మొగ్గలు ఆవిష్కరణ


Mon,August 6, 2018 01:23 AM

ధ్వని ప్రచురణలు, పాలమూరు సాహితి సంయుక్త ఆధ్వర్యంలో డాక్టర్ భీంపల్లి శ్రీకాంత్ నూతన కవితా ప్రక్రియ మొగ్గలు ఆవిష్కరణ సభ 2018 ఆగస్టు 9న సాయంత్రం 5గంటలకు, మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో గల లిటిల్ స్కాలర్స్ ఉన్నత పాఠశాలలో జరుగుతుంది. బైస దేవదాసు అధ్యక్షతన జరుగు సభలో ముఖ్యఅతిథిగా ఎం.వేదకుమార్,ఆవిష్కర్తగా జలజం సత్యనారాయణ హాజరవుతారు. పుస్తకాన్ని ఆచార్య మసన చెన్నప్ప స్వీకరిస్తారు. విశిష్ట అతిథులుగా వి.మనోహర్ రెడ్డి, బుర్రి వెంకట్రామారెడ్డి హాజరవుతారు. డాక్టర్ పి.భాస్కరయోగి పుస్తకసమీక్ష చేస్తారు.
- పాలమూరు సాహితి, ధ్వని ప్రచురణలు

ఆహ్వానం

కామిశెట్టి జాతీయ పురస్కారం-2018కి గాను 2015, 16, 17లో ముద్రించబడిన సాహిత్య వ్యాస సంపుటాలను మూడేసి ప్రతులను 2018 సెప్టెంబర్ 5వ తేదీలోపు పంపించాలి. చిరునామా: వీధుల విజయ రాంబాబు, ఇంటి నెం:6-1-83, హెడ్ పోస్టాఫీస్ రోడ్, భద్రాచలం-507111. సెల్: 9440255275
- విజయ రాంబాబు కామిశెట్టి సాహిత్యవేదిక, అధ్యక్షులు

ఆవిష్కరణ సభ

కటుకోజ్వల మనోహరాచారి కవితా సంపుటి అక్షరం- అభిమతంఆవిష్కరణ సభ 2018 ఆగస్టు 11న మధ్యాన్నం 2 గంటలకు కోరుట్లలోని వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయంలో జరుగుతుంది. ముఖ్య అతిథిగా నందిని సిధారెడ్డి హాజరవుతున్న ఈ సభ లో సువర్ణ వినాయక్, దాస్యం సేనాధిపతి, కల్వకుం ట్ల రామకృష్ణ, ఎస్ అనంతాచార్య తదితరులు హాజరవుతున్నారు.
- వాసాల వేంకటేశ్వర్లు, తెలంగాణ రచయితల సంఘం జగిత్యాల జిల్లా అధ్యక్షులు

కావ్య పరిమళం

తెలంగాణ సాహిత్య అకాడమీ నెలనెలా నిర్వహిస్తున్న కావ్య పరిమళంకార్యక్రమం లో భాగంగా 2018 ఆగస్టు 10న 6 గంటలకు రవీంద్రభారతి మినీ కాన్ఫరెన్స్ హాల్ లో చరిగంటి ధర్మన్న చిత్రభారతంపై డాక్ట ర్ సంగనభట్ల నరసయ్య ప్రసంగిస్తారు. సభకు నందిని సిధారెడ్డి అధ్యక్షత వహిస్తా రు.
-డాక్టర్ ఏనుగు నరసింహారెడ్డి తెలంగాణ సాహిత్య అకాడమీ కార్యదర్శి

1005
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles