ప్రకృతి విపత్తులతో 20 ఏండ్లలో


Fri,October 12, 2018 12:21 AM

5 88 lakh crores loss to India in 20 years with natural disasters

-భారత్‌కు 5.88 లక్షల కోట్లు నష్టం
ఐరాస: ప్రకృతి విపత్తుల కారణంగా భారత్ గత 20 ఏండ్లలో 7950 కోట్ల డాలర్ల (సుమారు రూ.5.88 లక్షల కోట్ల) నష్టాన్ని చవిచూసిందని ఐక్యరాజ్యసమితి ఒక ప్రకటనలో తెలిపింది. ఆర్థిక నష్టాలు, పేదరికం, విపత్తులు 1998-2017 పేరిట ఐరాస గురువారం ఒక నివేదికను విడుదల చేసింది. అంతకుముందు రెండు దశాబ్దాలతో పోలిస్తే గత 20 ఏండ్లలో ప్రకృతి విపత్తుల నష్టం భారత్‌లో 151 శాతం పెరిగిందని ఆ నివేదిక తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ఆర్థిక నష్టాలలో 77 శాతం ప్రకృతి విపత్తుల వల్లనే సంభవిస్తున్నాయని పేర్కొంది. ప్రకృతి విపత్తుల వల్ల జరిగిన నష్టాన్ని ఐరాస ఆ నివేదికలో దేశాల వారీగా వివరించింది. ఆ జాబితాలో అమెరికా మొదటి స్థానంలో ఉన్నది. అమెరికాకు 9440 కోట్ల డాలర్ల మేర నష్టం జరిగినట్టు ఆ నివేదిక తెలిపింది.

284
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles