తీహార్ జైలుకు కార్తీ చిదంబరంTue,March 13, 2018 02:26 AM

ఈ నెల 24 వరకు జ్యుడీషియల్ కస్టడీ విధించిన కోర్టు
Karti-Chidambaram
న్యూఢిలీ: ఐఎన్‌ఎక్స్ మీడియా అవినీతి కేసులో కార్తీ చిదంబరానికి ఢిల్లీ కోర్టు ప్రత్యేక జడ్జి ఈ నెల 24 వరకు జ్యుడీషియల్ కస్టడీ విధించారు. దీంతో ఆయనను ఢిల్లీలోని తీహార్ జైలుకు తరలించనున్నారు. తనకు ప్రత్యేక సెల్‌తోపాటు ఇతర సౌకర్యాలు కల్పించాలన్న కార్తీ విజ్ఞప్తిని కోర్టు తిరస్కరించింది. పుస్తకాలు, ఇంటి భోజనం, బట్టలు తదితర వస్తువులను తీసుకెళ్లడానికి అంగీకరించని కోర్టు.. జైలు నిబంధనల ప్రకారం ఔషధాలు, కంటి అద్దాలు ఉపయోగించుకోవచ్చని తెలిపింది. నియమ నిబంధనలను అనుసరించి జైలు అధికారులు నిందితుడికి సరైన భద్రత కల్పించాలని ఆదేశించారు.

205
Tags

More News

VIRAL NEWS