కొన్ని నవ్వులు ఏరుకుందామని


Mon,December 17, 2018 01:30 AM

-మహెఫిల్లో కోయిల ఆవిష్కరణ సభ
తుమ్మూరి రాంమోహన్‌రావు రచించిన కొన్ని నవ్వులు ఏరుకుందామని (కవిత్వం), మహెఫిల్లో కోయిల (తెలుగు గజల్లు) ఆవిష్కరణ సభ 2018 డిసెంబర్ 29న సాయంత్రం5.30 గంటలకు హైదరాబాద్ రవీంద్రభారతి సమావేశ మందిరంలో జరుగుతుంది. డాక్టర్ ఏనుగు నరసింహారెడ్డి అధ్యక్షతన జరుగు సభలో గౌరవ అతిథులుగా నందిని సిధారెడ్డి, మామిడి హరికృష్ణ, డాక్టర్ ద్వా.నా.శాస్త్రి, నాగబాల సురేష్ కుమార్, రమణ వెలమకన్ని, తాళ్లపల్లి మురళీధర గౌడ్ హాజరవుతారు. డాక్టర్ తిరుమల శ్రీనివాసాచార్యులు, డాక్టర్ కె.వి.రమణ కృతి స్వీకర్తలుగా హాజరవుతారు.
-తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ
-తేజ ఆర్ట్ క్రియేషన్స్


కవితల పోటీ-2019

కవిసంధ్య, జైనీ ఫౌండేషన్ నిర్వహించు కవితల పోటీ-2019కి కవితలను ఆహ్వానిస్తున్నాం. సమకాలీన వస్తువు, ఆధునికమైన భాష, అభివ్యక్తితో కూడిన వచన కవితలు పరిశీలించబడుతాయి. పోటీలో పాల్గొనదలిచిన వారు ఎంట్రీ ఫీజు రూ. 200లు ఎం.ఓ ద్వారాగానీ, కవి సంధ్య అకౌంట్: 15571110000236/ IFSC Code- ANDB000 1557కు పంపాలి.
కవితలపై రచయితల పేరు రాయకూడదు. విడిగా హామీ పత్రంపై మాత్రమే రాయాలి. రచనలు జనవరి 30లోపు పంపాలి. చిరునామా: దాట్ల దేవదానం రాజు, 8-1-048, జక్రియనగర్, యానాం-533464, తూర్పుగోదావరి జిల్లా. ఏపీ. సెల్:94401,8555830789
- దాట్ల దేవదానంరాజు కవితల పోటీ కన్వీనర్
-యాదాద్రి భువనగిరి జిల్లా


పరిశోధకులకు అభినందన సత్కారం

తేజ ఆర్ట్ క్రియేషన్స్, త్యాగరాయ గానసభ సంయుక్త నిర్వహణలో యాదాద్రిభువనగరి జిల్లా పరిశోధకుల అభినందన సత్కార సభ 2018 డిసెంబర్ 26న సాయంత్రం 6 గంటలకు హైదరాబాద్ త్యాగరాయ గానసభ ఆవరణలో జరుగుతుంది. డాక్టర్ కూరెళ్ల విఠలాచార్య అధ్యక్షతన జరుగు సభలో గౌరవ అతిథులుగా నందిని సిధారెడ్డి, డాక్టర్ ఏనుగు నరసింహారెడ్డి, వి.ఎస్.కళాజనార్దన మూర్తి, బైస దేవదాసు, డాక్టర్ పెసర వేణుగోపాల్‌రెడ్డి, డాక్టర్ గంటా జలంధర్‌రెడ్డి, గుడిపల్లి వీరారెడ్డి హాజరవుతారు.
- డాక్టర్ పోరెడ్డి రంగయ్య
-తేజ ఆర్ట్ క్రియేషన్స్ అధ్యక్షుడు


జ్ఞాపకాల తడి ఆవిష్కరణ సభ

వైద్యం భాస్కర్ కవితా సంపుటి జ్ఞాపకాల తడి ఆవిష్కరణ సభ 2018 డిసెంబర్ 22న సాయం త్రం 5.30 గంటలకు హైదరాబాద్ బుక్ ఫెయిర్‌లో జరుగుతుంది. కవి యాకూబ్ అధ్యక్షతన జరుగు సభ లో నాగేంద్రగౌడ్, సుబ్బారావు, జీవన్, సీహెచ్ అంజనేయులు, గుడిపాటి, లెనిన్‌శ్రీనివాస్ తదితరులు ప్రసంగిస్తారు.
- పాలపిట్ట బుక్స్

825
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles