ఎడారి పూలు, మాయ జలతారు ఆవిష్కరణ


Mon,September 24, 2018 12:48 AM

ఆవిష్కరణ సభ సెప్టెంబర్ 25న సాయంత్రం ఆరు గంటలకు సుందర య్య విజ్ఞాన కేంద్రంలో జరుగుతుం ది. సుధామ అధ్యక్షత వహిస్తారు. కె.వి.రమణాచారి ఆవిష్కరిస్తారు. కథ ల సంపుటిని డాక్టర్ నందిని సిధారెడ్డి ఆవిష్కరిస్తారు.
పుస్తకాలను కె.పి. అశోక్‌కుమార్, కస్తూరి మురళీకష్ణ పరిచయం చేస్తారు.
- పాల పిట్టబుక్స్

కుల దురహంకారాన్ని ఖండిద్దాం

కుల దురహంకారాన్ని ఖండిస్తూ సెప్టెంబర్ 24న సాయంత్రం 5.30 గంటలకు హైదరాబాద్ సుందరయ్య విజ్ఞానకేంద్రంలో సభ జరుగుతుంది. జి. నరేష్ అధ్యక్షతన జరుగు సభలో ఎస్. వినయ్‌కుమా ర్, ప్రొఫెసర్‌లక్ష్మీ, భూపతి వెంకటేశ్వర్లు, తంగిరాల చక్రవర్తి ప్రసంగిస్తారు. నస్రీన్ ఖాన్ కవిసమ్మేళనా న్ని నిర్వహిస్తారు.
-తెలంగాణ సాహితి

జాషువా జయంత్యుత్సవం

జాషువా 123వ జయంత్యుత్సవం సెప్టెంబర్ 24న ఉదయం 10 గంటల నుంచి ఏపీ గుంటూరులోని ఆంధ్ర క్రైస్తవ కళాశాల ఆడిటోరియంలో జరుగుతుంది. ఎస్ బాలస్వామి అధ్యక్షతన జరుగుసభలో గోరటి వెంకన్న, జయరాజ్, పసునూరి రవీందర్ ప్రసంగిస్తా రు. ఈ సందర్భంగా కోయి కోటేశ్వరరావు గారికి జాషువా సాహితీ పురస్కారం అందజేస్తారు. పురస్కార ప్రదానం డాక్టర్ పోలె ముత్యం చేస్తారు.
-ఆంధ్రప్రదేశ్ ్ర పభుత్వం భాషా సాంస్కృతిక శాఖ
-జాషువా కల్చరల్ సెంటర్


రచనలకు ఆహ్వానం

మానేరు రచయితల సంఘం ఆధ్వర్యంలో బాలల గేయ సంపుటి కోసం తెలంగాణలోని 6-10వ తరగతి విద్యార్థుల నుంచి వచనం, గేయం, పాట, పద్యం వంటి ప్రక్రియల్లో 25 లైన్లు మించని రచనలను ఆహ్వానిస్తు న్నాం. రచనలు 2018 అక్టోబర్ 5వ తేదీలోపు పంపించాలి. చిరునామా: ఎలగొండ రవి, బాలికల ఉన్నత పాఠశాల, పోలీస్ స్టేషన్ ముందు, సిరిసిల్ల-505301. సెల్: 9848770345.
-గరిపల్లి అశోక్, జిందం అశోక్

పొద్దు తిరుగుడు మనిషి ఆవిష్కరణ

ప్రొఫెసర్ జీఎన్ సాయిబాబా స్వేచ్ఛకోసం వరంగల్ దివ్యాంగుల జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యం లో రూపుదిద్దుకున్న పొద్దుతిరుగుడు మనిషి పుస్తకం ఆవిష్కరణ సెప్టెంబర్ 26న సా. 5.30 గంటలకు సుందరయ్య విజ్ఞాన కేంద్రం లో జరుగుతుంది.
-వరంగల్ దివ్యాంగుల జాయింట్ యాక్షన్ కమిటీ
-వరంగల్ రచయితల సంఘం


రచనలకు ఆహ్వానం

బతుకమ్మ పండుగ విషిష్టతను, విశేషాలను తెలిపే సమగ్ర పుస్తకం కోసం కవితలు, పాటలు, వ్యాసాలు పంపాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగే మీకు తెలిసిన ఆడియో, వీడియో రూపంలో ఉన్న పాటలను పంపగలరు. చిరునామా: బొడ్డు మహేందర్, ఇంటి నెం: 2-26 ఆదర్శనగర్, చెన్నూరు మండలం
మంచిర్యాల జిల్లా-504201.
[email protected]
-బొడ్డు మహేందర్, మేకల రామస్వామి

852
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles