24 ఏండ్ల తర్వాత ఒకే వేదికపై మాయా ములాయం


Sat,April 20, 2019 09:34 AM

24 yrs of enmity gives way to Mulayam mood at Mainpuri

-మాయావతికి ములాయం పాదాభివందనం
-ఉత్తరప్రదేశ్‌లో అద్భుత ఘట్టం ఆవిష్కృతం
-మోదీలాగా ములాయం నకిలీ బీసీ నేత కాదని,అసలైన బీసీ నేత అని మాయవతి కితాబు
మెయిన్‌పురి (యూపీ), ఏప్రిల్ 19: ఉత్తరప్రదేశ్‌లో ఓ అద్భుతమైన ఘట్టం ఆవిష్కృతమైంది. సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) అగ్రనేత ములాయం సింగ్ యాదవ్, బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) అధినేత్రి మాయావతి తమ మధ్య దాదాపు రెండున్నర దశాబ్దాల (24 ఏండ్ల) నుంచి కొనసాగిన వైరాన్ని పక్కనపెట్టి చేతులు కలిపారు. శుక్రవారం మెయిన్‌పురిలో జరిగిన సభలో వీరిద్దరు కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాయావతి మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్రమోదీ నకిలీ బీసీ నాయకుడని, ములాయం సింగ్ ఆయన (మోదీ) లాంటివారు కారని, వెనుకబడిన వర్గాలకు ములాయం సింగ్ అసలు సిసలైన నాయకుడని కొనియాడారు. 1995లో స్టేట్ గెస్ట్ హౌస్ ఘటన తర్వాత ఎస్పీతో అన్ని సంబంధాలను తెగతెంపులు చేసుకున్న మాయావతి శుక్రవారం మెయిన్‌పురిలో క్రిస్టియన్ కాలేజ్ గ్రౌండ్‌కు చేరుకోగానే భారీ సంఖ్యలో ప్రజలు, ప్రత్యేకించి ఎస్పీ కార్యకర్తలు ఆమెకు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా శిరసు వంచి మాయావతికి పాదాభివందనం చేసిన ములాయం సింగ్.. ఆమెను సాదరంగా ఆహ్వానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. మాయావతిని ఎల్లప్పుడూ గౌరవించాలని తన మద్దతుదారులకు విజ్ఞప్తి చేశారు.

చాలా కాలం తర్వాత నేను, మాయావతి ఒకే వేదికను పంచుకుంటున్నాం. ఆమెను సాదరంగా ఆహ్వానించి ధన్యవాదాలు తెలియజేస్తున్నా అని ములాయం తన ప్రసంగంలో పేర్కొన్నారు. అనంతరం మాయావతి ప్రసంగిస్తూ.. స్టేట్ గెస్ట్ హౌస్ వివాదం ఉన్నప్పటికీ ములాయం సింగ్ విజయాన్ని కాంక్షిస్తూ ప్రచారం చేసేందుకు నేను ఇక్కడికి రావడంపై ప్రజలు ఆశ్చర్యపోతున్నారని నాకు తెలుసు. కొన్ని సందర్భాల్లో ప్రజల శ్రేయస్సు కోసం, పార్టీ హితం కోసం కొన్ని కఠినమైన నిర్ణయాలను తీసుకోవాల్సి ఉంటుంది. సమాజంలోని అన్ని వర్గాల ప్రజలతో కలిసి ములాయం సింగ్ ముందుకు సాగుతున్నారని నిస్సందేహంగా చెప్పవచ్చు. ఆయన నిజమైన నాయకుడు. ప్రత్యేకించి వెనుకబడిన వర్గాల ప్రజలు ములాయం సింగ్‌ను ఇప్పటికీ తమ నేతగా పరిగణిస్తున్నారు. నరేంద్రమోదీ మాదిరిగా ములాయం సింగ్ నకిలీ బీసీ నాయకుడు కాదు అని మాయావతి చెప్పారు. ప్రసంగం చివర్లో తడబడి జై భీమ్ (బీఎస్పీ నినాదం) అంటూ నినదించిన మాయావతి.. అంతలోనే తేరుకుని ఆ నినాదానికి జై లోహియా అనే నినాదాన్ని కూడా చేర్చారు.

303
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles