(స్త్రీల లైంగిక విషాదగాథలు)

సమాజం నాగరికమయ్యే క్రమంలో మానవీయ విలువలు పెంపొందాల్సి ఉండగా అమానవీయ సామాజిక హింస పెరిగిపోతున్నది. ముఖ్యంగా స్త్రీలపై హింసాదౌర్జన్యాలు పెచ్చరిల్లుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇంటా బయటా భద్రతలేని స్త్రీల జీవితాల్లో నిత్యం చోటుచేసుకుంటున్న హింస చుట్టూ రచయిత గీతాంజలి అల్లిన కథలివి. జెండర్ స్వేచ్ఛా సమానత్వాల గురించి, సహజమైన ప్రేమానుబంధాల గురించీ, పరస్పరం గౌరవించుకునే దాంపత్య సంబంధాల గురించీ సున్నితమైన దేహభాషతో పరిమళించాల్సిన లైంగికత గురించి మగవాళ్లను సెన్సిటైజ్ చేయటానికి గీతాంజలి ఈ వ్యూహాన్ని ఎన్నుకున్నారు. నేటి సామాజిక స్థితిలో ఈ గొంతుక అవసరం.
రచన: గీతాంజలి, వెల: రూ. 150, ప్రతులకు: 3-6-6772/2,
ఫ్లాట్ నెం: 302, ఎంఎస్కే టవర్స్, స్ట్రీట్ నెం:11
హిమాయత్‌నగర్, హైదరాబాద్-29