బాలికపై లైంగికదాడి కేసులో దోషులకు మరణశిక్ష


Wed,August 22, 2018 03:00 AM

2 men get death sentence for raping minor girl in Mandsaur

-చిన్నారిని అపహరించినందుకు 10 ఏండ్ల చొప్పున జైలుశిక్ష
-మధ్యప్రదేశ్‌లోని ప్రత్యేక కోర్టు తీర్పు..
-2 నెలల్లోనే విచారణ పూర్తి

మంద్‌సౌర్: రెండు నెలల క్రితం మధ్యప్రదేశ్‌లో జరిగిన ఘోర లైంగికదాడిలో ఇద్దరు దోషులకు కోర్టు మరణశిక్ష విధించింది. ఈ కేసులో కోర్టు రెండు రకాల శిక్షలు విధించింది. అందులో ఒకటి బాలికను అపహరించినందుకు 10 ఏండ్ల జైలు శిక్ష, రెండో ది బాలికపై లైంగికదాడికి పాల్పడినందుకు మరణశిక్ష ఖరారు చేసింది. జూన్‌లో మంద్‌సౌర్‌లో బాలిక(8) పాఠశాల పూర్తయ్యాక తండ్రి కోసం ఎదురుచూస్తుండగా దుండగులు ఇర్ఫాన్ అలియాస్ భయ్యూ (20), ఆసిఫ్(24) ఆమెను అపహరించి, నిర్జన ప్రాంతంలోకి తీసుకెళ్లి లైంగికదాడి చేశారు. తర్వాత కత్తితో ఆమె గొంతు కోసి, చనిపోయిందని భావించి ఓ ఖాళీ ప్రదేశంలో పడేశారు. రక్తపు మడుగులో ఉన్న చిన్నారిని స్థానికులు దవాఖానకు తీసుకెళ్లారు. డాక్టర్లు పలు శస్త్ర చికిత్సలు చేయడంతో ప్రస్తుతం ఆ బాలిక ఆరోగ్యం నిలుకడగా ఉన్నది. ఈ దారుణం మధ్యప్రదేశ్‌లో సంచలనం సృష్టించడంతో విచారణ కోసం ప్రభుత్వం ప్రత్యేక కోర్టును ఏర్పాటు చేసింది. ఈ కేసును విచారించిన జడ్జి నిషా గుప్తా పాఠశాల వద్ద ఉన్న సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించి ప్రత్యక్ష సాక్షుల వాంగ్మూలాలను విన్నారు. కేవలం రెండు నెలల్లోనే విచారణ పూర్తి చేసిన జడ్జి నిందితులకు మరణశిక్షతోపాటు 10 ఏండ్ల చొప్పున జైలుశిక్షను విధించారు.

మరో కేసులో ఏడు గంటల్లోనే విచారణ, తీర్పు

-లైంగికదాడి జరిగిన ఐదు రోజుల్లోనే మైనర్ నిందితుడు జైలుకు..
-మధ్యప్రదేశ్‌లోని జువెనైల్ జస్టిస్ బోర్డు తీర్పు సంచలనం,/b>
బాలికపై లైంగికదాడి కేసులో మధ్యప్రదేశ్‌లోని ఓ కోర్టు తీర్పు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. కేవలం ఏడు గంటల్లోనే విచారణను పూర్తి చేసిన జడ్జి మైనరైన(దుండగుడి వయస్సు 14 ఏండ్లు) దోషికి రెండేండ్ల జైలు శిక్షను విధించారు. ఈనెల 15న బాలికపై లైంగికదాడి జరుగగా ఐదు రోజుల్లోనే దోషికి శిక్ష పడింది.కాగా, ఈ కేసు డైరీని పోలీసులు సోమవారం ఉదయం 10.45 గంటలకు కోర్టుకు సమర్పించారు. దీనిపై న్యాయమూర్తి విచారణ జరిపి, నిందితుడిని దోషిగా నిర్ధారించి అదే రోజు సాయంత్రం 6 గంటలకు తీర్పు చెప్పారు. పోక్సో చట్టం అమల్లోకి వచ్చిన 2012 నుంచి ఇప్పటి వరకు ఇంత వేగంగా విచారించి, తీర్పు చెప్పడం ఇదే తొలిసారి. ఉజ్జయిన్ ఎస్పీ సచిన్ అతుల్‌కర్ మాట్లాడుతూ ఈ నెల 15న ఘాటియా గ్రామంలో ఆడుకుంటున్న బాలికను 14 ఏండ్ల దుండగుడు అపహరించి లైంగికదాడికి పాల్పడ్డాడు. బాలిక తన తల్లిదండ్రులకు ఈ సంగతి చెప్పడంతో వాళ్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ విషయం తెలిసిన దుండగుడు రాజస్థాన్‌లోని తన బంధువులింటికి పారిపోయాడు. అక్కడికి వెళ్లి అతడిని అరెస్టు చేసి తీసుకొచ్చాం. జువెనైల్ జస్టిస్ బోర్డు జడ్జి త్రిపాఠి పాండే చాలా వేగంగా విచారణ పూర్తి చేసి తీర్పు వెలువరించారు. సమాజానికి ఓ సందేశాన్పి పంపారు అని హర్షం వ్యక్తం చేశారు.

1035
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles