11 లక్షలు కాదు.. 23 లక్షలు!


Sat,February 23, 2019 02:23 AM

23 Lakh Tribal  Forest Dwelling Families May Face Eviction

- అటవీ భూమి నుంచి ఖాళీ చేయాల్సిన ఆదివాసీ కుటుంబాలు

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 22: అటవీ హక్కు చట్టం -2006 కింద భూ యాజమాన్య హక్కు దరఖాస్తులు తిరస్కరణకు గురైన సుమారు 11 లక్షల ఆదివాసీలు, ఇతర సంప్రదాయ అటవీ ప్రాంత నివాసిత (ఓటీఎఫ్‌డీ) కుటుంబాలను ఖాళీ చేయించాలని సుప్రీంకోర్టు ఇటీవల వెలువరించిన తీర్పుపై పలు వర్గాల నుంచి ఆందోళన వ్యక్తమవుతున్నది.

ఆదివాసీల దరఖాస్తులు తిరస్కరణకు గురైనంత మాత్రాన వారికి హక్కులు లేనట్లు భావించకూడదని, అటవీ అధికారుల చట్టవిరుద్ధ ప్రమేయంవల్ల కూడా దరఖాస్తులు తిరస్కరణకు గురవుతున్నట్లు ఆదివాసీల హక్కుల సంస్థలు చెబుతున్నాయి. అటవీ హక్కు చట్టం చెల్లుబాటుపై పలు స్వచ్ఛంద సంస్థలు దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు.. యాజమాన్య హక్కులు తిరస్కరణకు గురైన వారిని అటవీ భూమి నుంచి ఖాళీ చేయించాలని ఆయా రాష్ర్టాలకు ఆదేశాలు జారీ చేసింది. దీంతో సుమారు 11 లక్షల కుటుంబాలు జూలై 17లోగా తమ నివాసాలను ఖాళీ చేయాల్సి ఉంటుంది. అయితే గిరిజన వ్యవహారాల శాఖ వద్ద ఉన్న తాజా (2018 డిసెంబర్‌నాటికి) గణాంకాల ప్రకారం మొత్తం 42.19 లక్షల దరఖాస్తులు రాగా, 18.89లక్షలకు మాత్రమే ఆమోదం లభించింది. అంటే మిగిలిన దాదాపు 23 లక్షల మంది అటవీ ప్రాంతం నుంచి తమ నివాసాలను ఖాళీ చేయాల్సిన పరిస్థితిని ఎదుర్కొంటున్నారు.

325
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles