మూలమలుపు ఆవిష్కరణ సభ


Mon,June 11, 2018 12:53 AM

ఏనుగు నరసింహారెడ్డి కవితా సంపుటి మూలమలుపు ఆవిష్కరణ సభ 2018 జూన్ 14న సాయంత్రం 6 గంటలకు హైదరాబాద్, రవీంద్రభారతి మినీ కాన్ఫరెన్స్‌హాల్‌లో జరుగుతుంది. డాక్టర్ కెవి రమణాచారి అధ్యక్షతన జరుగు సభలో గౌరవ అతిథులుగా ఆచార్య ఎస్వీ సత్యనారాయణ, దేశపతి శ్రీనివాస్, కోయి కోటేశ్వరరావు, కొల్లాపురం విమల, ఎం. నారాయణ శర్మ హాజరవుతారు. గ్రంథావిష్కర్త డాక్టర్ సుంకిరెడ్డి నారాయణరెడ్డి, స్వీకర్త ఎం. రఘునందన్‌రావు.
- పాలపిట్ట బుక్స్, హైదరాబాద్ జలగీతమ్, జలగీతం-కావ్యసమాలోచనం

గ్రంథాల ఆవిష్కరణ సభ

డాక్టర్ ఎన్.గోపి రచించిన జలగీతం కావ్యానికి సంస్కృతానువాదం జలగీతమ్, ఎన్. గోపి జలగీతం-కావ్యసమాలోచనం గ్రంథాల ఆవిష్కరణ సభ 2018 జూన్ 11న సాయంత్రం6 గంటలకు, హైదరాబాద్‌లోని రవీంద్రభారతి సమావేశ మందిరంలో జరుగుతుంది. డాక్టర్ పత్తిపాక మోహన్ అధ్యక్షతన జరుగు సభలో ముఖ్య అతిథులుగా డాక్టర్ కెవి రమణ, ఆచార్య జి.ఎస్.ఆర్. కృష్ణమూర్తి హాజరవుతారు. గౌరవ అతిథులుగా డాక్టర్ ఎన్.గోపి, మామిడి హరికృష్ణ, జలజం సత్యనారాయణ, డాక్టర్ ప్రభాకర్ జైని తదితరులు హాజరవుతారు.
- భాషా సాంస్కృతిక శాఖ, తెలంగాణ ప్రభుత్వం
- దక్కన్ సాహిత్య సభ


నడిచే దారిలో... ఆవిష్కరణ సభ

కవిసంధ్య, స్ఫూర్తి సాహితీ సంయుక్త నిర్వహణలో సురేంద్రదేవ్ చెల్లి కవితా సంపుటి నడిచే దరిలో... ఆవిష్కరణ సభ 2018 జూన్ 16న సాయంత్రం 6 గంటలకు యానాం, అంబేడ్కర్‌నగర్ కమ్యూనిటీ హాల్‌లో జరుగుతుంది. డాక్టర్ శిఖామణి అధ్యక్షతన జరుగు సభలో పుదుచ్చేరి మంత్రి మల్లాడి కృష్ణారావు ముఖ్యఅతిథిగా గ్రంథాన్ని ఆవిష్కరిస్తారు. గౌరవ అతిథులుగా దవులూరి సుబ్రమణ్యేశ్వర రావు, జి. లక్ష్మీనరసయ్య, ఆర్. సీతారాం, ప్రసాదమూర్తి, యాకూబ్, మువ్వా శ్రీనివాసరావు, దాట్ల దేవదానం రాజు, మధునాపంతుల, నామాడి శ్రీధర్, బొల్లోజు బాబా తదితరులు పాల్గొంటారు.
- కవిసంధ్య, యానాం

మేడ్చల్ జిల్లా సాహిత్య చరిత్ర

తెలంగాణ సాహిత్య అకాడమీ ఆధ్వర్యంలో మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా సాహిత్య చరిత్రపై పరిశోధన జరుగుతున్నది. జిల్లాలోని కవులు, పూర్వ కవుల సమాచారం, రచనలను పంపాలని కోరుతున్నాం. అలాగే ఆధునిక కవులు, రచయితలు తమ వివరాలను, ప్రచురిత గ్రంథాలను అందజేయాలని కోరుతున్నాం. చిరునామా: డాక్టర్ రాయారావు సూర్యప్రకాశ్‌రావు, 9441046839 సంప్రదించాల్సిందిగా మనవి.
- మేడ్చల్ సాహిత్య వేదిక

646
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles