నిరుపమాన రచయిత


Mon,May 21, 2018 12:53 AM

Rachayetha

(పొట్లపల్లి రామారావు జీవితం-సాహిత్యం విశ్లేషణ)

కాలం కన్న కవి, రచయిత పొట్లపల్లి రామారావు. సామాజిక తాత్విక చింతనలో కలాన్ని ముంచి జనహితం చేసిన కవులలో అగ్రగణ్యుడు. మిన్నంటే కవిత్వం రాశాడు. గొప్ప నాటకాలు రాశాడు. కీర్తి ప్రతిష్ఠల కోసం వెంపర్లాడని కవి ఆయన.
సంపాదకులు: జయధీర్ తిరుమలరావు
వెల: రూ.170
ప్రతులకు: పొట్లపల్లి వరప్రసాదరావు,
మార్వెల్ రెసిడెన్సీ, ఫ్లాట్ నెం:603, ఇంటి నెం:6-3-1246, సోమాజిగూడ, హైదరాబాద్-82. సెల్: 9490118638


ప్రబంధ వాసుదేవము

Prabhada
త్రిగుళ్ల వాసుదేవ శర్మ ప్రతిభ తో ఈ పుస్తకానికి రూపమిచ్చారు. ఏకదశావతార మూర్తిగా కీర్తిగాంచి న భావానందభారతీ స్వామి పట్ల భక్తి ప్రపత్తులతో కవితార్చన చేశా రు రచయిత. లీలామృతాన్ని గేయఫణితిలో రచించి మృదుమధురంగా గానం చేస్తున్న తీరు అభినందనీయం.
రచన: త్రిగుళ్ల వాసుదేవ శర్మ, ప్రతులకు: త్రిగుళ్ల వాసుదేవ శర్మ, ఇంటి నెం:29-1502/41/11, రేణుకా నగర్, ఆర్‌కే పురం, నేరెడు మెట్టు, సికింద్రాబాద్-56

నిజాం రాష్ట్ర ప్రశంస అను

NIjam

తెలంగాణ రాష్ట్ర ప్రశంస

శేషాద్రి రమణ కవులు జంట కవులే కాదు, సుప్రసిద్ధ చారిత్రక పరిశోధకులు. చరిత్ర ఆధారాల అన్వేషణకు జీవితం అంకితం చేసిన పురాతత్వవేత్తలు. విస్మృ, అలక్ష్య పురావస్తు ఇతివృత్తాన్ని ప్రప్రథమంగా కావ్యం గా మలిచిన సృజనకారులు. దేశీయ భావాలకు, ప్రాం తీయ అస్తిత్వాలకు, జాతీయ ప్రాంతీయ స్వాతంత్య్రోద్యమాల భావాలకు శ్రీకారం.. ఈ తొలి ఆధునిక చరిత్ర కావ్యం.
రచన: శేషాద్రి రమణ కవులు సంపాదకులు: జయధీర్ తిరుమల రావు,
వెల: రూ.100, ప్రతులకు: సాహితీ సర్కిల్, 402, ఘరొండ అపార్ట్‌మెంట్స్, ఓయూ మేయిన్ గేట్ దగ్గర, డీడీ కాలనీ, లేన్-1, హైదరాబాద్-7. ఫోన్:040-27403172


ప్రత్యూష

Prathush

(తెలంగాణ తొలినాటి ఆధునికత్వం)

ప్రత్యూష కవితా సంకలనానికి 1950వ దశకం ప్రారంభంలో తగిన ప్రశంసలు, సానుకూల ప్రతిస్పందనలు లభించాయి. కవితా సంకలన ప్రయత్నం అభినందనీయమని ఆనాటి సమీక్షా వ్యాసాల్లో సాహితీ విమర్శకులు వ్యాఖ్యానించారు. ఈ మేరకు ఆనాటి ప్రచురణ కర్తలు, సంపాదకుల కృషిని సాహితీలోకం సరిగ్గానే గుర్తించింది. కానీ ఆ తర్వాతి కాలంలో అది విస్మరణకు గురైంది. ఎక్కడా ప్రస్తావనకు నోచుకోలేదు. దీనికి వలస పాలనా వివక్ష కారణం. ఆనాటి వెలుగు రేఖలను తిరిగి వెలుగులోకి తెచ్చే ప్రయత్నమే ఈ పుస్తకం.
కూర్పు: సాధన సమితి, సంపాదకులు: సంగిశెట్టి శ్రీనివాస్,
వెల: రూ. 100, ప్రతులకు: తెలంగాణ ప్రచురణలు,
ఇందిరా నివాస్, 3/97, ఓల్డ్ ఆల్వాల్, సికింద్రాబాద్-10. సెల్:9849220321

581
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles