జైనీ జాతీయ సాహితీపురస్కారం-2019


Mon,January 21, 2019 01:23 AM

లక్ష్మీనారాయణ జైనీ జాతీయ సాహితీపురస్కారం హైదరాబాద్ రవీంద్ర భారతి సమావేశ మందిరంలో 2019 జనవరి 29న సాయంత్రం 6 గంటలకు జరుగుతుంది. సుధామ అధ్యక్షతన జరుగు సభలో నందిని సిధారెడ్డి, శ్రీరాం తదితరులు హాజరవుతారు. అందరికీ ఆహ్వానం
- డాక్టర్ ప్రభాకర్ జైని, జైని ఇంటర్నేషనల్ ఫౌండేషన్

ఉగాది ఉత్తమ రచనల పోటీ

వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా.. ఉత్తమ కథానిక, ఉత్తమ కవిత పోటీ లకు రచనలను ఆహ్వానిస్తున్నది. కథలు 15పేజీల లోపు, కవితలు ఐదు పేజీల లోపు ఉండాలి. ఎక్కడా, వ్యక్తిగత బ్లాగ్‌లు, వెబ్‌సైట్స్ సోషల్ మీడియా లో కూడా ప్రచురించబడని వాటికే ఆహ్వానం. అలాగే నా మొదటి కవిత, మొదటి కథకు కూడా ఆహ్వానం. రచనలు 2019 మార్చి 20లోపు అందాలి. రచనలు పీడీఎఫ్, జేపీఈజీ, యూనికోడ్ ఫాంట్‌లో పంపాలి. మెయిల్: sairacha@ gmail.com,vangurifoundation@gmail.com
- వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా, హ్యూస్టన్, హైదరాబాద్, ఫోన్: 8325949054

కథ, కవితల పోటీలు-2019

దామోదరం సంజీవయ్య స్మారక కథ, కవితల పోటీలకు రచనలను ఆహ్వానిస్తున్నాం. కథలు చేతి రాతలో 5-7 పేజీలు, కవితలు 30 పంక్తులకు మించకుండా రాసి, 2019 ఫిబ్రవరి 21లోపు పంపించాలి. చిరునామా:డీఎస్ సిద్ధార్థ సాంస్కృతిక, సామాజిక సేవా సంస్థ, ప్లాట్ నెం:105, మహాలక్ష్మి టవర్స్, దేవాపురం 5వ లైన్, ఎన్టీఆర్ మున్సిపల్ స్టేడియం వెనుక, బృందావన్ గార్డెన్స్, గుంటూరు-522006. వివరాలకు:8008189979..
- ఎస్.ఆర్.రావు

ఆశావహ జీవన సందేశం- సాహిత్య సభ

పాలమూరు అధ్యయన వేదిక ఆధ్వర్యంలో కవిత్వంతో ఒకరోజు సాహి త్య సభ 2019 ఫిబ్రవరి 3న మహబూబ్‌నగర్‌లోని రోజ్‌గార్డెన్ ఫంక్షన్ హాల్‌లో జరుగుతుంది. జస్టిస్ బి.సుదర్శన్‌రెడ్డి ప్రారంభోపన్యాసం చేసే సభలో ప్రొఫెసర్ హరగోపాల్, కె.శివారెడ్డి, ఖాదర్, దర్భశయనం శ్రీనివాసాచార్య, పాణి ప్రసంగిస్తారు. అలాగే నందిని సిధారెడ్డి, జి.లక్ష్మీనరసయ్య, కవి యాకు బ్, ఎ.కె.ప్రభాకర్, కోయి కోటేశ్వర్‌రావు, కొండేపూడి నిర్మల, దేవీప్రియ, వాసిరెడ్డి నవీన్, ఎన్.వేణుగోపాల్ హాజరవుతారు. ఎ.రాజేంద్రబాబు, సి.రామ్మోహన్, ఉదయమిత్ర, ఎ.తిమ్మప్ప, కె.సి.వెంకటేశ్వర్లు, ఎం.రాఘవాచారి, జి.బుచ్చన్న, జి.వెంకట్‌గౌడ్ తదితరులు పాల్గొంటారు.
- పాలమూరు అధ్యయన వేదిక

611
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles