బొజ్జాతారకం స్మృతులు-సభ


Mon,June 25, 2018 01:18 AM

పౌర, ప్రజాస్వామ్య హక్కుల నేత, దళిత ఉద్యమకారుడు, సాహితీ వేత్త బొజ్జాతారకం జయంతి సభ 2018 జూన్ 27న సాయంత్రం 5.30 గంటలకు, హైదరాబాద్, నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లోని తెలుగు యూనివర్సిటీ ఎన్టీఆర్ ఆడిటోరియంలో జరుగుతుంది. కాకి మాధవరావు అధ్యక్షతన జరుగు సభలో ఆచార్య ఎస్వీ సత్యనారాయణ, ఎ.సత్యప్రసాద్, ఎం.ప్రేమ్‌కుమార్, జి. కళ్యాణరావు, గీతారామస్వామి, నరేన్ బెడిదే (కుఫిర్), కె.వి.రత్నం వక్తలుగా హాజరవుతారు. ముఖ్య అతిథి జస్టిస్ యం.ఎన్. రావు. ఈ సందర్భంగా ఆయన జ్ఞాపకాల సంచిక A Gentle Warrior ఆవిష్కరణ ఉంటుంది. తారకం రాసిన Mahad: The march thats launched every day పుస్తకం వెలువడుతున్నది.
-బొజ్జా తారకం ట్రస్ట్, హైదరాబాద్ బుక్ ట్రస్ట్


ఎవరి దుఃఖమో అది! ఆవిష్కరణ సభ

ఆచార్య ఎన్.గోపి రచించిన ఎవరి దుఃఖమో అది!ఆవిష్కరణ సభ నేడు సా.6 గంటలకు హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో జరుగుతుంది. డాక్టర్ వి.పార్వతీశం అధ్యక్షతన జరుగు సభలో ముఖ్యఅతిథిగా జలజం సత్యనారాయణ, విశిష్ట అతిథిగా మామిడి హరికృష్ణ హాజరవుతారు. గ్రంథ సమాలోచనం సీతారామ్, కృతి స్వీకర్తగా డాక్టర్ పి.వెంకటేశ్వరరావు హాజరవుతారు.
- తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ, కిన్నెర ఆర్ట్ థియేటర్స్

కాలం గీసిన రేఖలు- ఆవిష్కరణ

మహ్మద్ నసీరుద్దీన్ కవిత్వం కాలం గీసినరేఖలు ఆవిష్కరణ సభ 2018 జూన్ 30న సాయంత్రం 6 గంటలకు, కరీంనగర్ ఫిలిం సొసైటీ భవన్‌లో జరుగుతుంది. డాక్టర్ నలిమెల భాస్కర్, కవి యాకూబ్, గాజోజు నాగభూషణం, అన్నవరం దేవేందర్, లాయక్ అలీ వార్శి, కందుకూరి అంజయ్య, బూర్ల వేంకటేశ్వర్లు తదితరులు హాజరవుతారు.
- కూకుట్ల తిరుపతి, తెలంగాణ రచయితల వేదిక, కరీంనగర్

532
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles