రాచపాళెం పీఠికలు


Sun,July 22, 2018 11:03 PM

nagendra
తెలుగు వాఙ్మయంలో వచన రచన అర్వాచీ నం. శాస్త్రీయమూ, చారిత్రకమూ అయిన సాహిత్య విమర్శ కూడా అధునాతనమే. సీపీ బ్రౌన్ గ్రంథపరిష్కరణ విద్యను అంటిపెట్టుకొని ప్రచారానికి వచ్చిన ఒకానొక సాహిత్య వ్యాసంగం పీఠికారచన. పీఠికారచన ఒక కళగా భావించి వైయక్తికమైన ముద్రతో విలక్షణమైన ఫక్కీలో పీఠికలు రాసిన వారిలో రాచపాళెం ఒకరు.

సంకలనం:

డాక్టర్ తన్నీరు నాగేంద్ర, వెల:రూ.150 ప్రతులకు: డాక్టర్ టి.నాగేంద్ర, పాలిం గ్రామం (పోస్ట్)మం: పామిడి, జిల్లా అనంతపురం, ఏపీ, సెల్:9949344032
book3

మూలజాతుల రాజ్యాధికారంతోనే కులరహిత భారతం

అంబేద్కరిజం త్రివర్ణ ఆధిపత్య నిర్మూలన, బహుజన రాజ్యాధికార స్థాపన. త్రివర్ణాలు చేసే అన్నిరకాల అణిచివేతల నుంచీ, బహుజనులు విడుదలయ్యే స్వేచ్ఛ, అన్ని జాతులు, వర్ణాలూ ఒకరితో ఒకరు కలిసిమెలిసి ఉండగలిగే సమానత్వం బోధించింది అంబేద్కరిజం. అంబేద్కర్ చెప్పిన కాస్ట్ డెమొక్రసీ, త్రివర్ణ ఆధిపత్య నిర్మూలన జరుగాలంటే కులరహిత భారతంతోనే సాధ్యమంటాడు రచయిత.

రచన:

డా॥ కాలువ మల్లయ్య, వెల: రూ.150, ప్రతులకు: సమాంతర బుక్ హౌస్, 11-6-868/10, ఫస్ట్ ఫ్లోర్, రెడ్ హిల్స్ రోడ్,లకిడీకాపూల్, హైదరాబాద్-04. ఫోన్:9246265673
book2

దోస్తులు చెప్పిన కథలు

బాల్యంతో పెనవేసుకున్న ఒక గొప్ప అనుబంధం జానపద కథలది. పెద్దల ముఖత, తోటి వారి ద్వారా మనం వందలాది కథలు వినే ఉం టాం. అలా చిన్నప్పుడు తన మిత్రులు చెప్పిన అనేక కథల్లోంచి అచ్చమైన ఇరువై జానపద కథలను ఎంపిక చేసుకొని, స్వచ్ఛమైన తెలంగాణ పల్లెపిల్లల భాషలో రచయిత పెండెం జగదీశ్వర్ పుస్తకంగా అందించారు. ఇవి తెలంగాణ పల్లె పదాల్లోంచి ఊడిపడినట్లుగా అనిపిస్తాయి. భాషాపరమైన సహజత్వాన్ని చవి చూపిస్తాయి.

రచన:

పెండెం జగదీశ్వర్ వెల: రూ.40, ప్రతులకు: మంచి పుస్తకం, 12-13-439, వీధి నెం:1తార్నాక, సికింద్రాబాద్-17

854
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles