సాహిత్య సదస్సు


Mon,May 28, 2018 01:56 AM

మహాకవి శేషేంద్రశర్మ 11వ వర్ధంతిని పురస్కరించుకొని జయిని ఇంటర్నేషనల్ ఫౌండేషన్ సాహిత్య సదస్సును 2018 మే 30న సాయంత్రం 6 గంటలకు హైదరాబాద్‌లోని త్యాగరాయ గానసభలో నిర్వహిస్తున్నది. కృష్ణ బిక్కి అధ్యక్షతన జరుగు సదస్సులో డాక్టర్ తెన్నేటి సుధాదేవి, కళా జనార్ద న మూర్తి పాల్గొంటారు. జస్టిస్ చంద్రకుమార్ ముఖ్యఅతిథిగా హాజరవుతారు. గన్న కృష్ణమూర్తి శేషేంద్ర స్మారకోపన్యాసం చేస్తారు.
- సాత్యకి, గుంటూరు శేషేంద్ర శర్మ మెమోరియల్ ట్రస్ట్

నల్ల చామంతి ఆవిష్కరణ సభ

చిత్తలూరి సత్యనారాయణ కవితా సంపుటి నల్ల చామంతి ఆవిష్కరణ సభ 2018 మే 31న సాయంత్రం 6 గంటలకు హైదరాబాద్ సుందరయ్య విజ్ఞానకేంద్రంలోని షోయబ్‌హాల్‌లో జరుగుతుంది. ఏనుగు నరసింహారెడ్డి అధ్యక్షతన జరుగు సభలో అతిథులుగా నందిని సిధారెడ్డి, కె.శివారెడ్డి, జి. లక్ష్మీనరసయ్య, గుడిపాటి, పసుపులేటి చంద్రారెడ్డి పాల్గొంటారు.
- పాలపిట్ట బుక్స్

వడ్నాల కిషన్ స్మారక పురస్కారాలు

కవి,నటుడు, దర్మకుడు వడ్నాల కిషన్ స్మారకార్థం వివిధ రంగాల్లో విశిష్ఠ సేవలు చేసిన ఐదుగురికి కరీంనగర్‌కు చెందిన చైతన్య కళాభారతి పురస్కారాలను ప్రకటించింది. రంగస్థలం-రొడ్డ యాదగిరి,సాహిత్యం-అన్నవరం దేవేందర్, నృత్యం-చొప్పరి జయశ్రీ, సంగీతం-తిరునగరి మోహనస్వామి, లఘుచిత్రం-రాదండి సదయ్యలకు ఈ నెల 30న చైతన్య కళాభారతి 34వ వార్షికోత్సవ సభలో పురస్కారాలను ప్రదానం చేస్తారు.
- మందాల రమేశ్, 9866569062

545
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles