నమామి సృజన రచనలు-సమగ్రపరిశీలన


Sun,December 30, 2018 11:02 PM

పరిశోధన గ్రంథావిష్కరణ సభ

ప్రముఖ కవి, పరిశోధకులు ప్రొఫెసర్ ననుమాస స్వామి సృజన రచనల మీద వచ్చిన ప్రామాణిక పరిశోధక రచన నమామి సృజన రచనలు-సమగ్రపరిశీలన ఆవిష్కరణ సభ 2018 డిసెంబర్ 31న ఉదయం 11 గంటలకు హైదరాబాద్ బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో జరుగుతుంది. జూలూరు గౌరీశంకర్ అధ్యక్షతన జరుగు సభలో గౌరవ అతిథులుగా డాక్ట ర్ నందిని సిధారెడ్డి, హైమవతి భీమన్న, డాక్టర్ పిబి విజయకుమార్ పాల్గొంటారు. పుస్తక స్వీకర్తలుగా డాక్టర్ పొలమూరి విక్రమ్, ప్రొఫెసర్ ననుమాస స్వామి, ఉదయశ్రీలు హాజరవుతారు.
- ననుమాస సుభాషు కుమార్, 9394771000

కొలకలూరి విశ్రాంతమ్మ పరిశోధన పురస్కారం-2019

గడిచిన మూడేండ్లలో 2016నుంచి 2018 వరకు ముద్రితమైన తెలు గు పరిశోధన గ్రంథం పురస్కారానికి గాను పరిశోధకులు తమ గ్రంథాల ను 2019 జనవరి 20తేదీలోగా మూడు ప్రతులు పంపాలని కోరుతు న్నాం. హైదరాబాద్‌లో 2019 ఫిబ్రవరి 26న పురస్కారం ప్రదానం చేయటం జరుగుతుంది. చిరునామా: డాక్టర్ కొలకలూరి సుమకిరణ్, శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయం, తిరుపతి-517502. ఆం.ప్ర.
- డాక్టర్ కొలకలూరి సుమకిరణ్, 9963564664

కొలకలూరి భాగీరథీ విమర్శ పురస్కారం-2019

ఈ ఏడాది విమర్శనానికి గడిచిన మూడేండ్లలో 2016 జనవరి నుంచి 2019 డిసెంబర్ వరకు ముద్రితమైన విమర్శ గ్రంథం పురస్కారానికి పరిశీలించబడుతుంది. ఇందుకోసం మూడు ప్రతులు 2019 జనవరి 20లోగా పంపించాలని కోరుతున్నాం. చిరునామా: ఆచార్య కొలకలూరి మధుజ్యోతి, శ్రీపద్మావతి మహిళా విశ్వవిద్యాలయం, తిరుపతి-517502. ఆం.ప్ర.
- డాక్టర్ కొలకలూరి మధుజ్యోతి, 9441923172

ప్రకృతి వ్యవసాయ గీత రచనలకు ఆహ్వానం

ప్రకృతి వ్యవసాయం ఆవశ్యకత తెలుపుతూ రాసిన వ్యవసాయ గీతాల రచనలకు ఆహ్వానం. తెలుగు రాష్ర్టాల నుంచి రచయితలు తమ రచనల ను 2019 జనవరి 22 తేదీలోగా.. 9440164289,9494012244 (వాట్సప్), [email protected] కు పంపించాలి.
- డాక్టర్ డి.పారినాయుడు, జట్టు ట్రస్ట్, గరుగుబిల్లి మండలం, విజయనగరం జిల్లా

కవితా పఠనం పోటీ-2018

సాంస్కృతీ సమాఖ్య ఆధ్వర్యంలో 2019 జనవరి 27న విజయవాడ లో కవితా పఠనం పోటీ నిర్వహించబడుతుంది. కవులు, రచయిత్రులు తమ వివరాలు, చిరునామా, ఫొటో వివరాలను నెం.9985785322కు పంపాలి. కవులకు డాక్టర్ అద్దేపల్లి రామమోహన్‌రావు కవితా సృజన పురస్కారాలు- 2018ఆరోజు జరిగే సభలో ప్రదానం చేస్తారు.
- వి.విరీష్‌కుమార్, 9985785322

837
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles