జార్ఖండ్‌లో ఎదురుకాల్పులు


Tue,April 16, 2019 01:54 AM

3 Naxals CRPF jawan killed in Jharkhand encounter

-ముగ్గురు మావోయిస్టులు, ఒక జవాన్ మృతి
కొత్తగూడెం, ఏప్రిల్ 15 : జార్ఖండ్ రాష్ట్ర సరిహద్దుల్లో సోమవారం ఉదయం మావోయిస్టులు, భద్రతా బలగాలకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ముగ్గురు మావోయిస్టులు, ఒక జవాన్ మృతి చెందినట్టు పోలీసు లు ఉన్నతాధికారులు వెల్లడించారు. జార్ఖ్ఖండ్ రాష్ట్రంలోని మావోయిస్టు ప్రభావిత ప్రాంతమైన గిరిధి జిల్లాలోని అటవీప్రాంతంలో సీఆర్పీఎఫ్ 7వ బెటాలియన్ భద్రత బలగాలు గాలింపుచర్యలు చేపట్టాయి. ఈ క్రమంలో బేల్‌భా ఘాట్ అటవీ ప్రాంతంలో మావోయిస్టులు తారసపడి భద్రతా బలగాలపై కాల్పులకు పాల్పడ్డారు. దీంతో జవాన్లు ఎదురుకాల్పులు ప్రారంభించారు. సుమారు అరగంట పాటు ఇరువర్గాల మధ్య భీకరపోరు జరిగింది. కాసేపటికి జవాన్ల ధాటికి తాళలేక మావోయిస్టులు అక్కడి నుంచి తప్పించుకున్నారు. కాల్పుల విరమణ అనంతరం ఆ ప్రాంతాన్ని భద్రత బలగాలు తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. ఈ ఘటనలో ఎదురు కాల్పుల్లో మృతి చెందిన ముగ్గురు మావోయిస్టుల మృతదేహాలతోపాటు, ఒక ఏకే-47 రైఫిల్, మూడు మ్యాగజైన్‌లు, నాలుగు పైప్ బాంబులు, ఇతర వస్తు సామగ్రిని సీఆర్పీఎఫ్ జవాన్లు స్వాధీనపరుచుకున్నారు. ఈ ఘటనలో సీఆర్పీఎఫ్ 7వ బెటాలియన్‌కు చెందిన జవాన్ బిస్వజిత్ చౌహాన్ సైతం తీవ్రంగా బుల్లెట్ గాయాలై మృతి చెందినట్టు అధికారులు ధ్రువీకరించా రు. జార్ఖండ్‌లో చివరి నాలుగు దశల్లో పోలింగ్ జరుగనున్నది.

97
Follow us on : Facebook | Twitter
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles