కవిసమ్మేళనం- సదస్సు


Mon,August 20, 2018 01:26 AM

మఖ్దూం వర్ధంతి సందర్భంగా మూకదాడులు అంశంపై కవి సమ్మేళనం, సదస్సు హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో 2018 ఆగస్టు 25న మధ్యాహ్నం రెండుగంటలకు నిర్వహించబడుతుంది. వివరాలకు: 8897765417,9393804472.
- తెలంగాణ సాహితి

మూలమలుపు పరిచయ సభ

ఏనుగు నరసింహారెడ్డి కవితా సంపుటి మూలములుపు పరిచయ సభ మహబూబ్‌నగర్,మెట్టుగూడలోని లిటిల్ స్కాలర్ స్కూల్‌లో 2018 ఆగస్టు 23న ఉదయం 10.30 గంటలకు జరుగుతుంది. ఈ సభలో జలజం సత్యనారాయణ, గుడిపాటి, కోట్ల వెంకటేశ్వరరెడ్డి, చెమన్‌సింగ్ తదితరులు ప్రసంగిస్తారు.
- భీంపల్లి శ్రీకాంత్, తెలంగాణ రచయితల సంఘం

కథల పోటీ

దేశభక్తికి సంబంధించిన కథలు ప్రతిలిపి ఆహ్వానిస్తున్నది. స్వాతంత్య్రం కోసం పోరాడిన పాత్రల ఇతివృత్తాలుగా కథలు రాసి యూనికోడ్ ఫార్మాట్ లో telugu@pratilipi.com కి మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్టులో దేశమంటే మట్టి కాదోయ్ దేశమంటే మనుషులోయ్ అని రాయాలి.
- జాని తక్కెడశిల, 7259511956

613
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles