కావ్య పరిమళం


Sun,July 8, 2018 10:55 PM

nt
తెలంగాణ సాహిత్య అకాడమీ నెలనెల కావ్య పరిమళం శీర్షిక క్రమంలో 2018, జూలై 13వ తేదీన సాయంత్రం 6 గంటలకు భారతి మినీ కాన్ఫరెన్స్ హాల్‌లో కొరవి గోపరాజు ప్రణీతంబైన సింహాసన ద్వాత్రింశికపై డాక్టర్ రంగాచార్య ప్రసంగిస్తారు. డాక్టర్ నందిని సిధారెడ్డి అధ్యక్షత వహిస్తారు. అందరికీ ఆహ్వానం.
- డాక్టర్ ఏనుగు నరసింహారెడ్డి, కార్యదర్శి తెలంగాణ సాహిత్య అకాడమీ

పుస్తకావిష్కరణ

తెలంగాణ రచయితల వేదిక, కరీంనగర్ ఆధ్వర్యంలో కరీంనగర్‌లోని ఫిల్మ్ భవన్‌లో 2018, జూలై 9వ తేదీ సోమవారం సాయంత్రం 6 గంటలకు విలాసాగరం రవీందర్ రాసిన నానీల నిప్కలు పుస్తకావిష్కరణ జరుగనున్నది. సభాధ్యక్షులుగా కూకట్ల తిరుపతి, ముఖ్యఅతిథి, ఆవిష్కర్తగా డాక్టర్ నలిమెల భాస్కర్, అతిథులుగా గాజో జు నాగభూషణం, అన్నవరం దేవేందర్, డాక్టర్ బీవీఎన్ స్వామి, అన్వర్, తొడుపునూరి లక్ష్మీనారాయణ, తోట నిర్మలారాణి, పెనుగొండ బసవేశ్వర్, దామరకుంట శంకరయ్యలు హాజరుకానున్నారు.
- మహ్మద్ నసీరుద్దీన్, కార్యదర్శి,
- సీవీ కుమార్, ప్రధాన కార్యదర్శి
తెలంగాణ రచయితల వేదిక, కరీంనగర్ జిల్లా


పుస్తకావిష్కరణ

తెలంగాణ సాహితి ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రం వేదికగా 2018, జూలై 14వ తేదీన నర్మద రెడ్డి రాసిన ఆగదు మా ప్రయాణం పుస్తక పరిచయ సభ జరుగనున్నది. ముఖ్యఅతిథిగా బుర్రా వెంకటేశం, సభాధ్యక్షులుగా భూపతి వెంకటేశ్వర్లు, గౌరవ అతిథులుగా ఎస్.వీరయ్య, ప్రొఫెసర్ నారాయణరావు, తంగిరాల చక్రవర్తి, మోహన్‌కృష్ణలు హాజరవనున్నారు. అందరికీ ఆహ్వానం.
- తెలంగాణ సాహితి

658
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles