విహంగ వీక్షణం ‘బీసీ నోట్‌బుక్’


Sun,July 8, 2018 10:56 PM

విహంగ వీక్షణంగా బీసీ నోట్‌బుక్ పుస్తకం చదివితే ప్రతి ఒక్క రికి అనేక విషయాలను అరటిపండు ఒలిచి పెట్టినట్లుగా సులభంగా అర్థమవుతాయి. ఎంతోమంది న్యాయకోవిదులు, న్యాయవాదులు న్నప్పటికీ తెలుగులో ఇంత చక్కని పుస్తకం రాసే అవకాశం బీఎస్ రాములుకు దక్కడం ఒక చారిత్రక విశేషం.
bc-notebook
భారత రాజ్యాంగ డ్రాఫ్ట్ కమిటీ అధ్యక్షులుగా డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాజ్యాంగానికి సమగ్రత చేకూర్చడంలో ఎంతో ముందుచూపు కనబరిచారు. పలు దేశాల రాజ్యాంగాలను, వారి అనుభవాలను అధ్యయనం చేశారు. భారతీయ సమాజ పరిణామాలను, చరిత్ర పరిణామాలను క్షుణ్ణంగా అర్థం చేసుకున్నారు. వర్ణ, కుల వ్యవస్థల అసమానతలు, వివక్షలకు తావులేని విధంగా అందరూ సమానంగా ఎదుగడానికి, అందరిని సమానంగా చూడటానికి సార్వత్రిక వయోజన ఓటు హక్కును ఆమోదించారు. ప్రతి మనిషికి ఒకే విలువ, ఒకే ఓటు, ప్రతి ఒక్కరూ ఎదుగడానికి కొన్ని సామాజికవర్గాల పట్ల ప్రత్యేక కృషి, అవకాశాలు, శ్రద్ధ గురించి పొందుపరిచారు.

అట్లా భారత రాజ్యాంగంలో 395 ఆర్టికల్స్ పొందుపరుచబడినా యి. ఈ పుస్తకంలో బి.ఎస్.రాములు 70 ఏండ్ల స్వాతంత్య్రం తర్వా త నూతన శతాబ్దిలో నూతన అవసరాలు, నూతన చైతన్యం ఆవశ్యకతను అనుసరించి బీసీ సామాజికవర్గాలకు సంబంధించి ప్రధానమైన, ప్రత్యేకమైన ఆర్టికల్స్‌ను ఒక్కచోటకు తెచ్చారు. సమాజ పరిణామాలను అనుసరించి, ఆయా సామాజికవర్గాల్లో కలిగిన అభిప్రాయాలను ఒక్కచోట కూర్చడం హర్షణీయం. మండల్ కమిషన్ రిపోర్ట్ పూర్తిగా అమలు జరిగితే ఎన్నో సమస్యలు పరిష్కరించబడేవి. బీపీ మండల్ వలె బీఎస్ రాములు పలు పార్శ్వాలను, సమగ్ర సా మాజిక వికాసాన్ని, అందుకు మార్గాలను ప్రస్తావించారు, ప్రతిపాదించారు. ఇవి పరిశీలనార్హమైనవి. ఇది ఒక డ్రాఫ్ట్. తుది రూపం ఇవ్వడానికి మెరుగులుదిద్దడానికి అనేక గోష్టులు, చర్చలు, పలు కోణాల్లో పునర్వివేచన అవసరం.

బీసీల గురించి, ఓబీసీల గురించి రాజ్యాంగం ఏం చెబుతున్నదో తెలుసుకోవడం అందరికీ అవసరమే. ఎన్ని ఉద్యమాల తర్వాత ఎన్ని రాజ్యాంగ సవరణల తర్వాత బీసీ, ఓబీసీలకు ఏయే ఆర్టికల్స్‌లో మార్పుచేర్పులు చేసి పొందుపరిచారో సంక్షిప్తంగానైనా ప్రజలు, విద్యావంతులు, రాజకీయ నాయకు లు, జనరల్ క్యాటగిరీకి చెందినవా రు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు తెలుసుకున్నప్పుడే సామాజిక న్యాయం కోసం జరిగిన ఉద్యమాలు సామాజిక మార్పు కోసం శాంతియుత పరివర్తన ద్వారా సాధించడానికి ఆయా ఆర్టికల్స్, ప్రత్యేక పరిష్కారాలు, ప్రత్యేక ఆర్టికల్స్ పొందుపరిచిన క్రమం సత్ఫలితాలను ఇస్తుంది.

శతాబ్దాలుగా శూద్రులు, అతిశూద్రులు, ఆదివాసులు ఈ దేశానికి మూలవేళ్ళు, పట్టుగొమ్మలు. వారు లేనిది ఈ దేశ సంపద లేదు. ఈ దేశ ఉత్పత్తి నైపుణ్యం లేదు. పారిశ్రామికీకరణ, వలస పాలన పరిణామాల్లో వీరు ఆధునిక విద్య నైపుణ్యాలు, ఉపాధి అవకాశాలు, పారిశ్రామికవేత్తలుగా ఎదుగడం, తమ రాజకీయ వాటా పొందడంలో పోటీ పడలేకపోయారు. అందువల్ల వీరికోసం ప్రత్యేక కృషి, ప్రత్యేక ఆర్టికల్స్, ప్రత్యేక కార్యక్రమాలు, పథకాలు అవసరమయ్యాయి. అం దుకు ఏయే ఆర్టికల్స్ చేర్చబడినాయో తెలుసుకోవడం ద్వారా వాటిని పొందడానికి చేసే కృషి సఫలమవుతుంది.

విహంగ వీక్షణంగా బీసీ నోట్‌బుక్ పుస్తకం చదివితే ప్రతి ఒక్క రికి అనేక విషయాలను అరటిపండు ఒలిచి పెట్టినట్లుగా సులభంగా అర్థమవుతాయి. ఎంతోమంది న్యాయకోవిదులు, న్యాయవాదులు న్నప్పటికీ తెలుగులో ఇంత చక్కని పుస్తకం రాసే అవకాశం బీఎస్ రాములుకు దక్కడం ఒక చారిత్రక విశేషం. రాజ్యాంగాన్ని వడపోసి సరళంగా అందరికీ అర్థమయ్యే విధంగా రాసి అందిస్తున్న సామాజి క తత్త్వవేత్త, తెలంగాణ రాష్ట్ర తొలి బీసీ కమిషన్ చైర్మన్ బీఎస్ రాము లు గారికి అభినందనలు.
- జస్టిస్ వి.ఈశ్వరయ్య
(వ్యాసకర్త: జాతీయ బీసీ కమిషన్ పూర్వ చైర్మన్)

593
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles