సింగిల్ పేజీ కథల పోటీ


Mon,July 16, 2018 12:45 AM

అక్షరాల తోవసాహిత్య సారథి ఆధ్వర్యంలో జాతీయస్థాయి సింగిల్‌పేజీ కథల పోటీకి రచనలు ఆహ్వానిస్తున్నాం. కథ, చేతిరాత లేదా డీటీపీ ద్వారా అయినా ఏఫోర్ సైజ్‌లో ఒక పేజీ మాత్ర మే ఉండాలి. ఒక రచయిత ఒక కథను మాత్రమే పంపాలి. కథలు పంపాల్సిన చివరి తేదీ ఆగస్టు 31,2018. చిరునామా: రాచమళ్ల ఉపేందర్, C/o మణికంఠ ఆఫ్‌సెట్ ప్రింటర్స్, శాంతి లాడ్జి పక్కన, స్టేషన్ రోడ్ ఖమ్మం. వివరాలకు: 9849277968
- నామా పురుషోత్తం, 9866645218
- దాసరోజు శ్రీనివాస్, 9010972169


కవిసమ్మేళనం

తెలంగాణ సాహిత్య సమాఖ్య ఆధ్వర్యంలో కవి సమ్మేళనం హైదరాబాద్, అశోక్‌నగర్, సిటీ సెంట్రల్ లైబ్రరీలో 2018, జూలై 22న మధ్యా హ్నం 3 గంటలకు జరుగుతుంది. చినుకు సవ్వ డి కవి సమ్మేళనానికి తమ్మనబోయిన వాసు అధ్యక్షత వహిస్తారు. ఆత్మీయ అతిథిగా అయాచి తం శ్రీధర్ పాల్గొంటారు. అందరికీ ఆహ్వానం.
- తెలంగాణ సాహిత్య సమాఖ్య

ఆవిష్కరణ సభ

చింతపట్ల సుదర్శన్ అనువాద నవల జేమ్స్ జాయిస్ యువకళాకారుని ఆత్మగీతం ఆవిష్కర ణ సభ హైదరాబాద్, సుందరయ్య విజ్ఞానకేంద్రం షోయబ్ హాల్‌లో 2018 జూలై 16న సాయంత్రం 6 గంటలకు జరుగుతుంది. ఆచార్య ఎస్వీ సత్యనారాయణ అధ్యక్షతన జరుగు సభలో కె. శివారెడ్డి, ఏనుగు నరసింహారెడ్డి, సిద్ధార్థ, ఆడెపు లక్ష్మీపతి, కె.పి.అశోక్‌కుమార్ తదితరులు హాజరవుతారు.
- పాలపిట్ట బుక్స్

స్కేర్ వన్ ఆవిష్కరణ సభ

మోహన్ రుషి రచించిన స్కేర్ వన్ ఆవిష్కరణ సభ హైదారాబాద్, ఇందిరాపార్క్ దగ్గరలోని హైదరాబాద్ స్టడీ సర్కిల్, ఆడిటోరియంలో 201 8 జూలై 17న సాయంత్రం 5 గంటలకు జరుగుతుంది. కవి యాకూబ్ అధ్యక్షతన జరుగు సభలో గోరటి వెంకన్న, సిద్ధార్థ, దెంచనాల శ్రీనివాస్ ఆత్మీయ అతిథులుగా హాజరవుతారు. వక్తలుగా అంబటి సురేంద్రరాజు, పెన్నా శివరామకృష్ణ, సుమనస్పతిరెడ్డి హాజరవుతారు. విశిష్ట అతిథిగా దీవి సుబ్బారావు, ఆవిష్కర్తగా నగ్నముని హాజరవుతున్నారు. అందరికీ ఆహ్వానం.

623
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles