ఐనా ప్రయాణం ఆవిష్కరణ సభ


Mon,October 1, 2018 01:04 AM

డాక్టర్ రూప్ కుమార్ బబ్బీకార్ కవితా సంపుటి ఐనా ప్రయా ణం ఆవిష్కరణ సభ హైదరాబాద్ రవీంద్రభారతి మినీ కాన్ఫరెన్స్ హాల్‌లో అక్టోబర్ 3న సాయంత్రం 6 గంటలకు జరుగుతుంది. డాక్ట ర్ నాళేశ్వరం శంకరం అధ్యక్షతన, కందుకూరి శ్రీరాములు నిర్వహణలో జరుగుసభలో అతిథులుగా డాక్టర్ అమ్మంగి వేణుగోపాల్, మామిడి హరికృష్ణ, డాక్టర్ ఏనుగు నర్సింహారెడ్డి, డాక్టర్ తూర్పు మల్లారెడ్డి హాజరవుతారు. డాక్టర్ నందిని సిధారెడ్డి పుస్తకాన్ని ఆవిష్కరిస్తారు. బెల్లంకొండ సంపత్‌కుమార్ వందన సమర్పణ చేస్తారు.
- తెలంగాణ భాష, సాంస్కృతిక శాఖ
- తెలంగాణ రచయితల సంఘం, జంటనగరాలురొట్టమాకురేవు కవిత్వ అవార్డు-2018

రొట్టమాకురేవు కవిత్వ అవార్డు-2018 ప్రదానోత్సవ సభ అక్టోబర్ 7న ఖమ్మంజిల్లా కారేపల్లి రొట్టమాకురేవులో జరుగుతుంది. ఈ ఏడాదికి పురస్కారానికి నారాయణస్వామి (వానొస్తద?), బొల్లోజు బాబా (వెలుతురు తెర), నిర్మలారాణి తోట (ఒక చినుకుకోసం) ఎంపికయ్యారు. ప్రసేన్ అధ్యక్షతన జరుగుసభలో గౌరవఅతిథులుగా కె. శివారెడ్డి, ఏనుగు నరసింహారెడ్డి, ఖమర్ హాజరవుతారు. ఆత్మీయ అతిథులుగా జి. లక్ష్మీనరసయ్య, ప్రసాదమూర్తి, రాజారాం తూముచర్ల, సి.వి. సురేష్ హాజరవుతారు. జీవన్, సీతా రాం, వంశీకృష్ణ, కటుకోఝ్వల ఆనందాచారి, అన్వర్, క్రాంతి శ్రీనివాసరావులు హాజరవుతారు. ప్రముఖ చిత్రకారుడు ఏలె లక్ష్మణ్‌ను సత్కరిస్తారు.
- రొట్టమాకు రేవు (లైబ్రరీ అండ్ పోయెట్రీ స్పేస్)

రచనలకు ఆహ్వానం

మహాత్మాగాంధీ 150 జయంతి సందర్భంగా గాంధీ జీవితం, సిద్ధాంతా లు, స్వాతంత్య్ర పోరాటంలోని ఘటనలపై పద్య, గేయ, వచన కవిత లు రాసి 2018 అక్టోబర్ 2న నల్లగొండలోని నాగార్జున డిగ్రీ కళాశాలలో ఉదయం 9 గంటలకు జరుగు సభలో సమర్పిస్తూ పాల్గొనాల్సిందిగా రచయితలను ఆహ్వానిస్తున్నాం.
- కోమటిరెడ్డి బుచ్చిరెడ్డి, 9441561655

జిల్లా మహాసభలు

తెలంగాణ రచయితల వేదిక కామారెడ్డి జిల్లా ప్రథమ మహాసభలు రేపు కామారెడ్డిలోని కర్షక్ బీఈడీ కళాశాలలో జరుగుతాయి. సిరిసిల్లా గఫూర్ శిక్షక్ అధ్యక్షతన జరుగు సమావేశంలో గౌరవ అతిథులుగా అందెశ్రీ, అల్లం రాజయ్య, జూకంటి జగన్నాథం, ప్రొఫెసర్. వినాయకరెడ్డి, పి. వరప్రసాదరావు, సీహెచ్ మధు, గాజోజు నాగభూషణం, డాక్టర్ వి.ఆర్.శర్మ, డాక్టర్ యస్.కె. రషీద్, సూరారం శంక ర్ హాజరవుతారు. ప్రొఫెసర్ జయధీర్ తిరుమలరావు, డాక్టర్ జి. లచ్చయ్య, ఎనిశెట్టి శంకర్, కూకట్ల తిరుపతి, పెద్దింటి అశోక్‌కుమార్ ప్రసంగిస్తారు.
- తెలంగాణ రచయితల వేదిక, కామారెడ్డి జిల్లా

586
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles