కవితా సంపుటాలకు ఆహ్వానం


Mon,May 13, 2019 12:46 AM

సహృదయ సాహితీ పురస్కారం -2018 కోసం 2014-18 మధ్యకాలంలో వచ్చిన కవితా సంపుటాలను 2019 జూన్15వ తేదీలోగా పంపాల్సిందిగా కోరుతున్నాం. చిరునామా:కుందా వఝ ల కృష్ణమూర్తి, ఫ్లాట్ నెం:207, ఇంటి నెం: 2-7-580, సెంట్రల్ ఎక్సైజ్ కాలనీ, హనుమకొండ-506001.
వివరాలకు: 9849366652
- డాక్టర్ ఎన్.వి.ఎన్. చారి, 9866610429

కందుకూరి శత వర్ధంతి సభ

కవి సంధ్య సాహిత్య సాంస్కృతిక సంస్థ ఆధ్వర్యంలో కందుకూరి వీరేశలింగం శత వర్ధంతి సభ యానాంలో 2019 మే 19న, గీతాభవనం ఆడిటోరియంలో నిర్వహించబడుతున్నది. శిఖామణి అధ్యక్షతన జరుగు సభలో డాక్టర్ వాడ్రేవు సుందరరావు, పి.పద్మజావాణి, డాక్టర్ తలారి వాసు ప్రసంగిస్తారు. దాట్ల దేవదానం రాజు, మధునాపంతుల, భాస్కరరెడ్డి, గనారా, చిన్నారి తదితరులు హాజరవుతారు.
- దాట్ల దేవదానంరాజు, కవిసంధ్య కార్యదర్శి

ధ్వని-6 కవిత్వలయ

కవిత్వ విశ్లేషణ కార్యక్రమం హైదరాబాద్, నగర కేంద్ర గ్రంథా లయంలో మే 18న సాయంత్రం 5 గంటలకు జరుగుతుంది. నాళేశ్వరం శంకరం, బాణాల శ్రీనివాసరావు, బిల్లా మహేందర్ కవితలు వినిపిస్తారు. పగడాల నాగేందర్ ధ్వని కవిత్వ విశ్లేషణ చేస్తారు. అతిథిగా అయాచితం శ్రీధర్ పాల్గొంటారు.
-తెలంగాణ సాహిత్య సమాఖ్య

158
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles