లైఫ్ ఈజ్ ఏ మూవ్‌మెంట్ ఆవిష్కరణ


Sun,January 27, 2019 11:47 PM

ప్రొఫెసర్ ఎస్వీ రచించిన లైఫ్ ఈజ్ ఏ మూవ్‌మెంట్ ఆవిష్కరణ సభ 2019 జనవరి 29న మధ్యాహ్నం 3 గంటలకు, హైదరాబాద్ నాంపల్లిలోని తెలుగు విశ్వవిద్యాలయం సమావేశ మందిరంలో జరుగుతుంది. ప్రొఫెసర్ పి. లక్ష్మీనారాయణ అధ్యక్షతన జరుగు సభలో నందిని సిధారెడ్డి, దేశపతి శ్రీనివాస్, ప్రొఫెసర్ అలేఖ్య పుంజాల, డాక్టర్ పత్తిపాక మోహన్ పాల్గొంటారు.
- ప్రొఫెసర్ రెడ్డిశ్యామల, ప్రొఫెసర్ జి.ఎస్. గాబ్రియల్

చలినెగళ్లు (కాలుష్యంపై కవిత్వ సమరం)

చలినెగళ్లు (కాలుష్యంపై కవిత్వ సమరం) కార్యక్రమంలో భాగంగా తమ్మ నబోయిన వాసు అధ్యక్షతన బొంతపల్లి జిల్లాపరిషత్ పాఠశాల ఆవరణలో 2019 ఫిబ్రవరి 3న ఉదయం 10 గంటల నుంచి జరుగు సభలో మొదట కవిత్వశ్వాస, రచనల చెరువు, మేడ్చల్ సాహిత్య వేదిక కవుల కరచాలన కార్య క్రమం ఉంటుంది. వడ్డె ముద్దంగుల ఎల్లన్న రచన నా పల్లె తీరుపర్యావరణ పాటల సంకలనం పరిచయ కార్యక్రమం. ఎలక్ట్రో హోమియోపతి వైద్య విధా నంలో డాక్టరేట్ పొందిన డాక్టర్ చెమన్ అభినందన సభ ఉంటుంది.
- ఒద్దిరాజు ప్రవీణ్‌కుమార్, తెలంగాణ సాహిత్య సమాఖ్య
Shasri

సాహిత్యమే శ్వాసగా

తెలుగు సాహితీ ప్రపంచంలో పరిచయం అక్కరలేని పేరు ద్వా.నా.శాస్త్రి. సుదీర్ఘ అనుభవం, సామాజిక పరిశీలనాశక్తి, అనుభవంతో, తనదైన స్పందనతో రాసి న రచనల కూర్పే ఈ పుస్తకం.
రచన: డాక్టర్ ద్వా.నా.శాస్త్రి, వెల: రూ. 300,
ప్రతులకు: డాక్టర్ ద్వా.నా. శాస్త్రి, ఇంటి నెం:1-1-428, గాంధీనగర్, హైదరాబాద్-80
SCAN

అసీఫా కోసం.. (కవితా సంకలనం)

రక్తమోడుతున్న బాలికల జీవితాలను చూసి, ఆవేదనతో, ఆగ్రహంతో వెల్లువెత్తిన స్పందనలే ఈ కవితా సంకలనం. దేశంలో నానాటికీ పెచ్చరిల్లుతున్న లైంగిక దాడుల నేపథ్యంలో మానవీయ సమాజం కోసం, భద్రమైన బాలికల జీవితాల కోసం ఆకాంక్షలే ఈ కవితలు.
సంపాదకులు: వురిమళ్ల సునంద (భోగోజు)
వెల: రూ. 150, ప్రతులకు: భోగోజు ఉంపేందర్‌రావు
ఇంటి నెం:11-10-694/5, బురహాన్‌పురం
ఖమ్మం. సెల్: 9441815722

633
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles