దేశం లేని ప్రజలు ఆవిష్కరణ


Mon,December 10, 2018 12:46 AM

డాక్టర్ ప్రసాదమూర్తి కవితా సంపుటి దేశంలేని ప్రజలు ఆవిష్కర ణ సభ 2018 డిసెంబర్ 16న సాయంత్రం 5.30 గంటలకు హైదరాబాద్ బుక్ ఎగ్జిబిషన్‌లో జరుగుతుంది. ఈ కార్యక్రమలో అతిథులుగా దేవిప్రియ, సిధారెడ్డి, ఖాదర్ మోహియుద్దీన్, శిఖామణి, ఎన్. వేణుగోపాల్, జి. లక్ష్మీనరసయ్య, యాకూబ్, మువ్వా శ్రీనివాసరావు తదితరులు పాల్గొంటారు.

కావ్య పరిమళం

తెలంగాణ సాహిత్య అకాడమీ నెలనెలా కావ్య పరిమళంపరంపరలో భాగంగా 2018 డిసెంబర్ 14న సాయంత్రం 6 గంటలకు రవీంద్రభారతి కాన్ఫరెన్స్ హాల్‌లో జరుగుతుంది. వానమామలై జగన్నాథాచార్యులు రచించిన రైతు రామాయణంపై డాక్టర్ గండ్రా లక్ష్మణ్‌రావు ప్రసంగిస్తారు. సభకు నందిని సిధారెడ్డి అధ్యక్షత వహిస్తారు..
- డాక్టర్ ఏనుగు నరసింహారెడ్డి తెలంగాణ సాహిత్య అకాడమి, కార్యదర్శి

ఓ వర్షం కురిసిన రాత్రి ఆవిష్కరణ

కాంచనపల్లి రచించిన ఓ వర్షం కురిసిన రాత్రి ఆవిష్కరణ సభ నాంపల్లిలోని తెలుగు యూనివర్సిటీ ఆడిటోరియంలో 2018 డిసెంబర్ 10న సా॥6 గంటలకు జరుగుతుంది. సభలో ఎంపీ కవిత, కెవి రమణాచారి, నందిని సిధారెడ్డి, అయాచితం శ్రీధర్, బి.ఎస్.రాములు, జూలూరు గౌరీశంకర్, ఏనుగు నరసింహారెడ్డి, కె.విమల పాల్గొంటారు.
- పాలపిట్ట బుక్స్

జాతీయస్థాయి కవితల పోటీ

తెలుగు పూలతోట ఫేస్‌బుక్ కవితా సమూహం ఆధ్వర్యంలో రెడ్నంసత్యవతమ్మ స్మారక జాతీయ కవితా పోటీలు నిర్వహించబడుతున్నాయి. కవితలు సామాజిక, అభ్యుదయ అంశాలై ఉండాలి. కవులు ఒక కవిత మాత్రమే 25 లైన్లకు మించకుండా రాయాలి. రచనలు డిసెంబర్ 31లోపు అందేలా పంపాలి. చిరునామా: కె. పృథ్వీరాజ్, ఫ్లాట్ నెంబర్:408, సాయిశ్రీ నివాసం, రైతు బజార్ దగ్గర, లింగంపల్లి, నల్లగండ్ల పోస్ట్, హైదరాబాద్-19
- వెన్నెల సత్యం, 9440032210, శాంతికృష్ణ, 9502236670

రచనలకు ఆహ్వానం

సాహితీ వేత్త డాక్టర్ మల్లవరపు రాజేశ్వరరావు స్మారక సంచిక కోసం రచనలను ఆహ్వానిస్తున్నాం.రచనలు 2018 డిసెంబర్ 20లోపు jaanudilit @gmail.comకు పంపాలి. వివరాలకు: 9848187416
- డాక్టర్ నూకతోటి రవికుమార్

559
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles