ముగ్గురు అసోం మంత్రుల రాజీనామా


Thu,January 10, 2019 12:43 AM

3 Assam ministers resign over Citizenship Amendment Bill

-పౌరసత్వ ముసాయిదా బిల్లును వ్యతిరేకిస్తూ సీఎంకు లేఖ
గువాహటి: పౌరసత్వ ముసాయిదా బిల్లును మంగళవారం లోక్‌సభ ఆమోదించడాన్ని నిరసిస్తూ అసోం గణపరిషత్(ఏజీపీ) పార్టీకి చెందిన ముగ్గురు రాష్ట్ర మంత్రులు బుధవారం రాజీనామా చేశారు. రాజీనామా చేసిన వారిలో అసోం వ్యవసాయ శాఖ మంత్రి అతుల్ బోరా, నీటిపారుదల శాఖ మంత్రి కేశవ్ మహంతా, పౌర సరఫరాల శాఖ మంత్రి ఫణిభూషణ్ ఉన్నారు. కేంద్రం ఈ బిల్లును తీసుకురావడాన్ని నిరసిస్తూ ఇప్పటికే బీజేపీతో ఉన్న పొత్తును ఏజీపీ తెంచుకుంది. తాజాగా ముగ్గురు మంత్రులు అసోం సీఎం సర్బానంద సోనోవాల్‌కు రాజీనామా లేఖలను అందజేశారు. దీంతో అసోంలోని సంకీర్ణ ప్రభుత్వంలో మంత్రుల సంఖ్య 15కు పడిపోయింది. ఇందులో 12 మంది బీజేపీకి చెందినవాళ్లు కాగా(సీఎంతో కలిపి), ముగ్గురు బీపీఎఫ్ మంత్రులు. ఏజీపీ అధ్యక్షుడు అతుల్ బోరా మాట్లాడుతూ తమకు రాష్ట్ర ప్రజల ప్రయోజనాలే ముఖ్యమన్నారు.

141
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles