Katta Shekar Reddy Article

రాష్ట్ర ఆవిర్భావ పురస్కారాలు

Updated : 5/31/2018 3:43:12 AM
Views : 4890

-26 రంగాల్లో విశిష్ట సేవలందించిన 48 మంది ఎంపిక
-జూన్ 2న జరిగే కార్యక్రమంలోఅవార్డుల ప్రదానం

Adhiraj
హైదరాబాద్, నమస్తే తెలంగాణ: తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం 2018 సంవత్సరానికిగాను విశిష్ట వ్యక్తులకు పురస్కారాలను ప్రకటించింది. తెలంగాణలో 26 రంగాలలో చేసిన మహోన్నత సేవలను గుర్తించి మొత్తం 48 మందిని అవార్డులకు ఎంపికచేశారు. మిమిక్రీ కళకు ఆరు దశాబ్దాలుగా సేవలనందిస్తున్న గొప్ప కళాకారుడు నేరెళ్ల వేణుమాధవ్‌కు, 1969 తెలంగాణ ఉద్యమంలో నిరుపమాన సేవలనందించిన ఆదిరాజు వెంకటేశ్వరరావుకు, సాహిత్యరంగంలో తెలంగాణ విద్వాంసులలో అగ్రగణ్యుడుగా నిలిచిన రవ్వా శ్రీహరికి విశిష్టవ్యక్తుల జాబితాలో తొలిప్రాధాన్యం ఇచ్చారు. అవార్డులకు ఎంపికైనవారికి జూన్ 2న సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో జరిగే రాష్ర్టావిర్భావ వేడుకల సందర్భంగా పురస్కారాలు ప్రదానం చేస్తారు.


Adhiraj1

ఆయా రంగాల్లో అవార్డులకు ఎంపికైనవారి వివరాలు..

సాహిత్యం కందుకూరి శ్రీరాములు ఆధునిక వచన కవిత
ఆడెపు లక్ష్మీపతి కథారచయిత
వసంతరావు దేశ్‌పాండే నవలా రచయిత
ప్రొఫెసర్ మహ్మద్‌అలీఅసర్ ఉర్దూ సాహిత్యం
జర్నలిజం వై నాగేశ్వరరావు ప్రింట్ మీడియా
తిగుళ్ల కృష్ణమూర్తి ప్రింట్ మీడియా
ముక్తీ ఫారూఖీ ఉర్దూ జర్నలిజం
సూరజ్ ఎలక్ట్రానిక్ మీడియా
గుంటిపల్లి వెంకట్ ఎలక్ట్రానిక్ మీడియా
గడ్డం కేశవమూర్తి రూరల్ రిపోర్టింగ్
నవీన్ రిపోర్టింగ్
శా్రస్త్రీయ సంగీతం నిహాల్ శా్రస్త్రీయ గాత్రకచేరి
శా్రస్త్రీయ నృత్యం డాక్టర్ పద్మజారెడ్డి కూచిపూడి
పేరిణి నృత్యం టంగుటూరి భీమన్‌పటేల్
ఫొటోగ్రఫీ రవీందర్‌రెడ్డి
పెయింటింగ్ సూర్యప్రకాశ్
ఆర్ట్ అండ్ డిజైనింగ్ అంబాజీ ప్రపంచ తెలుగు మహాసభల వేదిక రూపకల్పన
జానపద నృత్యం పురాణం రమేశ్ కూనపులి పటం కథ
జానపదం గిద్దె రామనర్సయ్య జానపద గాయకుడు మిట్టపల్లి సురేందర్ జానపద గాయకుడు
ఉద్యమగానంవరంగల్ శ్రీనివాస్ఉ ద్యమ గాయకుడు జలజ ఉద్యమ గాయకురాలు శంకర్‌బాబు ఉద్యమ గాయకుడు
థియేటర్, మ్యాజిక్జీ కుమారస్వామి ఆధునిక నాటకం సామలవేణు ఇంద్రజాలికుడు
క్రీడలు మహ్మద్ హుసాముద్దీన్ బాక్సింగ్ నేలకుర్తి సిక్కిరెడ్డి బ్యాడ్మింటన్
ఉత్తమ ఉద్యోగులు పీ సురేశ్‌బాబు ఎస్‌ఈ, ట్రాన్స్‌కో ఎల్ సంపత్‌రావు ఈఈ, ట్రాన్స్‌కో ఖాజా మొహియొద్దీన్ ఏఈ, కాళేశ్వరం సోలిపేట శ్రీనివాస్‌రెడ్డి జోనల్ కమిషనర్, జీహెచ్‌ఎంసీ
వైద్యరంగండాక్టర్ రవీందర్‌గౌడ్ సరోజినీదేవి కంటి దవాఖాన
అర్చకులు తిరుకోవెళ్ మారుతి, కొండగట్టు ఆంజనేయస్వామి దేవాలయం
వేదపండితులు బ్రహ్మర్షి కంకనూరు వెంకటరమణశాస్త్రి
శాస్త్రవేత్తలు మామిడాల రాములు, ఏరోనాటిక్ రంగం
డాక్టర్ జీ రామయ్య డైరెక్టర్ నార్త్‌ఈస్ట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, జొర్హట్
ఎన్జీవో పీ హనుమంతరావు, మానసిక వికలాంగులసేవ
న్యాయవాది కనకయ్య జెల్లి
ఉత్తమ గ్రామపంచాయతీ జగ్గన్నపేట, ములుగు మండలం
ఉత్తమ మున్సిపాల్టీ నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్
ఉత్తమ రైతు యానాల లక్ష్మి
ఉత్తమ ఉపాధ్యాయుడు డీ లింబన్న, పీజీ హెడ్మాస్టర్

ప్రత్యేక క్యాటగిరీ

రామావత్ హనుమ (ప్రమాదం నుంచి 15 మందిని రక్షించినందుకు)ప్రత్యూష (అంటార్కిటికా యాత్ర చేసినందుకు)సోషల్ వర్కర్ బాలేశ్వర్ అనాథ శిశుసేవ


మన రత్నాలు

-ధ్వన్యనుకరణ సమ్రాట్
Adhiraj2
ఆరు దశాబ్దాలుగా మిమిక్రీ కళకు మహోన్నత గౌరవ ప్రతిష్ఠలు తెచ్చిన గొప్ప కళాకారుడు నేరెళ్ల వేణుమాధవ్. ధ్వన్యనుకరణ సమ్రాట్‌గా పేరుగడించారు. వరంగల్‌లో జన్మించిన నేరెళ్ల.. ప్రపంచంలోని అనేకమంది నాయకులు, కళాకారులు, చలనచిత్ర నటులను అనుకరించడంలో దిట్ట. వందలమంది శిష్యులను తీర్చిదిద్దారు. ఆయనకు ఏకలవ్య శిష్యులు కూడా ఉన్నారు. మిమిక్రీని నేరెళ్ల వారి వద్ద నేర్చుకున్నట్టు చెప్తే అదే ఒక సర్టిఫికెట్. ఇంగ్లండ్ ప్రధాని చర్చిల్, హాస్యనటుడు చార్లీచాప్లిన్‌ను అనుకరించగలరు. భారత ప్రధానులు, నెహ్రూ, శాస్త్రి, ఇందిరాగాంధీల గొంతులను తన గొంతులో పలికించి సభికులను సంభ్రమాశ్చర్యాలకు గురిచేసిన ఘటనలు ఎన్నెన్నో. దివంగత ఆచార్య సినారె కోరికమేరకు తెలుగువిశ్వవిద్యాలయానికి మిమిక్రీ కళకోసం పాఠ్యప్రణాళిక రూపొందించారు. కొద్ది నిమిషాలు మాత్రమే కేటాయించినా ఆయన ప్రదర్శన ప్రారంభించగానే సమయాన్ని మైమరిచిపోవడం ఆనవాయితీయే.

తెలంగాణ ఉద్యమాల గ్రంథకారుడు

తెలంగాణకోసం 1969లో జరిగిన ప్రజా ఉద్యమాల చరిత్రను, అంతకుముందు మూడు దశాబ్దాలపాటు తెలంగాణకు జరిగిన అన్యాయాలను గ్రంథస్థం చేసిన జర్నలిస్టు ఆదిరాజు వెంకటేశ్వరరావు. నాటి ఉద్యమంలో 369 మంది తెలంగాణ విద్యార్థుల వీరగాథలను, తెలంగాణ ప్రజా సమితి ఆవిర్భావం, విఫలం, తెలంగాణ దగాపడటం వంటి సంఘటనలన్నింటినీ ఇంగ్లిష్, తెలుగు పత్రికల్లో వ్యాసాలుగా రాశారు. 1969 ఆరుసూత్రాల పథకంలోని లోపాలను మొదట ఎత్తిచూపిన జర్నలిస్టు ఆయనే. బ్రహ్మానందరెడ్డి ప్రభుత్వం జీవో 36 జారీచేసినప్పటికీ, ఏపీ ఉద్యోగులు హైదరాబాద్‌ను విడిచిపెట్టకుండా ఇక్కడే తిష్ఠవేసిన ఉదాహరణలన్నింటినీ ఆయన పత్రికల్లో రికార్డుచేశారు. రాజధాని పేరుతో పత్రిక నడిపారు. మహాభారత్ టూ మన్మోహన్‌సింగ్, పీవీ నర్సింహారావుపై ది రైట్ ప్రైమ్‌మినిస్టర్, నక్సలిజం ఎట్ క్రాస్‌రోడ్స్, తెలంగాణ రాష్ట్ర ఉద్యమాలు వంటి అనేక పుస్తకాలను ఆయన వెలువరించారు.


LBNR

జాతి గర్వించే విద్వాంసుడు

దేశంలోని సంస్కృత విద్వాంసులలో అగ్రగణ్యుడు ఆచార్య రవ్వా శ్రీహరి. సంస్కృతం, తెలుగు, భాషలలో ప్రావీణ్యంతోపాటు సంస్కృత వ్యాకరణశాస్ర్తాలపై సాధికారికంగా వ్యాఖ్యానించగల పండితుడాయన. శ్రీహరి నిఘంటువు పేరుతో ఆయన రూపొందించిన నిఘంటువు తెలుగుభాషకే ప్రామాణికంగా వాసికెక్కింది. సూర్యారాయాంధ్ర నిఘంటువు విస్మరించిన ఎన్నో తెలంగాణ పదాలను గ్రంథస్థం చేశారు. తెలంగాణ పదసంపదపై ఆయనది తిరుగులేని ఆధిపత్యం. నల్లగొండజిల్లాలోని ఓ కుగ్రామం నుంచి వచ్చి, యాదగిరిగుట్ట సంస్కృత పాఠశాలలో చదువుకొని, పేదరికాన్ని కడుపులో దాచుకొని అక్షరాలతో కడుపునింపుకున్న మహోన్నత వ్యక్తిత్వం ఆయనది. జాషువా గబ్బిలం ఖండకావ్యాన్ని ఆయన సంస్కృతంలోకి అనువదించారు.

నాటకోద్యమ సారథి

వరంగల్ అర్బన్ జిల్లా కొప్పూరులో జన్మించిన కుమారస్వామి.. జానపద కళావారసత్వం కలిగినవారు. ఒగ్గు కళాకారుల కుటుంబంలో పుట్టిన ఆయన ఉగ్గుపాలతోనే కళను వంటబట్టించుకున్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో యువ కళాకారులతో కలిసి ప్లానెట్ జీని స్థాపించారు. తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలతో పలు నాటక ప్రదర్శనలిచ్చారు. కేంద్రీయ విశ్వవిద్యాలయంలో థియేటర్ ఆర్ట్స్‌లో పీహెచ్‌డీ చేసి, నాటకరంగ ధోరణులపై అధ్యయనంకోసం పలు దేశాల్లో పర్యటించారు. ది మంకీ కింగ్ ఆఫ్ చైనా కథను ఒగ్గుకథ శైలిలో ప్లానెట్‌జీ ప్రదర్శనలిచ్చింది. తెలంగాణ వచ్చిన తర్వాత కళలకు ప్రోత్సాహంతోపాటు కళాకారులకు ఆదరణ లభిస్తున్నదని కుమారస్వామి చెప్పారు.

పల్లె పాటగాడు

జానపదాలకు పెట్టింది పేరైన వరంగల్‌లో పుట్టి పెరిగారు మిట్టపల్లి శ్రీనివాస్. ప్రస్తుత భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలం, వెల్లంపల్లి ఆయన స్వగ్రామం. తెలంగాణ ఉద్యమకాలంలో కవిగా, గాయకుడిగా పరిచయమైన శ్రీనివాస్.. 2003 నుంచి ఉద్యమ పాటలు రాస్తూ, పాడుతున్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు, తెలంగాణ సాంస్కృతిక వైభవాన్ని చాటే పాటలు రాస్తున్నారు. ఇప్పటివరకు 500కు పైగా రాసిన పాటల్లో విద్యార్థుల సమస్యలు, అణచివేత, బతుకమ్మ, పల్లె బతుకును స్పృశించారు. ప్రస్తుతం సాంస్కృతిక సారథిలో గీత రచయితగా పనిచేస్తున్నారు. ప్రభుత్వం తన కృషిని గౌరవిస్తూ అవార్డుకి ఎంపిక చేయడం ఎంతో సంతోషాన్నిచ్చిందని ఆయన చెప్పారు.

కాకతీయం ఆవిష్కర్త

శాస్త్రీయ నృత్యంలో ఉత్తమ కళాకారిణిగా అవార్డుకు ఎంపికైన డాక్టర్ జీ పద్మజారెడ్డి కృష్ణాజిల్లాలోని పామర్రులో పుట్టారు. చదువుకునే రోజుల్లో కూచిపూడి నేర్చుకున్న పద్మజారెడ్డి.. తర్వాత హైదరాబాద్‌లో శోభానాయుడు దగ్గర శిష్యరికంచేశారు. కాకతీయం బ్యాలే ఆమె ప్రత్యేకత. ఈ ప్రయోగం ద్వారా నృత్తరత్నావళిలోని భ్రమరి కందుక నృత్య లాస్య, తాండవం వెలుగులోకి తెచ్చారు. 14వ శతాబ్దం నాటి మూడు రకాల కళలను అధ్యయనంచేసి, కాకతీయం పేరుతో ప్రదర్శించారు. తన కృషిని సమాజం గుర్తించిందని, తెలంగాణ ప్రభుత్వం అవార్డుకి ఎంపిక చేయడంతో తన శ్రమ ఫలించినట్టు భావిస్తున్నానని ఆమె అన్నారు.

రంగులే అతని జీవితం

చెరుకుమల్లి సూర్యప్రకాశ్ ఖమ్మం జిల్లాలోని మధిర పట్టణంలో పుట్టి పెరిగారు. హైస్కూల్ విద్య మధిర పట్టణంలోనే పూర్తిచేశారు. 1956లో హైదరాబాద్‌లోని ఫైన్ ఆర్ట్స్ కళాశాలలో చేరారు. 1965లో ప్రఖ్యాత చిత్రకారుడు రామ్‌కుమార్ మార్గదర్శకత్వంలో ఆరునెలలపాటు ఢిల్లీలో చిత్రకళను అభ్యసించారు. ఐఅండ్‌పీఆర్‌లో మూడేండ్లు చిత్రకారుడిగా అప్పటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సేవలందించారు. ఎల్వీ ప్రసాద్ ఐ ఇన్‌స్టిట్యూట్‌లో ముప్పై ఏండ్లనుంచి ఆర్ట్ గ్యాలరీ నిర్వహిస్తున్నారు. సీసీఎంబీ సంస్థలో ఆర్టిస్ట్ ఇన్ రెసిడెంట్‌గా ఎన్నో చిత్రాలు గీశారు. దేశంలోని అన్ని ప్రధాన గ్యాలరీల్లో చిత్రాలు ప్రదర్శించారు. 55కి పైగా సోలో షోలు, వందల గ్రూపు షోలలో ప్రదర్శనలచ్చారు.

నగర ప్రతిష్టను పెంచిన అధికారి

ఇటీవలే తూర్పుజోన్ కమిషనర్‌గా పూర్తిస్థాయి బాధ్యతలు స్వీకరించిన శ్రీనివాస్‌రెడ్డి గతం లో సౌత్‌జోన్ కమిషనర్‌గా, తూర్పుజోన్‌కు ఇంచార్జి కమిషనర్‌గా బాధ్యతలు నిర్వహించారు. పాతబస్తీలో నాలాల అభివృద్ది, రోడ్డు వెడల్పు కార్యక్రమాలతోపాటు చార్మినార్ ప్రాజెక్ట్, పాత నగరంలో పండుగలు, పర్వదినాలను విజయవంతంగా నిర్వహించడంలో ఆయన కృషి ఎనలేనిది. ఇటివలే ఆస్తిపన్ను వసూళ్లలోనూ సౌత్‌జోన్‌లోని ఓ సర్కిల్‌తోపాటు తూర్పుజోన్‌లోని మూడు సర్కిళ్లను టాప్ టెన్‌లో నిలుపడంలో విజయం సాధించారు. తనకు లభించిన ఈ అవార్డుతో బాధ్యత మరింత పెరుగుతుందని శ్రీనివాస్‌రెడ్డి అన్నారు.

అంధుల పాలిట బంధువు..

పాత మెదక్ జిల్లా జోగిపేట గ్రామంలో నిరుపేద కుటుంబానికి చెందిన శంకరమ్మ, శంకరయ్య దంపతుల కుమారుడు డాక్టర్ ఎస్ రవీందర్‌గౌడ్. ప్రస్తుతం సరోజినీదేవి కంటి దవాఖానలో సూపరింటెండెంట్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్న రవీందర్‌గౌడ్ తన తల్లిదండ్రుల పేరు మీద సనత్‌నగర్‌లో 2000 సంవత్సరంలో శంకర్ నేత్రలయం స్థాపించి, మెదక్ జిల్లాలోని ప్రతి గ్రామంలో ఉచిత కంటి వైద్యశిబిరాలు ఏర్పాటుచేశారు. ఒక్క రోజులో 100 కంటి ఆపరేషన్లుచేసి రికార్డు సృష్టించారు. మూడువేలకుపైగా కంటి వైద్య శిబిరాలు నిర్వహించి, 25వేల ఆపరేషన్లు చేశారు. ఉచితంగా రెండు లక్షల కంటి అద్దాలు పంపిణీ చేశారు.

మానసిక బుద్ధిమాంద్యుల సేవలో..

హైదరాబాద్‌కు చెందిన స్వీకార్ ఉపకార్ ఫౌండేషన్ వ్యవస్థాపక చైర్మన్ డాక్టర్ పీ హనుమంతరావు 42 ఏండ్లుగా మానసిక బుద్ధిమాంద్యుల సేవలో ఉన్నారు. వికలాంగులకు ఎన్నో ప్రొఫెషనల్ కోర్సులలో అవకాశాలు కల్పించారు. తగిన శిక్షణ ఇస్తే మానసిక బుద్ధిమాంద్యులు ఎందులోనూ తక్కువ కాదని నిరూపిస్తున్నారు. ప్రభుత్వం తాము చేస్తున్న సేవలను గుర్తించి అవార్డు ప్రకటించడం సంతోషంగా ఉందని ఆయన చెప్పారు. దీంతో మరింత మందికి సేవ చేసే బాధ్యత పెరిగిందన్నారు.

Key Tags
KCR ,Venu Madhav nerella ,Venkateswara Rao ,Ravva Srihari ,Secunderabad ,Parade Grounds
Advertisement
టీడీపీ దుక్నం బంద్!
-తెలంగాణలో తట్టాబుట్ట సర్దేసుకున్న తెలుగుదేశం -పార్లమెంట్ పోరులో సోదిలోలేని పార్టీ -పార్టీ పదవులకు గుడ్‌బై చెప్తున్న సీనియర్లు -తాజాగా నామా రాజీనామా హైదరాబాద్, నమస్తే తెలంగాణ: తెలంగాణలో తెలుగుదేశం పార్టీ తట్టాబుట్ట..
వాహనం నడుపుతూ డ్రైవర్ మృతి
తిరుమలగిరి నమస్తే తెలంగాణ: సూర్యాపేట జిల్లా తిరుమలగిరిలో డీసీఎం వాహనం నడుపుతుండగా గుండెపోటు రావడంతో ఓ డ్రైవర్ ప్రాణాలు వదిలాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నిజామాబాద్ జిల్లా పెద్దపల్లికి చెందిన అబ్దుల్ ఖదీర్(52) సి..
గ్లామర్ రాజకీయాలు
ప్రస్తుతం రాజకీయం రంగుల సినిమా అయింది. దేశంలో ఎక్కడి రాజకీయాల్లో అయినా సినీ తారల సందడి నెలకొన్నది. సినీ ఆర్టిస్టులకు ప్రచార బాధ్యతలు అప్పగించడం, వాళ్లతో పాటలు పాడించడం. ఉపన్యాసాలు చెప్పించడం గత ఏడెనిమిది ఎన్నికలుగా ట్రెం..
రాహుల్, మోదీ సెగ్మెంట్లలో..వెయ్యేసి నామినేషన్లు వేయిస్తాం
-నిజామాబాద్ సభలో ఎంపీ కల్వకుంట్ల కవిత నిజామాబాద్/నమస్తే తెలంగాణ ప్రతినిధి: రైతులకు ఏమీచేయని తెలంగాణ కాంగ్రెస్, బీజేపీ నేతలు తీరు మార్చుకోకపోతే ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ, ప్రధాని నరేంద్రమోదీ పోటీ చేసే అమేథీ, వారణాసి..
ఫెడరల్ ఫ్రంట్ రావాలి
-ఏం జరిగిందో, ఏం జరుగాలో చెప్తే.. కొందరి పీఠాలు కదులుతున్నయ్ -తిట్టినతిట్టు తిట్టకుండా తిడుతున్నరు.. నన్ను చంపుతనన్నా భయపడేది లేదు -కొత్త ఆర్థిక, వ్యవసాయ విధానాలు రావాలి.. ఎవరో ఒకరు ఎక్కడో ఒకచోట పొలికేక పెట్టాలి -దేశ..
పల్లె రాజసం
-గ్రామాల అభివృద్ధికి రూ.73 వేల కోట్లు -మెరుగుపడిన మౌలిక వసతులు.. కొత్తచట్టంతో పెరిగిన జవాబుదారీతనం -పంచాయతీలకు సమృద్ధిగా నిధులు తంగళ్లపల్లి సంపత్, హైదరాబాద్, నమస్తే తెలంగాణ:పల్లె పులకరించింది. గతుకుల రోడ్లు... శుభ్ర..
అంతా నా ఇష్టం!
అందితే జుట్టు.. అందకపోతే కాళ్లు పట్టుకునే రకాలు రాజకీయాల్లో చాలా మందే ఉంటారు. వాళ్లందరికీ టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబును గురువుగా పేర్కొంటున్నారు నెటిజన్లు. మోదీతో దోస్తాన్ చేసినప్పుడు కాంగ్రెస్‌పై దుమ్మెత్తిపోశారు. ప్రత్..
వివేకా హత్యకేసులో దర్యాప్తు ముమ్మరం
-పరమేశ్వర్‌రెడ్డి అనుచరులు నలుగురి అరెస్టు -రహస్యప్రాంతంలో విచారణ హైదరాబాద్, నమస్తే తెలంగాణ: ఏపీ ప్రతిపక్ష నేత జగన్ చిన్నాన్న, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసు దర్యాప్తును ము మ్మరంచేశారు. ఇప్పటికే దాదాపు 20 ..
కాంగ్రెస్ నేతలు అశక్తులు
-రాహుల్‌గాంధీ సిట్ అంటే సిట్.. స్టాండ్ అంటే స్టాండ్ -పేగులు తెగేదాకా కొట్లాడే సత్తా టీఆర్‌ఎస్ ఎంపీలకే ఉన్నది -16 స్థానాల్లో గెలిపిస్తే కేంద్రంలో కీలకపాత్ర పోషిస్తాం -టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు -ప..
బాబు ఓటమితోనే ఏపీ బాగుపడుతుంది
-టీడీపీ జెండాను దొంగిలించాడు -మళ్లీ అధికారంలోకి వస్తే జగన్‌కు ప్రాణహాని -మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు ఆరోపణ ఖైరతాబాద్: చంద్రబాబును ఓడిస్తేనే ఆంధ్రప్రదేశ్ బాగుపడుతుందని మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు పేర్..
కాంగ్రెస్‌కు మరో షాక్
-బీజేపీలో చేరనున్న డీకే అరుణ హైదరాబాద్, నమస్తే తెలంగాణ: కాంగ్రెస్ పార్టీలో రాజీనామాల పరంపర కొనసాగుతున్నది. తాజాగా మాజీ మంత్రి, ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా కీలకనేత డీకే అరుణ ఆ పార్టీని వీడనున్నట్టు తెలుస్తున్నది. మంగళవారం ..
కోమటిరెడ్డి బ్రదర్స్ పగటివేషగాళ్లు
-ఎంపీగా రాజగోపాల్‌రెడ్డి సాధించిందేమీలేదు -ఐదేండ్లలో ఎంతో అభివృద్ధిచేసి చూపించా: ఎంపీ బూర నర్సయ్య ఇబ్రహీంపట్నం, నమస్తే తెలంగాణ: కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి చెల్లని రూపాయిలాంటి వ్యక్తి అని, అసెంబ్లీ ఎన్నికల్లో నల్లగొండ ప్..
చాయ్‌వాలా ప్రధానమంత్రి అయ్యిండు
రెండు చోట్ల పోటీ చేయనున్న పవన్‌ని చూస్తుంటే అదేదో సినిమాల ఆలీ కామెడీ గుర్తుకొస్తుంది. రెండు టికెట్లు తీసుకొని.. రెండెందుకు అని అడిగితే.. ఒకటి పోతే ఇంకోటి ఉంటుందని చెప్తాడు. మరి రెండూ పోతే అని ప్రశ్నిస్తే బస్‌పాస్ ఉందిగా ..
వికారాబాద్‌లో కాంగ్రెస్‌కు షాక్
తాండూరు, నమస్తే తెలంగాణ: పార్లమెంట్ ఎన్నికల సమయంలో వికారాబాద్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి గట్టి షాక్ తగిలింది. తాండూరు నియోజవర్గానికి చెందిన ఉమ్మడి రంగారెడ్డి డీసీసీబీ మాజీ చైర్మన్, కాంగ్రెస్ నాయకుడు లకా్ష్మరెడ్డి, తాండ..
‘ఈవీఎం’లలో ఓట్ల లెక్కింపు ఇలా!
ఎన్నికలు ముగిశాక, ఈవీఎంలలో నేతల భవితవ్యం దాగి ఉంటుంది కదా. మరి, ఆ యంత్రాలలో నమోదైన ఓట్లను ఎలా లెక్కిస్తారన్నది చాలామందికి ఆసక్తికరమైన విషయం. దీనిని యథావిధిగా ఆయా రాజకీయపార్టీలు, ఏజెంట్ల సమక్షంలోనే జరుపుతారు. ప్రతి రౌండ్‌..
కదులుతున్న పల్లెలు
-కలిసి వస్తున్న ప్రజానీకం -టీఆర్‌ఎస్ అభ్యర్థి వినోద్‌కు పెరుగుతున్న ఆదరణ -గంగాధర మండలం మంగపేటలో మద్దతు -అభివృద్ధిని చూసి తరలివచ్చిన వీర్నపల్లి -అత్యధిక మెజార్టీతో గెలిపిస్తామంటూ ప్రకటన కరీంనగర్ ప్రధాన ప్రతినిధి, ..
నా వారసుడు భారతీయుడే
-చైనీయులు ఎంపికచేసే వ్యక్తికి గౌరవం దక్కదు -టిబెటన్ల ఆధ్యాత్మిక నేత దలైలామా స్పష్టీకరణ ధర్మశాల, మార్చి 19: తాను మరణించిన తరువాత తన అవతారాన్ని (వారసుడిని) భారత్‌లోనే కనుగొనవచ్చని టిబెటన్ బౌద్ధుల ఆధ్యాత్మిక గురువు దలైలామ..
కుప్పకూలిన భవనం
-ఇద్దరు మృతి -ప్రాణాలతో బయటపడిన 28మంది -శిథిలాల కింద పలువురు -కర్ణాటకలోని ధార్వాడ్‌లో దుర్ఘటన బెంగళూరు, మార్చి 19: ఉత్తర కర్ణాటకలోని ధార్వాడ్ ప్రాంతంలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. నిర్మాణంలో ఉన్న నాలుగంతస్తుల భవనం మంగ..
ఇందూరులో సీఎం సభ సక్సెస్
-భారీగా తరలివచ్చిన ప్రజలు.. -ఆకట్టుకున్న సీఎం కేసీఆర్ ప్రసంగం నిజామాబాద్ ప్రతినిధి/నమస్తే తెలంగాణ: ఇందూరు పులకరించింది. గిరిరాజ్ కళాశాల మైదానం జై తెలంగాణ.. జై కేసీఆర్ నినాదాలతో మిన్నంటింది. మంగళవారం సీఎం కేసీఆర్.. పా..
హామీలకు రాం..రాం..!
-విభజన హామీలు విస్మరించిన కేంద్రం -తెలంగాణకు ఎనలేని నష్టం హైదరాబాద్,నమస్తే తెలంగాణ: విభజన హామీలను కేంద్ర ప్రభుత్వం విస్మరించింది. ఆరు దశాబ్దాలుగా తెలంగాణ ప్రాంతం తీవ్ర అణచివేతకు గురైంది. ఉద్యమ నాయకుడైన కల్వకుంట్ల చంద్ర..
Advertisement
telugu matrimony
Follow Us On
Today's E-paper