గోయల్ ప్రకటించారు.

875
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles