అణుశక్తి-విధ్వంసం


Mon,October 8, 2018 01:40 AM

SCAN3
పాలకులు సందర్భానుసారంగా అనే క విషయాలు తెరమీదికి తెస్తారు. విదేశీ ఒప్పందాలు మన శక్తికోసమే, దేశాభివృద్ధి కోసమేనని నమ్మబలుకుతారు. అం దులో మొదటిది, ముఖ్యమైనది అణుశక్తి ఒప్పందం. దీంతో మనం ప్రపంచ దేశాల్లో ఒక అగ్రశ్రేణి రాజ్యంగా అవతరిస్తామని చెబుతారు. కానీ దాంతో ప్రజలకు చేగూరే నష్టం గురించి, భవిష్యత్తులో ఏర్పడే ప్రమా దం గురించి చెప్పరు. దాచిపెడుతారు. దాని అసలు విషయమే ఈ పుస్తకం.
రచన: కె.బాలగోపాల్, వెల: రూ.60,
ప్రతులకు:ఎస్.జీవన్‌కుమార్, సెల్:9848986286


వామపక్షం నూతన ప్రపంచం

SCAN1
21వ శతాబ్దపు సవాళ్లను ఎదుర్కొంటున్న వామపక్ష శక్తుల భవిష్యత్తు గురిం చి తన జీవితకాల అనుభవం ద్వారా రచయిత మార్తా హార్నెకర్ వివరిస్తారు. నేడు ప్రపంచ వ్యాప్తంగా వామపక్ష శక్తు లు ఎదుర్కొంటున్న సంక్షోభాన్ని ఈ పుస్తకం తెలుపుతుంది. సారాంశంలో ఈ పుస్తకం సోషల్ డెమొక్రాటిక్ రాజకీయాలపై విమర్శ.
రచన:మార్త హర్నెకర్, అనువాదం:ఆశాలత, వెల:రూ. 50
ప్రతులకు: విశాలాంధ్ర, ప్రజాశక్తి, ఇతర అన్ని పుస్తక కేంద్రాలు.

సర్వజ్ఞ సింగభూపాల విరచితం

SCAN2
ఈ రసార్ణవసుధాకరము నిర్దిష్టమైనది. సంస్కృత సారస్వతంలో గల అలంకార శాస్త్రముల్లో మిన్న అని చెప్పదగినది. రసోపాసకులకు ఇష్టమైన గ్రం థం. యుద్ధాలు, ఉద్యమాలు మాత్రమే కాదు, అలంకార సౌందర్య నిర్మాణం లో కూడా తెలంగాణ పాత్ర విశిష్టమైన ది, విస్మరించరానిదని ఈ పుస్తకం తెలుపుతుంది.
డాక్టర్ శ్రీరంగాచార్య, వెల: రూ. 250, ప్రతులకు: అన్ని పుస్తక కేంద్రాలు

655
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles