ఆవిష్కరణ సభ


Sun,July 29, 2018 11:22 PM

ఆచార్య జి. చెన్నకేశవరెడ్డి రచించిన మకాం మార్చిన మణిదీపం కవితా సంపుటి, అక్షరవ్యాసం సాహిత్య వ్యాస సంపుటి ఆవిష్కరణ సభ 2018 ఆగస్టు 4న సాయంత్రం 6 గంటలకు, హైదరాబాద్ రవీంద్రభారతి సమావేశ మందిరంలో జరుగుతుంది. బి. నర్సింగరావు అధ్యక్షతన జరుగు సభలో వక్తలుగా వెలుదండ నిత్యానందరావు, డాక్టర్ నాళేశ్వరం శంకరం హాజరవుతారు. సభా ప్రారంభకులుగా ఆచార్య ఎల్లూరి శివారెడ్డి, ముఖ్య అతిథిగా ఆచార్య కొలకలూరి ఇనాక్, ఆవిష్కర్తగా డాక్టర్ నందిని సిధారెడ్డి, స్వీకర్తగా డాక్టర్ అమ్మంగి వేణుగోపాల్ పాల్గొంటారు. గౌరవ అతిథులుగా డాక్టర్ నోముల సత్యనారాయణ, ఆచార్య పి. లక్ష్మినారాయణ, డాక్టర్. ఎం.కె. రాము, ఎ. సూర్యప్రకాశ్, ఆచార్య ఎం. శంకరరెడ్డి, డాక్టర్ గంటా జలంధర్‌రెడ్డి హాజరవుతారు
- వేణు సంకోజు, జయమిత్ర సాహిత్య సాంస్కృతిక సంస్థ.

‘దూద్ బాయి’ ఆవిష్కరణ

కనకం శ్రీనివాస్ దూద్ బాయి నానీల పుస్తకావిష్కరణ 2018, ఆగస్టు 1న సాయంత్రం 6 గంటలకు, కరీంనగర్‌లోని ఫిలిమ్ భవన్‌లో జరుగుతుంది. కూకట్ల తిరుపతి అధ్యక్షతన జరుగు సభలో అతిథులుగా గులాబీల మల్లారెడ్డి, రాకుమార, కోహెడ చంద్రమౌళి, కనకం రమణయ్య హాజరవుతారు. ముఖ్య అతిథి: గాజోజు నాగభూషణం, పుస్తకపరిచయం: సి.వి. కుమార్. సమావేశ కర్తగా తప్పెట ఓదయ్య, సమాపనం: విలాసాగరం రవీందర్ చేస్తారు.
- కామారపు అశోక్ కుమార్, పెనుగొండ సరసిజ
తెలంగాణ రచయితల వేదిక, కరీంనగర్ జిలా


‘సమన్వయ’ ఆవిష్కరణ సభ

డాక్టర్ ఎస్. రఘు సాహిత్య వ్యాస సంపుటి ఆవిష్కరణ సభ 2018 జూలై 30న సాయంత్రం 5.30 గంటలకు హైదరాబాద్, సుందరయ్య విజ్ఞానకేంద్రం, మినీహాల్‌లో జరుగుతుంది. జూలూరు గౌరీశంకర్ అధ్యక్షతన జరుగు సభలో అతిథులుగా డాక్టర్ నందిని సిధారెడ్డి, ఎం. వేదకుమార్, ఆచార్య సూర్యధనుంజయ్ హాజరవుతారు. గ్రంథ పరియయం: డాక్టర్ సీతారాం చేస్తారు. కృతి స్వీకర్త: ఆచార్య ఎన్.గోపి.
నిర్వహణ: హైదరాబాద్ బుక్ ఫెయిర్

చర్చావేదిక, అవార్డు ప్రదానోత్సవం

సహకార సంఘాలు-సామాజిక బాధ్యత చర్చావేదిక కార్యక్రమం 2018, ఆగస్టు 2న సాయంత్రం 4 గంటలకు, న్యూఢిల్లీలోని నేషనల్ కో ఆపరేటివ్ యూనియన్ ఆఫ్ ఇండియా క్యాంపస్‌లో జరుగుతుంది. ముఖ్య అతిథులుగా బండారు దత్తాత్రేయ, డాక్టర్ ఎస్. వేణుగోపాలాచారి, ఎ.పి. జితేందర్‌రెడ్డి, బండ ప్రకాశ్, పసునూరు దయాకర్, మంద జగన్నాథం, ఎన్. సత్యనారాయణ, జి.జయపాల్ యాదవ్ హాజరవుతారు.
- తిప్పనేని రామదాసప్ప నాయుడు
ముద్ర వ్యవసాయ నైపుణ్యాభివృద్ధి బహుళార్థ సహకార సంఘం, చైర్మన్

548
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles