గుండెల్లో గోదారి (కథలు)


Mon,September 10, 2018 12:57 AM

gunde
గోదావరి నిర్మలంగానూ, పరవళ్లు తొక్కుతూ ఉగ్రంగానూ ఉండగలదు. కామేశ్వరి కథలు కూడా కొన్ని ఆహ్లాదంగానూ, మరికొన్ని ఆలోచనాత్మకం గా, ఆగ్రహవేశాలను కలిగిస్తాయి. సాధారణ నిజ జీవితంలో జరిగిపోయే విషయాలను కథలుగా మలిచి అందులో దాగి ఉన్న మానవీయ కోణాన్ని తెలిపే కథలు ఇవి.
రచన: చెంగల్వల కామేశ్వరి, వెల: రూ.120
ప్రతులకు: జ్యోతి వలబోజు, 8096310140


మొదటిపేజీ

Modatipege
కథా రచయిత, కాలమిస్టు శ్రీరమ ణ నవ్యవీక్లీ ఎడిటర్‌గా వారం వారం రాసినవే ఈ 243 మొదటి పేజీలు. క్లుప్తంగా, ఆప్తంగా ఉండలన్నది లక్ష్యం. చదువకుండా ఎవరూ తొలి గడప దాటి వెళ్లకూడదన్నది ఆశ. ఇందులో కొన్ని స్వీయానుభవాలు. మరికొన్ని కథారూపంలో సందేశాలు. ఆలోచన నిండిన పిట్టకథలు ఇందులో ఉన్నాయి.
రచన: శ్రీరమణ, వెల: రూ.330
ప్రతులకు: అన్ని పుస్తక కేంద్రాలు


ఎడారి పూలు (నవల)

eedari
ఆర్థికావసరాలు, బ్రోకర్ల మాటలు నమ్మి అరబ్ దేశాలకు పనిమనుషులు గా వెళ్లే మహిళలు, మరింత దయనీ య పరిస్థితుల్లో నిఖా బందీఖానాల్లో చిక్కుకుంటున్న చిన్నారి అమ్మాయిల దీనగాథ ఎడారిపూలు. కోటి కలల్ని, ఆశల్ని వెతుక్కుంటూ వెళుతున్న వారికి ఎదురైన ఎడారి జీవితం, కన్నీటి గాథ.
రచన: సలీం, వెల: రూ.150, ప్రతులకు: సలీం,
ఫ్లాట్ నెం:బి2/206, లక్ష్మీనారాయణ అపార్ట్‌మెంట్స్, 3-6-164, హిమాయత్‌నగర్, హైదరాబాద్-29.


ట్రావెలాగ్ చైనా

Malladri
చైనాలోని పురాణ, ఇతిహాస, చారిత్రక విశేషాలతో పాటు, తక్కువ కాలంలో చైనా అంత అభివృద్ధిని ఎలా సాధించిందో విశేషం గా చెప్పే పుస్తకం ఇది. చైనాలో తొమ్మిది రోజులు పర్యటించి మల్లాది వెంకటకృష్ణమూర్తి రాసిన ట్రావెలాగ్ ఇది. .
రచన: మల్లాది వెంకటకృష్ణ మూరి
వెల: రూ.150, ప్రతులకు: అన్ని పుస్తక కేంద్రాలు

971
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles