మందారం


Mon,January 21, 2019 01:28 AM

-(నందిని సిధారెడ్డి అభినందన సంచిక)
Mandaram
తెలంగాణ సాహిత్య, సాంస్కృతిక, అస్తిత్వ ఉద్యమాలలో మొదటి వరుసలో కనిపించే పేరు నందిని సిధారెడ్డి. ఆయన వ్యక్తిత్వం, జీవితం, సాహిత్య, సామాజిక ఉద్యమాలు, వాటి సాఫల్యతల గురించి తెలు గు సమాజంలోని ప్రముఖుల అభిప్రాయ, అభినందన మాల ఈ పుస్తకం.

సంపాదకులు: డాక్టర్ గంటా జలంధర్‌రెడ్డి, వెల: రూ. 500, ప్రతులకు: గంటా జలంధర్‌రెడ్డి, ఇంటి నెం:9-70 ఏ, ప్రజయ్ గుల్మోహర్ గేటెడ్ కమ్యూనిటీ, కుంట్లూర్‌రోడ్, పెద్ద అంబర్‌పేట్, రంగారెడ్డి జిల్లా. సెల్:9848292715
SCAN
నా ప్రయాణం సీహెచ్ హనుమంతరావు వృత్తిపరమైన జీవితకాలమంతా భారతదేశ అధ్యయనానికి సమర్పించిన ప్రతిష్ఠాత్మకమైన ఆర్థికవేత్త. నిబద్ధతగల విద్వాంసుడు. దేశ ఆర్థికాభివృద్ధి రూపకల్పనలో ఒక విద్యావేత్త ప్రత్యక్ష అనుభవాల అత్యంత ఆకర్షణీయమైన కథ ఇది. ప్రపంచీకరణ, ఆర్థిక సంస్కరణలు మొదలు పేదరికాన్ని, అసమానతలను అరికట్టేందుకు సామాజికంగా పేదల అనుకూల వృద్ధివైపు మౌలిక వర్తనలో ప్రత్యక్ష భాగస్వామ్యానికి సంబంధించిన పుస్తకం ఇది.
రచన: చెన్నమనేని హనుమంతరావు, వెల: రూ. 210,ప్రతులకు:నవచేతన పబ్లిషింగ్ హౌస్, గిరిప్రసాద్ భవన్, బండ్లగూడ, హైదరాబాద్-500068. ఫోన్:29884453

476
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles