సాగర్ కవిత్వంతో ఓ సాయంత్రం


Mon,February 11, 2019 12:34 AM

ప్రముఖ కవి, పాత్రికేయుడు అరుణ్‌సాగర్ మూడవ వర్ధంతి సందర్భంగా 2019 ఫిబ్రవరి 12న సాయంత్రం 6 గంటలకు హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో సాగర్ కవిత్వంతో ఓ సాయంత్రం నిర్వహిస్తున్నాం. ఈ సభలో ఘంటా చక్రపాణి, అల్లం నారాయణ, గోరటి వెంకన్న, దేవిప్రియ, ఆలపాటి సురేష్ కుమార్, లక్ష్మీనరసయ్య, శిఖామణి తదితరులు పాల్గొంటారు. అందరి కీ ఆహ్వానం.
- అరుణ్ సాగర్ మిత్రులు, అభిమానులు

మాలిమి ఆవిష్కరణ సభ

కోమటిరెడ్డి బుచ్చిరెడ్డి రచించిన మాలిమిపుస్తకావిష్కరణ సభ 2019 ఫిబ్రవరి 16న సాయంత్రం 4.30 గంటలకు నల్లగొండ జిల్లా గ్రంథాలయం ఆవరణలో జరుగుతుంది. తండు కృష్ణ కౌండిన్య అధ్యక్షతన జరుగు సభలో అతిథులుగా పూల రవీందర్, యం.వి. గోనారెడ్డి, డాక్టర్ కోయి కోటేశ్వరరావు, ఏచూరి జైలజ తదితరులు హాజరవుతారు. సుంకిరెడ్డి నారాయణరెడ్డి పుస్తకా విష్కరణ చేస్తారు. వందన సమర్పణ కొప్పుల యాదయ్య.
- కవితా దోస్తాన్, నల్లగొండ

భరోసా ఆవిష్కరణ సభ

జి.ఉమామహేశ్వర్ కథాసంపుటి భరోసా ఆవిష్కరణ సభ 2019 ఫిబ్రవరి 16న సాయంత్రం 6 గంటలకు హైదరాబాద్ రవీంద్రభారతిలో జరుగుతుంది. వాసిరెడ్డి నవీన్ అధ్యక్షతన జరుగు సభలో కె. శివారెడ్డి, మామిడి హరికృష్ణ, ఎన్. వేణుగోపాల్, ఏ.కె. ప్రభాకర్ ప్రసంగిస్తారు.
- తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ, పాలపిట్ట బుక్స్

కవి సమ్మేళనం

కామన్ డయాస్ ఆధ్వర్యంలో తెలంగాణ ప్రశస్తి,సామాజిక అంశాలపై కవిసమ్మేళనం 2019 ఫిబ్రవరి 17న ఉదయం 10 గంటలకు హైదరాబాద్ చిక్కడపల్లిలోని నగర కేంద్ర గ్రంథాలయంలో జరుగుతుంది. గౌరవ అతిథులుగా కె. ప్రసన్నారామమూర్తి, డాక్టర్ నాళేశ్వరం శంకరం, లక్కరాజు నిర్మల, హరీత్ రుడా తదితరులు హాజరవుతారు..
- తంగెళ్లపల్లి కనకాచారి, కామన్ డయాస్‌అధ్యక్షులు

304
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles