మనిషొక కళ


Mon,December 10, 2018 12:48 AM

మనిషి మనిషొక గల గల నవ్వు
మొకమొక విచ్చుకున్న మల్లెపువ్వు
నేలమీద కలె తిరిగే అరిపాదాలు
చెట్లమీద వాలిన చిలకల గుంపులు
నది నిండుగ నీళ్ళు పారుతున్నట్టుగ
చెరువుల నిండా జలం నిండినట్లు
ఊరూవాడా చెలుకలు చేన్లన్నీ
మనుషుల అలికిడితో కళకళలు
ప్రతి ఉదయాన్నే నేను
నడక కోసం మైదానంకు నడుస్తాను
రౌండ్లు రౌండ్లుగా తిరిగి
నయనాల నవ్వులు, మాటల పువ్వులు
దోసిలిలో నింపుకుంటాను
ఒకరికొకరం ఎదురైతేనే
మనసంతా సింగార మందహాసం
మాటలు మాటలు కలిపితే
తేలిపోయిన తిప్పల తలనొప్పులు
రోజువారీ కనిపించే పరిచయాలు
చూపులకు చూపులుకలిసిన తడి
కొన్ని కరచాలనాల దాకా కొనసాగింపు
ఇంటిసుట్టూ వాడకట్టూ
ఎవల లోకంల వాల్ల కదలికలు
బస్సులు రైల్లు ఆఫీసులు కార్కానాలు
ఎవల పనులల్ల వాల్లే సంలీనత
మానవుల సామాజిక జీవన ప్రమాణాలు
పచ్చని నయనానంద ఉద్యానవనాలు
మనుష్యులే నిర్మానుష్యం అయితే
మౌనవే ఏకాంత చీకటి అవుతుంది
మిత్రులు, శత్రువులు ఎవలైనా
నేల నేలంతా జీవన కళ నిండాలి
- అన్నవరం దేవేందర్
94407 63479

546
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles