డిజిటల్ లావాదేవీలు 25వేల కోట్లు!Wed,January 11, 2017 01:39 AM

paypal
న్యూఢిల్లీ, జనవరి 10: పెద్దనోట్ల రద్దు తర్వాత డిజిటల్ లావాదేవీలు గణనీయంగా పెరిగాయని ప్రభుత్వ రంగ బ్యాంకు ఎస్‌బీఐ పేర్కొంది. 50 రోజుల లావాదేవీల తీరుతెన్నులపై ఎస్‌బీఐకి చెందిన ఆర్థిక పరిశోధన విభాగం ఒక అధ్యయనం నిర్వహించగా సుమారు రూ.25వేల కోట్ల మేరకు ఎం-వ్యాలెట్లు, పాయింట్ ఆఫ్ సేల్ మిషన్ల ద్వారా లావాదేవీలు జరిగినట్టు తేలింది. పెద్దనోట్ల డిపాజిట్‌కు కేంద్రం విధించిన గడువు ముగిసిన తర్వాత 2016 డిసెంబర్ 30 నుంచి 2017 జనవరి 3వ తేదీ వరకు ఈ అధ్యయనం కొనసాగింది. మొత్తం లావాదేవీల్లో డిజిటల్ చెల్లింపులు సుమారు 15 శాతం వరకు ఉన్నట్టు తేలింది. ఇది ఒక సానుకూల ప్రారంభమని ఎస్‌బీఐ రిసెర్చ్ విభాగం తన నివేదికలో వ్యాఖ్యానించింది. పెద్ద నోట్ల రద్దు తర్వాత చాలామంది వ్యాపారులు నగదు లావాదేవీలకే ప్రాధాన్యం ఇవ్వడం, నగదు లభ్యత తగినంత లేకపోవడం, పెద్ద సంఖ్యలో వ్యాపారస్తుల వద్ద ఉన్న పాయింట్ ఆఫ్ సేల్ మిషన్లు కనెక్టివిటీ సమస్యలను ఎదుర్కొనడం కారణంగా ఇది 15శాతానికే పరిమితమైందని వెల్లడించింది.

అదే సమయంలో దాదాపు 69శాతం మంది పెద్ద నోట్ల రద్దుతో తమ వ్యాపారాలు ప్రభావితమయ్యాయని చెప్పారని నివేదిక తెలిపింది. మొత్తంగా వ్యాపారాల తగ్గుదల 50 శాతం లోపు ఉందని పేర్కొంది. నిర్మాణ రంగం, సాధారణ వీధి వ్యాపారుల మీద పెద్ద నోట్ల రద్దు నిర్ణయం తీవ్ర ప్రభావం చూపింది. నిర్మాణరంగం మీద పెను దెబ్బ పడిందని 55శాతం మంది పేర్కొనగా.. తమ గిరాకీ గణనయంగా పడిపోయిందని 71శాతం మంది వీధి వ్యాపారులు తెలిపారు. మొబైల్ వ్యాలెట్ యూజర్ పరిమితిని మరింత పెంచాలని తద్వారా నగదు స్థానంలో మరిన్ని డిజిటల్ లావాదేవీలు జరుగుతాయని పేర్కొంది.

415
data-page-url = "https://www.ntnews.com/about-us.aspx">

More News

VIRAL NEWS