చైతన్య ప్రకాశ్ సంస్మరణ సభ


Mon,February 4, 2019 01:36 AM

ప్రముఖ కవి, కథారచయిత సంస్మరణ సభ 2019 ఫిబ్రవరి 5 సాయంత్రం 6 గంటలకు హైదరాబాద్, రవీంద్రభారతి కాన్ఫరెన్స్ హాల్ లో జరుగుతుంది. డాక్టర్ నాళేశ్వరం శంకరం అధ్యక్షతన జరుగు సభలో నందిని సిధారెడ్డి, డాక్టర్ కాశీం, కె.పి.అశోక్‌కుమార్, డాక్టర్ వి.శంకర్, డాక్టర్ మామిడి హరికృష్ణ, డాక్టర్ ఏనుగు నరసింహారెడ్డి పాల్గొంటారు. వఝల శివకుమార్, తైదల అంజయ్య, పొన్నాల బాలయ్య, ఘనపురం దేవేందర్, కొత్త అనిల్‌కుమార్, దూడం సంపత్‌కుమార్ చైతన్య ప్రకాశ్ కవిత్వ పఠనం చేస్తారు. సభా సమన్వయం కందుకూరి శ్రీరాములు, బెల్లంకొండ సంపత్‌కుమార్.
- తెలంగాణ రచయితల సంఘం, తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ

ఆవిష్కరణ సభ

డాక్టర్ కొండపల్లి నీహారిణి రచించిన రెండు పుస్తకాల ఆవిష్కరణ సభ 2019 ఫిబ్రవరి7న ఉదయం 10.30గంటలకు హైదరాబాద్ రవీంద్రభారతి సమావేశ మందిరంలో జరుగుతుంది. డాక్టర్ ఏనుగు నరసింహారెడ్డి అధ్యక్షతన జరుగు సభలో గౌరవ అతిథులుగా డాక్టర్ నందిని సిధారెడ్డి, మామిడి హరికృష్ణ, డాక్టర్ అమ్మంగి వేణుగోపాల్, డాక్టర్ నాళేశ్వరం శంకరం, డాక్టర్ వెల్దండ నిత్యానందరావు, డాక్టర్ కె.పి. అశోక్‌కుమార్ హాజరవుతారు. సభా సమన్వయం-కందుకూరి శ్రీరాములు.
- తెలంగాణ రచయితల సంఘం, తెలుగు భాషా సాంస్కృతిక శాఖ

కావ్య పరిమళం

తెలంగాణ సాహిత్య అకాడమి నెలనెలా కావ్య పరిమళంపరంపరలో భాగంగా 2019 ఫిబ్రవరి 8న సాయంత్రం 6 గంటలకు రవీంద్రభారతి కాన్ఫరెన్స్ హాల్‌లో కాళోజీ నా గొడవపై డాక్టర్ తూర్పు మల్లారెడ్డి ప్రసంగిస్తారు. సభకు నందిని సిధారెడ్డి అధ్యక్షత వహిస్తారు
- డాక్టర్ ఏనుగు నరసింహారెడ్డి, తెలంగాణ సాహిత్య అకాడమి కార్యదర్శి

నవగళం-యువగళం-పరిమళం

నాద ప్రభ సమర్పణలో నవగళం-యువగళం-పరిమళం కార్యక్రమం 2019 ఫిబ్రవరి 8న 6 గంటలకు హైదరాబాద్ రవీంద్రభారతిలో జరుగుతుం ది. దర్భా మృదురవళి- గాత్రం, ధర్మాల హరిప్రియ- గాత్రం చేయనుండగా ధర్మాల శైలజ వయొలిన్, ధర్మాల రామమూర్తి మృదంగంతో సహకరిస్తారు.
- నాద ప్రభ

అవార్డు ప్రదానం

2019, ఫిబ్రవరి 10వ తేదీన సాయంత్రం 5 గంటలకు రవీంద్రభారతిలో తెలంగాణ వికాస సమితి ఆధ్వర్యంలో మల్లావజ్జల సదాశివుడు అవార్డు ప్రధాన కార్యక్రమం జరుగనున్నది. దేశపతి శ్రీనివాస్ అధ్యక్షత వహిస్తున్న ఈ కార్యక్రమంలో గౌరవ అతిథులుగా సంతోష్‌కుమార్ ఎంపీ, బాల్క సుమన్ ఎమ్మెల్యే, డాక్టర్ నందిని సిధారెడ్డి, పాపిరెడ్డి, సీతారాంరావు, డాక్టర్ అయాచితం శ్రీధర్, మామిడి హరికృష్ణ, తదితరులు పాల్గొంటారు. ఈ సందర్భంగా కోడూరి విజయకుమార్‌కు అవార్డు ప్రదానం చేయనున్నారు.
- ఎర్రోజు శ్రీనివాస్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, తెలంగాణ వికాస సమితి

776
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles