అస్తిత్వ పరిమళాలు


Sun,December 2, 2018 11:12 PM

సారస్వత చైతన్యం ముద్రితమైన అభిజాత్యం, ఆంగ్ల సారస్వతము లో డాక్టరేట్ పరిశోధన పర్యంతం కొనసాగిన అధ్యయన కృషి, తాను ఎదిగి వచ్చేనాటికి తెలంగాణలో ఉప్పొంగుతున్న అస్మిత కోసం జరుగుతున్న పోరాటం, హన్మకొండలో నిరంతరంగా ఉజ్వలంగా పొంగెత్తుతున్న నిత్య సాహిత్య చైతన్యం ఇవ్వన్నీ ఈ వ్యాస రచయిత్రిని ముందుకు తీసుకువచ్చాయి. ఆమే డాక్టర్ దేవులపల్లి వాణి.

ఈ వ్యాస సంకలనంలో రెండు వ్యాసాలు తనలోనికి తాను చూసుకుం టూ ఇన్నేండ్లలో సమాజంలో ఆవరించిన ఉద్విగ్నతలు, క్రమంగా మరుగైపోతున్న పల్లెల వాతావరణమూ, సమిష్టి కుటుంబ జీవన మాధుర్యము జ్ఞాపకాలుగానే మిగిలిపోతున్న సంస్కృతి సభ్యతలు, నేటి జీవన వేగానికి కరిగిపోతున్న పండుగలు, ఆచార పద్ధతులు మనకు గోచరిస్తాయి. ఈ వ్యాసాలలో వాణి తన బాల్యాన్ని ఒక రంగుల చిత్రం లాగ దర్శింపజేసింది.

ఈ వ్యాససంపుటిలో ఆమె వ్యుత్పన్నతను ప్రకటించే సాహిత్య విమర్శ వ్యాసాలున్నాయి. విజయ టెండుల్కర్ నాటకాలను గురించి విశ్లేషణ విశిష్టమైనది. ఈ వ్యాసాల్లో పరిభాషా క్లిష్టత లేకుండా రచన అంతా ఒక సెలయే రు లాగా కదిలిపోతున్నది. ఈ రచయిత్రి ముందుముందు అనేక రచనలు చేసి తెలుగు సారస్వతాన్ని సుసంపన్నం చేయాలని కోరుకుంటున్నాను.
- ఆచార్య కోవెల సుప్రసన్నాచార్య
(పుస్తకానికి ఆచార్య కోవెల రాసిన ముందుమాట భూమికనుంచి కొన్ని భాగాలు)


అస్తిత్వ పరిమళాలు ఆవిష్కరణ సభ

హైదరాబాద్ రవీంద్రభారతిలో 2018 డిసెంబర్ 3న సాయంత్రం 6 గంటలకు జరుగుతుంది. ఆచార్య బన్న అయిలయ్య అధ్యక్షతన జరుగు సభలో అల్లం నారాయణ, మామిడి హరికృష్ణ, కట్టా శేఖర్‌రెడ్డి, దేశపతి శ్రీనివాస్,డాక్టర్ ముదిగంటి సుజాతారెడ్డి, ప్రభాకర్‌జైని, కొండపల్లి నీహారిణి తదితరులు పాల్గొటారు. నందిని సిధారెడ్డి పుస్తకాన్ని ఆవిష్క రిస్తారు.
- తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ, తేజ ఆర్ట్ క్రియేషన్స్

565
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles