Katta Shekar Reddy Article
National News

మూకస్వామ్యం చెల్లదు

Updated : 7/18/2018 4:48:02 AM
Views : 1090

-అల్లరిమూకలకు భయం కలిగించేలా చట్టం తీసుకురావాలి
-గోరక్షణ పేరిట జరిగే దాడులు, కొట్టిచంపటం వంటి ఘటనలు జరుగరాదు
-ప్రభుత్వానికి తేల్చిచెప్పిన సుప్రీం
-నడివీధుల్లో దర్యాప్తులు, శిక్షల అమలు ఇకపై కుదరదు
-మూకస్వామ్యంపై ఉక్కుపాదం
దేశంలో పెచ్చరిల్లుతున్న అల్లరిమూకల హింసకు, గోరక్షణ పేరిట దాడులు, కొట్టి చంపడం వంటి దారుణ ఘటనలకు స్వస్తి పలుకాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ దేశపు చట్టాలను కాలరాసే అల్లరి మూకల భయానక చర్యలను, మూకస్వామ్యాన్ని ఇక ఎంతమాత్రం అనుమతించరాదని తేల్చి చెప్పింది. చట్టాన్ని చేతుల్లోకి తీసుకొనే అల్లరిమూకల ఆగడాలను అరికట్టేందుకు, వారిలో భయాన్ని పాదుకొల్పేందుకు ఒక ప్రత్యేక చట్టం చేయాలని ప్రభుత్వానికి సూచించింది.

న్యూఢిల్లీ, జూలై 17: దేశంలో ఇటీవల పెచ్చరిల్లిన అల్లరిమూకల హింస, గో రక్షణ పేరిట దాడులు, కొట్టి చంపడం వంటి ఘటనలపై సుప్రీంకోర్టు తీవ్రస్థాయిలో స్పందించింది. ఈ దేశ చట్టాలను కాలరాసే అల్లరిమూకల భయానక చర్యలను ఎంతమాత్రం అనుమతించరాదని స్పష్టం చేసిం ది. సామూహిక దాడులకు పాల్పడి హత్యలు చేయ డం, గోరక్షణ పేరిట భౌతిక దాడులకు దిగడం వంటి చర్యలను అరికట్టేందుకు ఓ కొత్త చట్టం చేయాలని పార్లమెంట్‌కు సూచించింది. లేకపోతే అటువంటి ఘటనలు టైఫన్ వంటి రాక్షసిలా లేచి దేశమంతా భయోత్పాతం సృష్టించే అవకాశమున్నదని హెచ్చరించింది. దేశంలో కొనసాగుతున్న అల్లరిమూకల సామూహిక హింస, కొట్టి చంపే ఘటనలను అరికట్టేందుకు మార్గదర్శకాలను సూచించాలని కోరుతూ మహాత్మాగాంధీ మనుమడు తుషార్ గాంధీ, కాంగ్రెస్ నేత తెహసీన్ పూనావాలా దాఖలు చేసిన పిటిషన్లపై విచారణ జరిపిన న్యాయస్థానం ఈ తీర్పును వెలువరించింది. నడి వీధిలో ఎటువంటి దర్యాప్తులు, విచారణలు/ శిక్ష లు అమలు చేయరాదని తేల్చి చెప్పింది. పౌరుల మధ్య సోదరభావాన్ని ప్రోత్సహించాల్సిన కర్తవ్యం ప్రభుత్వాలదేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. కొందరు అసహనంతో సామూహిక హింసను ప్రేరేపిస్తున్నారని, తప్పు డు వార్తలు, అబద్ధపు కథనాలను ప్రచారంతోప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని పే ర్కొంది. పెరుగుతున్న అసహనం, మతోన్మాదం వల్లే ఇటువంటి ఘటనలు జరిగాయని, వాటిని సాధారణ జనజీవనంలా మారే అవకాశం ఇవ్వకూడదని హెచ్చరించింది.

కొట్టి చంప డం, అల్లరిమూకల హింస ఘటనలు సమాజానికి ము ప్పుగా పరిణమిస్తున్నాయని, అవి క్రమంగా టైఫన్ వంటి రాక్షసిగా మారే ప్రమాదమున్నదని వ్యాఖ్యానించింది (గ్రీకు పురాణాలలో టైఫన్ అంటే ఓ భయానక జంతువు లేదా రాక్షస సర్పం అని అర్థం). గోరక్షణ పేరిట జరిగే దాడులు, అల్లరిమూకల హింస వంటి నేరాలను అరికట్టేందుకు చీఫ్ జస్టిస్ దీపక్‌మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం ప్రభుత్వానికి పలు నివారణ, శిక్షాత్మక చర్యలను సూచించింది. గందరగోళం, అరాచకత్వం ప్రజ్వరిల్లినప్పుడు, పౌరులకు రాజ్యాంగం ద్వారా కలిగిన హక్కుల పరిరక్షణకు ప్రభుత్వం సానుకూలంగా, బాధ్యతాయుతంగా వ్యవహరించాలి. అల్లరిమూకల భయానక చర్యలు ఈ దేశ చట్టాలను కాలరాసేందుకు అనుమతించరాదు. పదే పదే జరుగుతున్న ఒకేరకమైన హింస నుంచి పౌరులను రక్షించేందుకు చర్యలు తీసుకోవాలి. ఆ హింస ఒక కొత్త అలవాటుగా మారేందుకు అనుమతించరాదు. పెరుగుతున్న ప్రజల ఆర్తనాదాలను ప్రభుత్వం పెడచెవిన పెట్టరాదు అని ధర్మాసనం హితవు పలికింది. కొట్టి చంపే ఘటనలకు పాల్పడే అల్లరిమూకల్లో భయాన్ని పాదుకొల్పేందుకు ఓ ప్రత్యేక చట్టాన్ని తేవాల్సిన అవసరముందని సుప్రీం కోర్టు పేర్కొంది. చట్టాల అమలుతోపాటు శాంతిభద్రతల పరిరక్షణ రాష్ట్ర ప్రభుత్వాల బాధ్యత అని తెలిపింది. జనం సామూహికంగా చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోకుండా, హింసకు పాల్పడకుండా నివారించేందుకు ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.

సమాజం కూడా అల్లరిమూకల పట్ల అప్రమత్తంగా ఉండి, వారి చర్యలపై అను నిత్యం పోలీసులకు, అధికారులకు ఫిర్యాదు చేయాలని సూచించింది. ప్రభుత్వాల నిజాయితీ, వాటి నిబద్ధత ఇటువంటి ఘటనల నివారణకు తీసుకొనే చర్యలు, పథకాల ద్వారా ప్రతిబింబించాలన్నది. ఒక గుంపు ఏదో ఒక సాకుతో చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకుంటే, అరాచకత్వానికి, గందరగోళానికి, అక్రమాలకు అంతిమంగా హింసకు దారి తీస్తుంది. అల్లరిమూకల హింస, భ యానక ఘటనలు ఓ భీకర దృశ్యాన్ని ఆవిష్కరిస్తున్నా యి. గొప్ప గణతంత్ర దేశంగా పేరొందిన మనం భిన్న సంస్కృతులను ఇముడ్చుకొనే సహనాన్ని కోల్పోయా మా ? అని ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన పరిస్థితిని కల్పిస్తున్నాయి అని ధర్మాసనం ఆవేదన వ్యక్తం చేసింది. తదుపరి విచారణను ఆగస్టు 20కి వాయిదా వేసిన కోర్టు తమ మార్గదర్శకాలపై తీసుకున్న చర్యలపై నాలుగువారాల్లోగా నివేదిక సమర్పించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది.

Tehseen-Poonawalla

ఈ విధంగా నివారించండి

న్యూఢిల్లీ: కొట్టి చంపే ఘటనలు, అల్లరిమూకల హింసను అడ్డుకునేందుకు సుప్రీంకోర్టు పలు మార్గదర్శకాలను జారీ చేసింది.
-రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతి జిల్లాలో ఎస్పీ స్థాయి సీనియర్ పోలీస్ అధికారిని నోడల్ అధికారిగా నియమించాలి. డీఎస్పీ ర్యాంక్ అధికారిని సహాయకునిగా నియమించాలి. వీరిద్దరు కలిసి ఒక టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేయాలి. ద్వేషపూరిత ప్రసంగాలు, రెచ్చగొట్టే ప్రకటనలు చేసేవారిని, చట్టాన్ని చేతుల్లోకి తీసుకొని హింసకు పాల్పడే వారిని గుర్తించాలి.
-గత ఐదేండ్లలో హింస జరిగిన జిల్లాలను, సబ్ డివిజన్లను లేదా గ్రామాలను రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తించాలి. ఈ ప్రక్రియ తీర్పు వెలువడిన మూడువారాల్లోనే జరుగాలి. ఈ ప్రాంతాల్లో మరింత అప్రమత్తంగా ఉండేలా ఆదేశాలు జారీ చేయాలి.
-నోడల్ అధికారులు కనీసం నెలకు ఒకసారి స్థానిక నిఘా విభాగాలు, పోలీస్ స్టేషన్ల అధికారులతో సమావేశం నిర్వహించాలి.
-రాష్ర్టాల హోంశాఖ కార్యదర్శి/డీజీపీలు మూడు నెలలకొకసారి నోడల్ అధికారులు, నిఘా విభాగాల అధిపతులతో సమావేశమై పరిస్థితులను సమీక్షించాలి.
-కొట్టి చంపడానికి లేదా హింసకు పాల్పడేందుకు పోగయ్యే వారిని చెదరగొట్టే అధికారం సీఆర్‌పీసీ 129 ప్రకారం పోలీసులకు ఉంది.
-సామూహిక హింసను, ఒక కులం లేదా మతానికి చెందిన వారిని కొట్టి చంపే ఘటనలను అరికటేందుకు, సామాజిక న్యాయం అనే లక్ష్యాన్ని సాధించేందుకు తీసుకోవాల్సిన చర్యలను రూపొందించేందుకు కేంద్ర హోం శాఖ చొరవ తీసుకొని, రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి పనిచేయాలి. ఈ కృషిలో చట్టాలను అమలు చేసే సంస్థలను, సంబంధిత విభాగాలన్నింటినీ భాగస్వాములను చేయాలి.
-పూర్వం జరిగిన ఘటనలను, నిఘా విభాగం ఇచ్చే సమాచారాన్ని దృష్టిలో ఉంచుకొని సున్నిత ప్రాంతాల్లో పోలీసుల గస్తీ నిర్వహించేలా డీజీపీలు ఎస్పీలకు ఆదేశాలు జారీ చేయాలి. గస్తీ పటిష్ఠంగా జరుగాలి. చట్టాన్ని చేతుల్లోకి తీసుకొనేందుకు వారు భయపడేలా నిఘా చర్యలు ఉండాలి.
-సామూహిక హింస లేదా కొట్టి చంపే ఘటనలకు పాల్పడే వారికి కఠిన శిక్షలు విధిస్తామని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రేడియో, టీవీలు, ఇతర మీడియా ద్వారా ప్రచారం చేయాలి.
-సుప్రీంకోర్టు మార్గదర్శకాలను అమలు చేయడంలో విఫలమయ్యే అధికారులపై సంస్థా గతంగా ఆరు నెలల్లోగా చర్యలు తీసుకోవాలి.

Key Tags
Supreme Court, Parliament, Tehseen Poonawalla, Tushar Gandhi
Advertisement
పెద్దనోట్ల రద్దు పేరిట అతిపెద్ద కుంభకోణం 3 లక్షల కోట్ల దొంగనోట్లు! Rs 1L award for identity of man seen exchanging money in post note ban video
-విదేశాల్లో ముద్రణ.. వాయుసేన విమానాల్లో తరలింపు -కొత్త నోట్లను ఆరునెలల ముందే ముద్రించారు -కాంగ్రెస్ సీనియర్ నేత కపిల్ సిబల్ సంచలన ఆరోపణలు -బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా నేతృత్వం.. రా, ఆర్బీఐ ప్రమేయం -పారిశ్రామికవేత్త..
నా శాపం వల్లే.. I take back my statement and apologize says Pragya Thakur on Karkare remarks
-26/11 అమరుడు హేమంత్ కర్కరే మృతిపై సాధ్వి ప్రజ్ఞాసింగ్ వ్యాఖ్య -జైలులో ఆయన తనను హింసించాడని ఆరోపణలు -శపించిన నెలరోజుల్లోనే హతమయ్యాడంటూ వ్యాఖ్యలు -ప్రజ్ఞాసింగ్ వ్యాఖ్యలపై దుమారం.. దేశవ్యాప్తంగా విమర్శల వెల్లువ -ఆ..
ప్రాంతీయ శక్తులే నిర్ణేతలు Regional parties to decide future of national politics
- ప్రాభవం కోల్పోతున్న జాతీయపార్టీలు - అనేక రాష్ర్టాల్లో ఉనికి నామమాత్రమే - ప్రభుత్వ ఏర్పాటులో ప్రాంతీయపార్టీలే కీలకంలోక్‌సభ పోరు వేడెక్కింది. ఇప్పటికే మొదటి, రెండో విడుత పోలింగ్ ముగిసింది. ఈ నెల 23న మూడో విడుత ఎన్నికలు..
దేశమంతటా విస్తా రంగా వానలు IMD predicts normal and well distributed monsoon raising hopes for farming
-తగ్గిన ఎల్‌నినో ప్రభావం.. -జూన్‌లోనే పలుకరించనున్న వర్షాలు -భారత వాతావరణ విభాగం వెల్లడిన్యూఢిల్లీ, ఏప్రిల్ 19: రైతన్నలకు భారత వాతావరణ విభాగం (ఐఎండీ) తీపి కబురు అందించింది. ఈ ఏడాది జూన్‌లో దేశవ్యాప్తంగా విస్తారంగా వర..
గృహ ఇంధనాలే శాపం Cutting household fuel use may save 2.7 Lakh lives annually in India
-వాయు కాలుష్యానికి అవే ప్రధాన కారణం -మన దేశంలో వాటి వినియోగానికి స్వస్తి పలికితే - ఏటా 2.7 లక్షల మందిని కాపాడుకోవచ్చన్న అధ్యయనంన్యూఢిల్లీ, ఏప్రిల్ 19: వాయు కాలుష్యాన్ని భారత్ గణనీయంగా తగ్గించగలదని, కలప, పిడకలు, బొగ్గు,..
మోదీ దిగటం ఖాయం Narendra Modi a failed PM will definitely lose elections this time
- కేంద్రంలో వచ్చేది కాంగ్రెస్ సర్కారే - బీజేపీని వ్యతిరేకించే పార్టీలదే విజయం - కర్ణాటక ఎన్నికల ప్రచారంలో రాహుల్‌గాంధీరాయచూర్/చిక్కోడి, ఏప్రిల్ 19: ప్రధాని నరేంద్రమోదీని గద్దె దింపాలని ప్రజలంతా నిర్ణయించుకున్నారని కాంగ..
హార్దిక్‌పై దాడి Congress leader Hardik Patel slapped at a rally in Gujarat
-ఎన్నికల సభలో మాట్లాడుతుండగా చెంపపై కొట్టిన ఓ వ్యక్తి -పాటిదార్ ఉద్యమం సందర్భంగా తన భార్యాపిల్లలు ఇబ్బందులు పడ్డారనే దాడి చేశానని వెల్లడి -నన్ను చంపడానికి బీజేపీ కుట్ర: హార్దిక్అహ్మదాబాద్, ఏప్రిల్ 19: కాంగ్రెస్ నాయకుడ..
24 ఏండ్ల తర్వాత ఒకే వేదికపై మాయా ములాయం 24 yrs of enmity gives way to Mulayam mood at Mainpuri
-మాయావతికి ములాయం పాదాభివందనం -ఉత్తరప్రదేశ్‌లో అద్భుత ఘట్టం ఆవిష్కృతం -మోదీలాగా ములాయం నకిలీ బీసీ నేత కాదని,అసలైన బీసీ నేత అని మాయవతి కితాబుమెయిన్‌పురి (యూపీ), ఏప్రిల్ 19: ఉత్తరప్రదేశ్‌లో ఓ అద్భుతమైన ఘట్టం ఆవిష్కృతమైంద..
ఫెడరల్ ఫ్రంట్ నేతలతో టచ్‌లో! Mamata Banerjee Fielding Own Force In West Bengal
-కేంద్రంలో వచ్చేది ఎన్డీయే, యూపీయే ఏతర ప్రభుత్వమే -బీజేపీకి వంద సీట్లు మించవు -పశ్చిమ బెంగాల్ సీఎం మమతబెలూర్‌ఘాట్/గంగారామ్‌పూర్, ఏప్రిల్ 19: కేంద్రంలో ఈసారి ఎన్డీయే, యూపీయే ఏతర ప్రభుత్వమే ఏర్పాటవుతుందని పశ్చిమ బెంగా..
వాజపేయి కృషిని నాశనం చేశారు No More BJP Atal Bihari Vajpayee funeral procession
- పాకిస్థాన్‌తో చర్చించే అవకాశాలను మోదీ చెడగొట్టారు - పీవోకేతో వాణిజ్యం బంద్‌పై మెహబూబాముఫ్తీ వ్యాఖ్య శ్రీనగర్, ఏప్రిల్ 19: భారత్-పాక్ మధ్య సంబంధాలను పునరుద్ధరించేందుకు మాజీ ప్రధానమంత్రి వాజపేయి చేసిన కృషి మొత్తాన్ని ప..
రాహుల్ ప్రధాని అయితే ఆయన పక్కన కూర్చొంటా Will Sit By His Side If Rahul Gandhi Becomes Prime Minister Deve Gowda
- ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకోవాలన్న ఆలోచన లేదు - మాజీ ప్రధాని దేవెగౌడ వెల్లడి బెంగళూరు, ఏప్రిల్ 19: మళ్లీ ప్రధాని కావాలన్న ఆశ తనకు లేదని, ఒకవేళ కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ ప్రధాని అయితే ఆయన పక్కన కూర్చోడానికి..
అసెంబ్లీ ఎన్నికలు ఎప్పుడొచ్చినా సిద్ధం! Ready to face assembly polls in Tamil Nadu says Rajinikanth
-తమిళ సూపర్‌స్టార్ రజినీకాంత్ ప్రకటన చెన్నై, ఏప్రిల్ 19: తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు ఎప్పుడు జరిగినా తాను పోటీకి సిద్దమని తమిళ సూపర్‌స్టార్ రజినీకాంత్ ప్రకటించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అసెంబ్లీ ఎన్నికల..
లాహిరి లాహిరిలో సడన్ సర్‌ప్రైజ్! Kerala Couple Fall into River During Pre Wedding Photoshoot
వైరల్ అవుతున్న కేరళ జంట ప్రీవెడ్డింగ్ షూట్ వీడియో న్యూఢిల్లీ: వివాహానికి సంబంధించిన ప్రతీ సందర్భాన్ని మధురజ్ఞాపకంగా మల్చుకునే ధోరణి ఇటీవల పెరిగింది. ప్రీ వెడ్డింగ్ ఫోటోలు, వీడియోలు తీసుకోవడం ఎక్కువవుతున్నది. అయితే అది ..
శివసేనలోకి ప్రియాంక చతుర్వేది Priyanka Chaturvedi quits Congress joins Shiv Sena
-కాంగ్రెస్ పార్టీకి రాజీనామా న్యూఢిల్లీ, ఏప్రిల్ 19: కాంగ్రెస్ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి, మీడియా సెల్ కన్వీనర్ ప్రియాంక చతుర్వేది ఆ పార్టీకి రాజీనామా చేశారు. శుక్రవారం శివసేన పార్టీలో చేరారు. ఇటీవల మథురలో తనను బెది..
నాసా తొలి మహిళా వ్యోమగామి అభ్యర్థి.. జెర్రీ కాబ్ కన్నుమూత America 1st female astronaut Jerrie Cobb passes away
ఫ్లోరిడా: నింగిలోనూ మహిళలకు సమాన అవకాశాలు కల్పించాలని గళమెత్తిన అమెరికాకు చెందిన మొట్టమొదటి వ్యోమగామి అభ్యర్థి, పైలట్ జెర్రీ కాబ్ కన్నుమూశారు. అనారోగ్యంతో మార్చి 18న ఫ్లోరిడాలో ఆమె తుదిశ్వాస విడిచారని వారి కుటుంబ అధికార ..
మా వైపు వేలెత్తితే.. వేలు తీసేస్తాం Anyone pointing fingers at BJP will pay Manoj Sinha
కేంద్రమంత్రి మనోజ్ సిన్హా హెచ్చరిక ఘాజీపూర్ : ఎవరైనా సరే బీజేపీ కార్యకర్తల వైపు వేలెత్తి చూపితే వారి వేలు తీసేస్తామని కేంద్రమంత్రి మనోజ్ సిన్హా హెచ్చరించారు. ఘాజీపూర్ నుంచి పోటీ చేస్తున్న ఆయన గురువారం సైద్‌పూర్‌లో నిర్వ..
ఎన్డీ తివారీ కుమారుడిది హత్యే Rohit Shekhar Tiwari ND Tiwari Son Murdered Likely With Pillow
-సహజ మరణం కాదని తేల్చిన పోస్టుమార్టం నివేదిక దిండుతో ముఖంపై నొక్కి చంపారంటున్న ఢిల్లీ పోలీసులున్యూఢిల్లీ: ఉత్తర్‌ప్రదేశ్ మాజీ సీఎం, కాంగ్రెస్ సీనియర్ నేత ఎన్డీ తివారీ కుమారుడు రోహిత్ శేఖర్ తివారీ (40) హత్యకు గురైనట్టు త..
బాబు కోడ్ ఉల్లంఘనపై ఈసీ నజర్ EC Najar on Chandrababu code violation
-ఏపీ సీఎస్ వివరణ కోరిన సీఈవో గోపాలకృష్ణ ద్వివేది అమరావతి: ఏపీ సీఎం చంద్రబాబు ఎన్నికల నియమావళిని ఉల్లంఘించడంపై రాష్ట్ర ఎన్నికల సంఘం దృష్టిపెట్టింది. నిబంధనలకు విరుద్ధంగా ముఖ్యమంత్రి.. ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహిస్తున్..
ఏపీలో ఆరుగురిపై ఈసీ వేటు Activities on the election precautions in assembly elections
-అసెంబ్లీ ఎన్నికల విధుల్లో నిరక్ష్యంపై చర్యలు అమరావతి: ఏపీ అసెంబ్లీ ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఆరుగురు అధికారులపై తక్షణ చర్యలకు సీఈసీ ఆదేశించింది. నూజివీడు, సూళ్లూరుపేట, కోవూరు ఆర్వోలపై చర్యలకు ఆదేశించిం..
వెంటనే స్వదేశానికి వచ్చేయండి Sushma Swaraj asks Indian nationals to immediately leave Tripoli
-లిబియాలోని భారతీయులకు కేంద్రమంత్రి సుష్మ స్వరాజ్ సూచన న్యూఢిల్లీ, ఏప్రిల్ 19: లిబియాలో రోజురోజుకూ పరిస్థితులు దిగజారుతున్నాయని కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి సుష్మ స్వరాజ్ తెలిపారు. లిబియాలో ప్రస్థుతం నెలకొన్న పరిస్థితులపై..
ఆజమ్‌లాంటి వారి కోసమే యాంటీ రోమియో దళాలు Anti-Romeo forces are for those like Azam
-యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ హర్దోయ్ (యూపీ): ఆజామ్‌ఖాన్ లాంటి ఆకతాయిలకు వ్యతిరేకంగా తమ ప్రభుత్వం యాంటీ రోమియో దళాలను ఏర్పాటు చేసినట్టు ఉత్తర్‌ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ పేర్కొన్నారు. ఎన్నికల సంఘం(ఈసీ) విధించిన 72 గంటల న..
పశ్చిమబెంగాల్‌లో ఎన్నికల నోడల్ అధికారి అదృశ్యం Election nodal officer disappears in West Bengal
క్రిష్‌నగర్ (పశ్చిమబెంగాల్): పశ్చిమబెంగాల్‌లో ఎన్నికల నోడల్ అధికారి అర్నబ్ రాయ్ గత 24 గంటలకుపైగా కనిపించడం లేదు. ఎన్నికల విధులకుగాను ఆయనకు కేటాయించిన నివాసాన్ని వదిలి వెళ్లారు. రానాఘాట్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని క..
బీజేపీ హిమాచల్ అధ్యక్షుడిపై ఈసీ 48గంటల నిషేధం! BJP 48-hour ban on Himachal president
-రాహుల్‌పై వ్యాఖ్యలతో చర్య సిమ్లా: కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌పై అసభ్యకరమైన వ్యాఖ్యలు చేసినందుకు గాను హిమాచల్‌ప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడు సత్పాల్ సత్తిపై ఎన్నికల సంఘం(ఈసీ) కొరడా ఝళిపించింది. 48 గంటల పాటు ఎలాంటి ఎన్నికల ప..
అత్యవసర సాయానికి నంబర్-112 112 emergency assistance number
-100, 101, 1090 నంబర్లకు బదులుగా ఒకే నంబర్ న్యూఢిల్లీ: పోలీస్-100, ఫైర్-101, మహిళల రక్షణ-1090 హెల్ప్‌లైన్ నంబర్లకు బదులుగా ఇక నుంచి 112 నంబర్ అందుబాటులోకి రానున్నది. దేశవ్యాప్త నెట్‌వర్క్‌గా వ్యవహరిస్తున్న ఈ వ్యవస్థలో త..
Advertisement
telugu matrimony
Follow Us On
Today's E-paper