అది ‘అంతిమ తీర్పు’ కాదు

Fri,December 6, 2019 02:42 AM

-శబరిమల ఆలయంలోకి మహిళల అనుమతిపై సుప్రీంకోర్టు వ్యాఖ్య

న్యూఢిల్లీ: కేరళలోని శబరిమలలోగల అయ్య ప్ప గుడిలోకి 50 ఏండ్లలోపు మహిళల ప్రవేశానికి అనుమతినిస్తూ గతేడాది ఇచ్చిన తీర్పు ‘అంతిమ తీర్పు’ కాదని సుప్రీంకోర్టు గురువారం స్పష్టంచేసింది. ఆ కేసుపై ఇప్పుడు ఏడుగురు సభ్యుల విస్తృత ధర్మాసనం విచారణ జరుపనుందన్నది. బిందు అమ్మిని అనే భక్తురాలు అయ్యప్ప గుడిలోకి ప్రవేశించేందు కు ప్రయత్నించగా కొందరు అడ్డుకున్నారని, ఇది కోర్టు తీర్పును ధిక్కరించడమేనని సీనియర్‌ న్యాయవాది ఇందిరా జైసింగ్‌ తెలిపా రు. దీనిపై చీఫ్‌ జస్టిస్‌ ఎస్‌ఏ బోబ్డే సారథ్యంలోని ధర్మాసనం స్పందిస్తూ, 2018లో ఇచ్చి న తీర్పు అంతిమం కాదని, దీని పరిశీలనకు ఏడుగురు సభ్యుల ధర్మాసనానికి ఇటీవలే నివేదించామని, దానిపై ఇంకా తుది తీర్పు వెలువడలేదని పేర్కొంది. శబరిమల ఆల యంపై ఇచ్చిన చారిత్రక తీర్పును సమీక్షించాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపై గత నవంబర్‌లో నాటి చీఫ్‌ జస్టిస్‌ రంజన్‌ గొగోయ్‌ నేతృత్వంలోని రాజ్యాంగ ధర్మాసనం విచారణ జరిపి.. 2018లో ఇచ్చిన తీర్పును సమీక్షించేందుకు ఏడుగురు సభ్యుల విస్తృత ధర్మాసనాన్ని ఏర్పాటుచేయాలని 3:2 మెజారిటీతో నిర్ణయించింది.

249
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles