హవ్ హమ్ హైద్రాబాదీ!


Mon,April 22, 2019 01:12 AM

(నరేంద్ర లూథర్‌తో ఇంటర్వ్యూలు)
SCAN1131
నరేంద్రలూథర్ దేశ విభజనకు పూర్వం ఇప్పటి పాకిస్థాన్‌లో స్వర్ణకారుల కుటుంబంలో జన్మించారు. విభజన నేపథ్యంలో నూనూగు మీసాల వయసులో శరణార్థిగా ఇండియా వచ్చారు. రచనలో హాస్యాన్ని ఒలికించటంలో ఆయనకు ఆయనే సాటి.
రచన-పున్నా కృష్ణమూర్తి వెల- రూ. 120
ప్రతులకు-నవచేతన పబ్లిషింగ్ హౌస్, గిరిప్రసాద్ భవన్, బండ్లగూడ, జీఎస్‌ఐ పోస్ట్,
హైదరాబాద్-68. ఫోన్-29884453

ఆస్కార్ వైల్డ్ ఆలోచనలు
SCAN148
ఆస్కార్ వైల్డ్ అసాధారణ కళాకారుడు. అతని ప్రతి మాటా మనపై బలమైన ముద్రవేస్తుంది. అతని వాక్యాలు మనల్ని జీవితాంతం వెంటాడుతాయి. అతని డొరియన్ గ్రే నవల కళాకారునిగా అతన్ని ఉన్నతస్థానంలో నిలిపింది. ఆయన వ్యంగ్యం చమత్కారం మనల్ని నిరుత్తుల్ని చేస్తాయి.
రచన-ఆస్కార్ వైల్డ్ తెలుగు-సౌభాగ్య
వెల- రూ. 70
ప్రతులకు-విశాలాంధ్ర బుక్ హౌస్ అన్ని కేంద్రాలు.

సాలగ్రామం (ఆత్మకథ)
SCAN147
ఇది కపిలవాయి లింగమూర్తి ఆత్మకథ. జీవితంలో బుద్ధి తెలిసిన తర్వాత నాలుగు పెద్ద తవాయిలు గత్తర, ప్లేగు, రేషను కంట్రోలు, రజకార్ ఉద్యమం జరిగాయి. ఆ కష్టకాలంలో ఆయన కుటుంబానికి పనిలేక ఎన్నో అవస్థలు పడ్డారు. అయినా ఆపకుండా చదివి సాహిత్యంలో అందనంత ఎత్తుకు ఎదిగిన కపిలవాయి అందరికీ ఆదర్శప్రాయులు.
రచన-కపిలవాయి లింగమూర్తి
వెల-రూ. 150
ప్రతులకు-అన్ని పుస్తక కేంద్రాలు

128
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles