పెండెం జగదీశ్వర్ సంస్మరణ సభ


Sun,July 22, 2018 11:00 PM

box
బాలసాహితీ వేత్త పెండెం జగదీశ్వర్ సంస్మరణ సభ 2018 జూలై 25 సాయంత్రం 6 గంటలకు హైదరాబాద్ సుందరయ్య విజ్ఞానకేంద్రంలో జరుగుతుంది. భూపతి వెంకటేశ్వర్లు అధ్యక్షతన జరుగు సభలో ఏనుగు నరసింహారెడ్డి, కె. ఆనందాచారి, పత్తిపాక మోహన్, డాక్టర్ వి.ఆర్.శర్మ వక్తులుగా పాల్గొంటారు. తంగిరాల చక్రవర్తి, అనంతోజు మోహన్ కృష్ణ సమన్వయకర్తలుగా వ్యవహరిస్తారు.
- తెలంగాణ సాహితి

పుస్తకావిష్కరణ

జ్ఞానపీఠ ఆవార్డు గ్రహీత స్వర్గీయ సినారె 87వ జయంతిని పురస్కరించుకుని 2018జూలై 29న మల్కాజిగిరిలోని గౌతంనగర్ కమ్యూనిటీహాలులో ఉదయం 10గంటల నుంచి, మేడ్చల్- మల్కాజి గిరి జిల్లా అనుబంధ కవుల నుంచి సేకరించిన కవితల సమాహారం కవి విశ్వంభరుడు కవితా సంకలనం ఆవిష్కరించబడుతుంది. నాళేశ్వరం శంకరం సభాధ్యక్షులుగా వ్యవహరించే సభలో ఆయాచితం శ్రీధర్ ముఖ్యఅతిథిగా, పత్తిపాక మోహన్ ఆత్మీ య అతిథిగా హాజరవుతారు. పుస్తకావిష్కరణ అనంతరం కవి సమ్మేళనం ఉంటుంది. గోగులపా టి కృష్ణమోహన్, రమాదేవి కులకర్ణి తదితరులు సభా సమన్వయకర్తలుగా వ్యవహరిస్తారు.
- మేడ్చల్, మల్కాజిగిరి జిల్లా రచయితల సంఘం

దేశభక్తి గీతాలు, కవితల పోటీ

దేశభక్తుల సంక్షేమ సంఘం మంచిర్యాల తరఫు న హిందూ ముస్లింల ఐక్యత వర్ధిల్లాలి అంశం పై దేశభక్తిగీతాలు, కవితల పోటీ నిర్వహించాలని తలపెట్టాము. రచయితలు కవులు తమ రచనలను ఆగస్టు 15వ తేదీలోపు పంపించాలని మనవి. గీతా లు 20 లైన్లు, కవితలు 30-40 లైన్లలోపు ఉం డా లి. చిరునామా: సూదిరెడ్డి నరేందర్‌రెడ్డి, ఇంటి నెం: 20-183/4, ఎడ్లవాడ, కాలేజీ రోడ్డు, మంచిర్యా ల - 504208, సెల్: 9440383277
- దేశ భక్తుల సంక్షేమ సంఘం, మంచిర్యాల

528
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles