సాహిత్య సదస్సు


Mon,May 21, 2018 12:42 AM

తెలంగాణ సాహిత్య అకాడమీ, యాదాద్రి భువనగిరి జిల్లా రచయితల సంఘం సంయుక్త నిర్వహణలో రాష్ట్రస్థాయి సాహిత్య సదస్సు 2018 మే 22, 23 తేదీల్లో భువనగిరిలోని పశుసంవర్థక శాఖ(ఏరియా హాస్పిటల్ దగ్గర) కాన్ఫరెన్స్ హాలులో జరుగుతుంది. వివిధ సెషన్లలో సభాధ్యక్షులుగా డాక్టర్ పోరెడ్డి రంగయ్య, అభినయ శ్రీనివాస్, దాస్యం సేనాధిపతి, కోట్ల వెంకటేశ్వర్‌రెడ్డి, ఎస్. హరగోపాల్, డాక్టర్ సంగనభట్ల నరసయ్య, డాక్టర్ తూర్పు మల్లారెడ్డి వ్యవహరిస్తారు. డాక్టర్ కూరెళ్ల విఠలాచార్య, డాక్టర్ లింగంపల్లి రామచంద్ర, వేణుసంకోజు, డాక్టర్ సుంకిరెడ్డి నారాయణరెడ్డి, పత్తిపాక మోహన్, ఎస్.రఘు, యం. నారాయణ శర్మ, సుద్దా ల అశోక్ తేజ, ఆచార్య టి. గౌరీశంకర్, డాక్టర్ తిరునగరి, హెచ్‌వీఎల్ ప్రసాదుబాబు, డాక్టర్ నాళేశ్వరం శంకరం, పొట్లపల్లి శ్రీనివాసరావు, జూలూరు గౌరీశంకర్, బైస దేవదాసు, నలిమెల భాస్కర్, ప్రధాన వక్తలుగా హాజరవుతారు. గౌరవ అతిథులుగా డాక్టర్ నందిని సిధారెడ్డి, అనితా రామచంద్రన్, రవి గుగులోతు, ఐ.రామచంద్రారెడ్డి, సుర్విలావణ్య, డాక్టర్ ఎం. జితేందర్‌రెడ్డి, ఎం. వి. భూపాల్‌రెడ్డి, ఎస్. సూరజ్‌కుమార్, జడల అమరేందర్ గౌడ్, డాక్టర్ తిరునగరి రంగయ్య తదితరులు హాజరవుతారు. అందరికీ ఆహ్వానం.
- తెలంగాణ సాహిత్య అకాడమీ
- యాదాద్రి భువనగిరి జిల్లా రచయితల సంఘం


రచనలకు ఆహ్వానం

బాలికలపై జరుగుతున్న అకృత్యాలు, అరాచకాలను నిరసిస్తూ మానవీయ సమాజ నిర్మాణం కోసం కవులు,రచయితల నుంచి రచనలను ఆహ్వానిస్తున్నాం. రచనలు 25లైన్లకు మించకుండా 2018 జూన్ 15లోపు అందేట్లు పంపించాలి.చిరునామా: బిల్ల మహేందర్, 35-7-674, టీఎన్జీవోస్ కాలనీ, ఫేజ్-2, హన్మకొండ, వరంగల్- 506370. మెయిల్: billamahis ari@gmail.com వివరాలకు:9177 604430.
- తెలంగాణ రచయితల సంఘం, వరంగల్

మానవతా గీత ఆవిష్కరణ

తిరునగరి పద్మానళినీ మోహన్ ఆధ్వర్యంలో డాక్టర్ కూర్మాచలం శంకరస్వామి రచించిన మానవతాగీత ఆవిష్కరణ సభ 2018 మే 27న ఉదయం 10 గంటలకు హైదరాబాద్, ఐడీపీఎల్ కాలనీ, జగద్గిరిగుట్ట రోడ్, గాంధీనగర్, ఈనాడు ఆఫీసు ఎదురుగా స్కైటస్ ఫంక్షన్ హాలులో జరుగుతుంది. డాక్టర్ తిరునగరి అధ్యక్షతన జరుగు సభలో గౌరవ అతిథులుగా డాక్టర్ ఏనుగు నర్సింహారెడ్డి, డాక్టర్ నాళ్వేరం శంకరం, డాక్టర్ అమ్మంగి వేణుగోపాల్, కందుకూరి శ్రీరాములు, డాక్టర్ దాస్యం సేనాధిపతి, వేణుశ్రీ, శివరాత్రి యాదగిరి, హాజరవుతారు. పర్యాద కృష్ణమూర్తి పుస్తకాన్ని ఆవిష్కరిస్తారు. తిరునగరి శ్రీనివాసమూర్తి గ్రంథాన్ని స్వీకరిస్తారు.
- పర్యాద సురేశ్

466
Tags

More News

VIRAL NEWS

Featured Articles